Camel tied to tree, beaten to death for killing owner in Bikaner: రాజస్థాన్ బికనీర్ లో దారుణంగా ఓ ఒంటెను చంపేశారు. జంతువు చేసిన తప్పుకు మానవులే జంతువులుగా మారుతున్నారు. గ్రామస్తులంతా కలిసి ఒంటెను చనిపోయే దాకా చితకబాదారు. ఇంతకీ ఒంటె నేరం ఏమిటంటే.. ఒంటె తన యజమానిని చంపడమే. దీంతో కుటుంబ సభ్యులు, ఆ గ్రామస్తులు అంతా కలిసి ఒంటెను దారుణంగా చంపేశారు. ఈ ఘటన రాజస్థాన్ బికనీర్ లో చోటు చేసుకుంది. ఒంటె, దాని యజమాని మెడను కొరికింది.. ఇది జరిగిన కొద్ది సేపటికే అతను మరణించాడు. దీంతో ఒంటెను చెట్టుకు కట్టేసి కర్రలతో కొట్టి చంపారు.
Read Also: Superstition: తల్లిదండ్రులా.. రాక్షసులా.. 3 నెలల పసిపాపను కాల్చడానికి మనసేలా వచ్చిందిరా
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. బికనీర్ జిల్లా నోఖా పట్టణంలోని పంచు గ్రామంలో యజమాని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఒంటెను కొడుతుండటం కనిపిస్తోంది. సోమవారం సాయంత్రం ఒంటె యజమాని సోహన్ రామ్ నాయక్ (45) ఒంటెల బండితో గ్రామానికి చేరుకున్నాడు. ఈ సమయంలో ఒంటెను పొలానికి తీసుకెళ్తున్న సమయంలో ముందు వెళ్తున్న సోహాన్ రామ్ నాయక్ మెడపై గట్టిగా కొరింది. దీంతో తీవ్ర రక్తస్రావం అయి అతడు అక్కడికక్కడే మరణించాడు.
20 రోజుల క్రితమే సోహన్ రామ్ ఒంటెను కొనుగోలు చేసినట్లు అతని బంధువులు తెలిపారు. మచ్చిక చేసుకోకుంటే ఒంటే తీవ్రంగా ప్రవర్తిస్తుంది. మృతుడు సోహన్‌రామ్‌కు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒంటె బతికి ఉంటే మరింతమందికి హాని కలిగిస్తుందనే ఉద్దేశంతోనే చంపినట్లు గ్రామస్తులు వెల్లడించారు.