Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gambhir-Kohli: భారత క్రికెట్ జట్టులో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీల మధ్య విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వదంతులకు టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ బ్రేక్ వేశారు. వారిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని, ఇద్దరూ నిరంతరం మాట్లాడుకుంటూనే ఉన్నారని స్పష్టం చేశారు. అసలు ఇలాంటి పుకార్లు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో కూడా తనకు అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. వాస్తవానికి.. గతేడాది విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో అతనికున్న సంబంధాలపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికి తోడు, ఇంగ్లాండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్స్‌లో కోహ్లీ, గంభీర్ ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కనిపించలేదు. కోహ్లీ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు గంభీర్ దగ్గరుండి గమనించినప్పటికీ, అతనితో నేరుగా మాట్లాడటానికి వెళ్ళలేదు. ఆ సమయంలో బ్యాటింగ్ కోచ్ కోటక్ మాత్రమే కోహ్లీతో చర్చిస్తూ కనిపించారు. దీంతో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందంటూ వార్తలు గుప్పుమన్నాయి.
వార్తలను కొట్టిపారేసిన బ్యాటింగ్ కోచ్
కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డే ముగిసిన అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సితాన్షు కోటక్ ఈ వివాదంపై స్పందిస్తూ గట్టి సమాధానమిచ్చారు. “విరాట్, గౌతమ్ ఇద్దరూ ఈ ఒక్క రోజే కనీసం 10 సార్లు మాట్లాడుకుని ఉంటారు. వారిద్దరి మధ్య సంభాషణల కోసం మధ్యలో వేరే ఎవరూ వారధిలా ఉండాల్సిన అవసరం లేదు” అని విలేకరులతో అన్నారు. విరాట్ కోహ్లీ లాంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్ మంచి లయలో ఉన్నప్పుడు అతని బ్యాటింగ్ శైలిని అనవసరంగా డిస్టర్బ్ చేయకూడదని కోటక్ అభిప్రాయపడ్డారు. బ్యాటింగ్ కోచ్‌గా కోహ్లీకి ఏదైనా సమస్య అనిపించినప్పుడు మాత్రమే ఫుట్‌వర్క్ లేదా ఇతర సాంకేతిక విషయాలపై తనతో చర్చిస్తాడని, నెట్స్ ప్రాక్టీస్ తర్వాత కూడా మాట్లాడాడని చెప్తూ.. ఈ ఫేక్ రూమర్లను లైట్ తీసుకోవాలన్నారు.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
మ్యాచ్ మధ్యలోనే గంభీర్‌కు కోహ్లీ మెసేజ్..
కార్డిఫ్ వన్డేలో కోహ్లీ 66 బంతుల్లో 65 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపించాడు. అతనితో పాటు శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ చేసినప్పటికీ, మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో భారత్ కేవలం 233 పరుగులకే పరిమితమైంది. అనంతరం జో రూట్ (99 నాటౌట్) అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను సమం చేసింది. అయితే, కోహ్లీ క్రీజులో ఉన్న సమయంలోనే పిచ్ కండిషన్స్ ఎలా ఉన్నాయనే సమాచారాన్ని డ్రెస్సింగ్ రూమ్‌కు, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు నిరంతరం చేరవేస్తూనే ఉన్నాడని కోటక్ వెల్లడించారు. “విరాట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడే మాకు ఒక మెసేజ్ పంపాడు. పిచ్‌పై షార్ట్ పిచ్ బాల్స్ అనుకున్నంత వేగంగా రావడం లేదనే విషయాన్ని హెడ్ కోచ్‌కు ముందే అలర్ట్ చేశాడు” అని కోటక్ పేర్కొన్నారు. దీన్ని బట్టి గంభీర్, కోహ్లీలు జట్టు ప్రయోజనాల కోసం ఎంత కలిసికట్టుగా పనిచేస్తున్నారో అర్థమవుతోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..