Pakistan Lawyers Thrash Man Who Tortured, Assaulted Girl Student: పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లో ఇటీవల ఓ వైద్య విద్యార్థినిపై క్రూరంగా ప్రవర్థించి, లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన చర్చనీయాంశం అయింది. తోటి స్నేహితురాలే.. తన తండ్రిని పెళ్లి చేసుకోవాలని కోరగా.. దీనికి నిరాకరించిన యువతిని తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు. అయితే మెడికల్ విద్యార్థినిపై హింస, లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని గురువారం పోలీసులు ఫైసలాబాద్ కోర్టుకు తీసుకువచ్చారు పోలీసులు. ఈ సమయంలోనే కోర్టు […]
Declare lumpy skin disease in cows as pandemic.. Rajasthan CM Gehlot to Centre: రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో లంపీ స్కిన్ డిసీజ్ వల్ల వేలల్లో పశువులు మరణిస్తున్నాయి. రాజస్థాన్ లో ఈ వ్యాధి అల్లకల్లోలం సృష్టిస్తోంది. రాజస్థాన్ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 29 జిల్లాలు ఈ వ్యాధి బారినపడ్డాయి. ఇదిలా ఉంటే ఈ వ్యాధిని మహమ్మారిగా ప్రకటించాలని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సుమారు ఏడు నుంచి 8 రాష్ట్రాలు లంపీ స్కీన్ వ్యాధితో ప్రభావితం…
Soldier Killed In Militant Attack Near Bangladesh Border: భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉగ్రదాడి జరిగింది. త్రిపురలోని భారత్- బంగ్లా సరిహద్దులో ఈ మిలిటెంట్లకు, బీఎస్ఎఫ్ జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో బీఎస్ఎఫ్ జవాన్ మరణించారు. ఉత్తర త్రిపురలోని కంచన్ పూర్ సబ్ డివిజన్ పరిధిలోని అనందబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని మారుమూల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం త్రిపుర-మిజోరాం- బంగ్లాదేశ్ ట్రైజంక్షన్ సమీపంలో ఎన్ఎల్ఎఫ్టీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
PM Narendra Modi comments on Jal Jeevan Mission: దేశంలో ఆగస్టు నాటికి 10 కోట్ల ఇళ్లను ట్యాప్ వాటర్ కనెక్షన్లతో అనుసంధించామని ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ప్రకటించారు. స్వర్ణయుగానికి ఇంతకన్నా మంచి ప్రారంభం ఉండదని వ్యాఖ్యానించారు. ఇంటింటికి నీరు అందించాలనే ప్రభుత్వ లక్ష్యంలో ఇది పెద్ద విజయం అని ఆయన అన్నారు. జల్ జీవన్ మిషన్ కింద కేవలం మూడేళ్లలోనే 7 కోట్ల కుటుంబాలు మంచినీటి సదుపాయాన్ని పొందాయని అన్నారు.
Pilots Fall Asleep At 37,000 Feet: విమానాలు నడిపేటప్పుడు పైలెట్లు, ఇతర క్రూ ఎంతో అలర్ట్ గా ఉంటారు. ఆకాశంలో ఏదైనా నిర్లక్ష్యానికి తావిచ్చినా.. భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. చాలా వరకు విమాన ప్రమాదాలు హ్యమన్ ఎర్రర్స్ తోనే జరుగుతుంటాయి. విమాన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పైలెట్లు నిద్రపోయిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
Women have more intercourse partners than men in 11 states/UTs: పురుషుల కన్నా మహిళలే ఎక్కువ సెక్స్ పార్ట్నర్స్ కలిగి ఉన్నారని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో తేలింది. 11 రాష్ట్రాలు, యూటీల్లో పురుషుల కన్నా స్త్రీలే సగటున ఎక్కువ మంది సెక్స్ భాగస్వాములను కలిగి ఉన్నట్లు తేలింది. అయితే జీవితభాగస్వామి కాకుండా ఇతరులతో లైంగిక సంబంధాలు పెట్టుకున్న పురుషుల శాతం 4 శాతంగా ఉంది. ఇది మహిళల కన్నా 0.5 శాతం ఎక్కువగా ఉందని ఫ్యామిలీ హెల్త్ సర్వేలో తేలింది.
DOLO-65O makers spent Rs 1,000 crore as freebies on doctors for prescribing: మైక్రో ల్యాబ్స్ ఫార్మా కంపెనీపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా సమయంలో డాక్టర్లు ఎక్కువగా డోలో -650 మెడిసిన్ సూచించారు. మైక్రోల్యాబ్స్ ఫార్మా కంపెనీ డోలో-650 ట్యాబ్లెట్లు వేసుకోవాలని డాక్టర్లకు సూచించాలని.. డాక్టర్లకు రూ.1000 కోట్ల తాయితాలు ఇచ్చింది. ఈ కేసుపై విచారించిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. జస్టిస్ డీవై చంద్రచూడ్,…
Bihar Gang Ran Fake Police Station For Eight Months: సాధారణంగా ఫేక్ పోలీసులమని నమ్మించి దోచుకోవడం, మోసాలు చేయడం చూస్తుంటాం. కానీ ఇది మాత్రం నెక్ట్ లెవల్ ఘరానా మోసం. ఏకంగా ఓ నకిలీ పోలీస్ స్టేషన్ తెరిచి దందాలు చేయడం ప్రారంభించారు కేటుగాళ్లు. ఏకంగా ఎనిమిది నెలల నుంచి పోలీస్ స్టేషన్ నడిపింది బీహార్ ముఠా. అయినా కూడా పోలీసులు కనిపెట్ట లేకపోయారు. అది కూడా ఓ అసలైన పోలీస్ అధికారి ఇంటికి కేవలం 500 మీటర్ల దూరంలో ఫేక్…
Rape accused beaten to death by mob after fleeing custody:అత్యాచారం కేసుతో పాటు ఇతర కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తిని గ్రామస్తులు కొట్టిచంపారు. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలోని లఖింపూర్ లోని గిలమారా పోలీస్ స్టేషన్ పరిధిలోని కిలకిలి గ్రామంలో చోటు చేసుకుంది. రాజు బారువా అలియాస్ గెర్జాయ్ ఇటీవల ఓ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు తీసుకెళ్లిన క్రమంలో తప్పించుకున్నాడు. అయితే కిలకిల గ్రామంలోని ఓ వాగు దగ్గర దాక్కుని ఉండడాని గమనించారు కొంతమంది గ్రామస్తులు. అయితే పట్టుకున్న…
Naegleria Fowleri Infection: ప్రపంచంలో కొత్తకొత్త వ్యాధులు వెలుగులోకి వస్తున్నాయి. చైనా వూహాన్ నగరంలో ప్రారంభం అయిన కోవిడ్ 19 వ్యాధి గత రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. చాలా దేశాలు కోవిడ్ తో ఆర్థికమాంద్యం పరిస్థితుల్లోకి వెళ్లాయి. ఇక ఇప్పుడు మంకీపాక్స్ రూపంలో మరో వ్యాధి ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. ఇప్పటికే 92 దేశాల్లోకి ఈ వ్యాధి పాకింది. 35 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఎక్కువగా యూరప్ దేశాలు, అమెరికాలోనే ఎక్కువగా నమోదు అయ్యాయి.