Farmers protest.. Security of Delhi tightened: దేశంలో రైతులు మరోసారి ఆందోళనలకు సిద్ధం అయ్యారు. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన రైతులు ప్రస్తుతం నిరుద్యోగంపై పోరుబాట పట్టారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగంపై సోమవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ‘మహా పంచాయత్’ కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉంది. దీంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
Bihar CM convoy attacked, 13 people arrested: బీజేపీతో పొత్తు తెంచుకుని ఆర్జేడీ పొత్తుతో మళ్లీ నితీష్ కుమార్ ఎనిమిదో సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు, ఇతర కార్యక్రమాలపై పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు నితీష్ కుమార్. ఇదిలా ఉండగా.. ఆదివారం నితీష్ కుమార్ కాన్వాయ్ పై రాళ్లదాడి జరిగింది. ఈ దాడిలో నాలుగు కార్లు ధ్వంసం అయ్యాయి. అయితే కాన్వాయ్ లో ఆ సమయంలో నితీష్ కుమార్ లేరు.
Average smartphone consumption in India increases: ఇండియాలో మొబైల్ వినియోగం పెరుగుతోంది. ప్రజలు మొబైల్ పై గడిపే సమయం గతంలో కన్నా పెరిగింది. తాజాగా మొబైల్ ఎనలిటిక్స్ సంస్థ డాటా. ఎఐ ప్రకారం ఇండియాలో సగటున వినియోగదారుడు రోజుకు 4.7 గంటలు మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నట్లు తేలింది. ఇది 2019లో 3.7 గంటలు, 2020లొో 4.5 గంటలు ఉంటే.. 2021లో 4.7 గంటలకు పెరిగిందని వెల్లడించింది.
Miss Universe to allow married women from 2023: మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో పాల్గొనేందుకు కఠినమైన నిబంధనలు ఉంటాయి. ఈ అందాల పోటీల్లో పాల్గొనాలంటే ఖచ్చితం యువతులు పెళ్లి కాని వారై ఉండటంతో, గర్భం ధరించి ఉండకూడదనే నియమాలు ఉన్నాయి. ఈ అర్హతలు కలిగిన వారే పోటీల్లోకి అనుమతించబడతారు. తమ అందాలను, తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించేందు ప్రతీ ఏడాది అన్ని దేశాల నుంచి కొన్ని వేల మంది ఈ పోటీల్లో నిలుస్తారు. అందాల పోటీలో పెళ్లి కానివారు, పిల్లలు లేని…
Heavy rains and floods in Odisha: ఒడిశా రాష్ట్రం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలతో అల్లాడుతోంది. ఒడిశాతో పాటు జార్ఖండ్, మధ్యప్రదేశ్ లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం కారణంగా ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా బాలాసోర్, మయూర్ భంజ్ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను తరలిస్తున్నారు. ఈ ప్రాంతం గుండా వైతరణి, సువర్ణ రేఖ నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బందికి సంబంధించిన 58 రెస్క్యూ టీములు ఈ రెండు జిల్లాల్లోనే…
Woman gets paid more than 3 lakh for being asked her age at a Domino's job interview: ఇంటర్యూలో మహిళ వయసు అడగమే డోమినోస్ చేసిన పెద్ద తప్పు. ఆ తప్పుకు పరిహారంగా లక్షల్లో పరిహారం చెల్లించాల్సి వచ్చింది. అయితే వయసు అడిగితేనే లక్షలు చెల్లించాలా..? అని చాలా మంది ప్రశ్నించవచ్చు. అయితే వయస్సు అడిన తనపై వివక్ష చూపించారని ఫిర్యాదు చేయడంతో సదరు కంపెనీ దిగిరావాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన ఐర్లాండ్ లో జరిగింది.…
Earthquake Hits Rajasthan: దేశంలో వరసగా మరో రోజు భూకంపం సంభవించింది. రాజస్థాన్ లో రిక్టర్ స్కేల్ పై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(ఎన్సీఎస్) వెల్లడించింది. సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ భూకంపం వచ్చింది. రాజస్థాన్ బికనీర్ నగరానికి వాయువ్య ప్రాంతంలో 236 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతం అయింది. భూమికి దాదాపుగా 10 కిలోమీటర్ల లోతులో
Former Pakistan PM Imran khan booked under terror act: పాకిస్తాన్ ప్రభుత్వం మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ పై అక్రమ నిధుల కేసు నమోదు చేసిన పాక్ ఏజెన్సీలు, తాజాగా ఇమ్రాన్ ఖాన్ పై ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు అయింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ త్వరలో జరగొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. న్యాయ, చట్టాల అధికారులపై విమర్శలు చేసినందుకు, వారిని బెదిరించేలా మాట్లాడినందుకు పాక్ ఉగ్రవాద…
AIIMS will be Named After Freedom Fighters, Regional Heroes: దేశంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)పేర్లు మార్చబోతోంది కేంద్రం ప్రభుత్వం. ఇందు కోసం ఇప్పటికే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతిపాదన చేసింది. దేశంలో మొత్తం 23 ఎయిమ్స్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి.
Woman Assaults Security Guard in delhi: ఢిల్లీలో ఓ యువతి సెక్యూరిటీ గార్డుపై దాడి చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో యువతి తీరుపై అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గేట్ తీయడంలో ఆలస్యం అయినందుకు సెక్యూరిటీ గార్డును బండ బూతులు తిడుతూ.. అందరి ముందు దాడి చేసింది. ఈ వీడియో ప్రసార మధ్యమాల్లో తెగవైరల్ అయింది. సెక్యూరిటీ గార్డ్ యూనిఫాంను తొక్కుతూ.. బెదిరించడంతో పాటు దూషించింది. ఈ ఘటన శనివారం సాయంత్ర ఢిల్లీలోని నోయిడా సెక్టార్ 126లోని జేపీ విష్ టౌన్…