144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tecno Camon 50 Ultra 5G: టెక్నో (Tecno) భారత మార్కెట్లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ టెక్నో కామాన్ 50 అల్ట్రా 5G (Tecno Camon 50 Ultra 5G) ను లాంచ్ చేసింది. Camon 30 సిరీస్‌కు వారసుడిగా వచ్చిన ఈ ఫోన్లో 6.78 -అంగుళాల 1.5K 144Hz ProXDR కర్వ్డ్ AMOLED డిస్ప్లే, MediaTek Dimensity 7400 Ultimate ప్రాసెసర్, 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6500mAh బ్యాటరీ వంటి ప్రీమియం ఫీచర్లను అందించింది. అలాగే IP69K వరకు వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో పాటు మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌ను కూడా పొందింది.
144Hz AMOLED డిస్ప్లే:
Tecno Camon 50 Ultra 5Gలో 6.78 అంగుళాల 1.5K (1208×2644 పిక్సెల్స్) ProXDR కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 2800Hz టచ్ శాంప్లింగ్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16పై పనిచేస్తుంది.
Also Read
- NEC Lavie X14: 99.9Wh భారీ బ్యాటరీతో NEC Lavie X14 కొత్త ల్యాప్‌టాప్.. 30 గంటల బ్యాకప్, 32GB RAMతో అదుర్స్!
- ISRO NVS-03: భారత్‌కు మరో అంతరిక్ష విజయం.. NVS-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన GSLV-F18.. ప్రత్యేకతలివే
- Innodata Layoffs: ఇన్నోడేటా ఉద్యోగులకు షాక్.. రాత్రికి రాత్రే 90 శాతం మందికి లేఆఫ్.?
- ISRO NVS-03 Satellite: నేడు రాత్రి 11:51 గంటలకు ఇస్రో కీలక ప్రయోగం.. నింగిలోకి NVS-03 ఉపగ్రహం!
చిప్సెట్:
ఈ ఫోన్‌కు 4nm ప్రాసెస్‌పై రూపొందించిన MediaTek Dimensity 7400 Ultimate ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది. మెరుగైన పనితీరు, గేమింగ్ అనుభవం కోసం ఈ చిప్‌సెట్‌ను ఉపయోగించినట్లు కంపెనీ తెలిపింది.
50MP ట్రిపుల్ కెమెరా:
ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 50MP సోనీ LYT-700C ప్రధాన కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా (3x ఆప్టికల్ జూమ్), 8MP అల్ట్రా-వైడ్ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌తో 4K@30fps వీడియో రికార్డింగ్ చేయవచ్చు.
6500mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్:
ఫోన్లో 6500mAh భారీ బ్యాటరీను అందించారు. దీనికి 45W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజులకుపైగా బ్యాటరీ బ్యాకప్ అందుతుందని టెక్నో తెలిపింది.
ప్రీమియం డ్యూరబిలిటీ:
Tecno Camon 50 Ultra 5Gకు IP66, IP68, IP69, IP69K డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్స్ లభించాయి. అదనంగా MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఉంది. ఫోన్ మందం 7.75mm మాత్రమే.
ధర:
భారత్‌లో Tecno Camon 50 Ultra 5G ప్రారంభ ధర రూ.39,999గా నిర్ణయించారు. అయితే లాంచ్ ఆఫర్లో రూ.3,000 కూపన్ డిస్కౌంట్ లభించడంతో ధర రూ.36,999కు లభిస్తుంది. ఈ ఫోన్ సైప్రస్ గ్రీన్, మిస్టి పర్పుల్, నెబుల టైటానియం రంగుల్లో జూలై 21 నుంచి అమెజాన్ ద్వారా విక్రయాలకు అందుబాటులోకి రానుంది. అలాగే 6 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.
It’s showtime 🤩
Presenting CAMON 50 Ultra 5G. Now in three unique shades!
Packed with:
📸 50MP Sony LYTIA 700C Camera
🔍 50MP 3X Optical Zoom + 8MP Ultra Wide and Macro
📱 6.78-inch 1.5K 144Hz Pro XDR Curved AMOLED Display
💪 6500mAh Battery
⚡ 45W Fast ChargeSale starts… pic.twitter.com/RUNK6zbOkf
— TECNO Mobile India (@TecnoMobileInd) July 17, 2026
తాజావార్తలు
-
Bank Holidays November 2026: నవంబర్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. పూర్తి లిస్ట్ ఇదే, ముందే తెలుసుకోండి!
-
Raptadu School Attack: “కన్నీళ్లు ఆగడం లేదు”.. రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సీరియస్
-
Punjab elections: ఆప్ తొలి జాబితా విడుదల.. ధురి నుంచి సీఎం పోటీ, జైలులో ఉన్న ఎమ్మెల్యేకు టికెట్.
-
Mule Accounts : సైబర్ నేరగాళ్లకు ‘మ్యూల్’ ఖాతాల విక్రయం… అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ముగ్గురు అరెస్ట్!
-
Raptadu School Attack: బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి ఘటన.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!