Sonam Wangchuk: సోనం వాంగ్‌చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- ఢిల్లీలో కొనసాగుతోన్న సోనం వాంగ్‌చుక్ దీక్ష
- సోనం కలిసేందుకు వచ్చిన డింపుల్ యాదవ్
- పరిచయాన్ని తప్పుగా పలికిన వ్యాఖ్యాత
- ఒక్కసారిగా నవ్వుకున్న ప్రేక్షకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2026 నీట్-యూజీ పరీక్షలో జరిగిన అక్రమాలపై నిరసనగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. శుక్రవారానికి 20 రోజులు పూర్తయ్యాయి. వాంగ్చుక్కు పలువురు రాజకీయ నాయకులు సంఘీభావం తెలుపుతున్నారు. గురువారం ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కలిసి సంఘీభావం తెల్పగా.. శుక్రవారం అఖిలేష్ యాదవ్ భార్య, ఎంపీ డింపుల్ యాదవ్ కలిశారు.
అయితే డింపుల్ యాదవ్ స్టేజ్‌పైకి వస్తుండగా ఆమెను పరిచయం చేసే క్రమంలో అనౌన్సర్ పొరపాటున డింపుల్ యాదవ్ అని సంభోదించకుండా ‘డింపుల్ కపాడియా జీ’ సోనమ్ వాంగ్చుక్ను కలిసేందుకు వస్తున్నారని పలికాడు. దీంతో దీక్షలో కూర్చున్న వారంతా ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు. ఉద్వేగంగా ఉన్న వాతావరణం కాస్త ఉల్లాసభరితంగా మారిపోయింది.
Also Read
- Jaipur: ఇంట్లో చేసిన నూడుల్స్ తిని ఏడేళ్ల చిన్నారి మృతి.. అక్క పరిస్థితి విషమం..
- Parliament Session December 2026: డిసెంబర్ 10 నుంచి పార్లమెంట్ సమావేశాలు..!?.. కీలక బిల్లుపై ఉత్కంఠ
- Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
- IIT Kharagpur Turns 75: దేశాభివృద్ధిలో ఐఐటీ ఖరగ్‌పూర్ కీలక పాత్ర.. 75 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోడీ ప్రశంసలు!
డింపుల్ కపాడియా ప్రముఖ బాలీవుడ్ నటి. అయితే డింపుల్ యాదవ్ అని పిలవకుండా హీరోయిన్ పేరు ఉచ్ఛరించడంతో దీక్షలో ఉన్నవారంతా నవ్వుల్లో మునిగిపోయారు. అనంతరం వ్యాఖ్యాతకు విషయం తెలియజేయడంతో సరిదిద్దుకున్నాడు. జరిగిన దానికి క్షమాపణ చెప్పి.. ‘‘డింపుల్ యాదవ్ జీ..’’అంటూ సరిచేసి తిరిగి పరిచయం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీట్ ప్రశ్నాపత్రాల లీక్, విద్యా వ్యవస్థలో అవకతవకలు, సీబీఎస్ఈ ఆన్‌స్క్రీన్ మూల్యాంకన విధానంపై నిరసనగా సోనం వాంగ్‌చుక్ గత 20 రోజులుగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. దీక్షకు విపక్ష నాయకులు మద్దతు తెలుపుతున్నారు. ఇక డింపుల్ యాదవ్ పర్యటనకు రెండు రోజుల ముందు ఆమె భర్త, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సోనం వాంగ్‌చుక్‌తో ఫోన్లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని దీక్ష విరమించాలని కోరారు. అనంతరం గురువారం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా జంతర్‌మంతర్‌కు వెళ్లి వాంగ్చుక్కు మద్దతు తెలిపారు.
మరోవైపు వాంగ్‌చుక్ దీక్షపై ఢిల్లీ హైకోర్టు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తొలిసారి స్పందించింది. ప్రభుత్వ వైద్యులు ప్రతిరోజూ ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని, అవసరమైతే తక్షణమే వైద్య సేవలు అందిస్తామని కోర్టుకు హామీ ఇచ్చింది. అలాగే సోనం వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిని ప్రతిరోజూ పరిశీలించాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాల్లో నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కూడా కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అంతేకాకుండా సోనమ్ దీక్షకు మద్దతు కూడా తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాజావార్తలు
-
January 12 Vidudala నుంచి మొదటి సాంగ్ వచ్చేసింది.. డ్యాన్స్‌తో అదరగొట్టిన కీర్తి, కృతి!
-
CM Chandrababu: ఓటుకు నోటు వద్దు.. మంచి నాయకుడిని ఎన్నుకోండి.. ప్రజలకు చంద్రబాబు పిలుపు
-
Jaipur: ఇంట్లో చేసిన నూడుల్స్ తిని ఏడేళ్ల చిన్నారి మృతి.. అక్క పరిస్థితి విషమం..
-
KL Rahul: గ్లెన్ ఫిలిప్స్‌కు డ్రింక్స్ కొనిస్తా.. రివ్యూపై రాహుల్ ఫన్నీ కామెంట్స్!
-
Nasha Mukt Bharat: డ్రగ్స్‌పై పోరుకు విక్టరీ వెంకటేష్ మద్దతు.. హైదరాబాద్‌లో నషా ముక్త్ భారత్ యాత్ర..
ట్రెండింగ్
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!
-
అబ్బా ఏముంది మామ కారు.. 1,100 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో రానున్న JSW Combat..!