Inflation in UK forces Indian students to work for long hours: ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్య వస్తుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అమెరికా, యూకేతో పాటు పలు యూరప్ దేశాల్లో ద్రవ్యల్భణం కనిపిస్తోంది. రానున్న 6 నెలల నుంచి ఏడాది కాలంలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే యూకే తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతం అవుతోంది. బోరిస్ జాన్సన్ తరువాత ప్రధాని పీఠాన్ని అధిష్టించిన లిజ్ ట్రస్ ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేకపోవడంతో పదవికి రాజీనామా చేసింది. ఆ తరువాత భారత మూలాలు ఉన్న రిషి సునాక్ ప్రధానిగా నియమితులయ్యారు.
Read Also: Rajasthan: అమానుషం.. అమ్మాయిని కలిసేందుకు వచ్చినందుకు కొట్టి, మూత్రం తాగించారు..
ఇదిలా ఉంటే ప్రస్తుతం యూకే ఆర్థిక పరిస్థితులు భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. యూకే ద్రవ్యోల్భణం కారణంగా భారతీయ విద్యార్థులు మరింతగా పనిచేయాల్సి వస్తోంది. ఎక్కువ పనిగంటలు పనిచేస్తూ.. జీవినం కోసం క్లాసులకు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పెరుగుతున్న ఖర్చుల కారణంగా విద్యార్థుల జీవితం దుర్భరంగా మారుతున్నాయి. ఫుడ్, ఇతర అవసరాల కోసం మరిన్ని పనిగంటలు పనిచేయాల్సి వస్తోంది. అధిక అద్దెలు, ఉద్యోగాల కొరత, స్థానిక విద్యార్థులతో పోలిస్తే ట్రిపుల్ ట్యూషన్ ఫీజులు, వసతి కొరత, ద్రవ్యల్భణంతో పెరుగుతున్న ఖర్చులు చదువు కోసం యూకే వెళ్లిన వారికి ఇబ్బందులుగా మారాయి.
చాలా మంది ఇంటికి వెళ్లాలని భావిస్తున్నారు. చదువు కోసం చిక్కుకుపోయారని లండన్ యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి యూకే వెళ్లిన ధరిన్ పటేల్ అన్నారు. నేను కూడా భారత్ తిరిగి వెళ్లాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. అప్పులు తీసుకుని చదివేందుకు యూకే వెళ్లిన వారు, ప్రస్తుత పరిస్థితుల కారణంగా పార్ట్ టైమ్ జాబ్స్ లో డబ్బులు సరిపోక ఇంటి నుంచి డబ్బులు అడగాల్సిన పరిస్థితి వస్తోంది. యూకేలో చైనీయులు తరువాత ఇండియా నుంచే ఎక్కువ మంది చదువుకోవడానికి వస్తున్నారు. 2022లో, 143,820 మంది చైనీస్ విద్యార్థులు చదువుకోవడానికి యూకే వెళ్తే.. భారతదేశం నుండి వారి సంఖ్య 84,555 మంది వెళ్లారు.