Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karapannam Recipe: రాత్రి మిగిలిన అన్నంతో లేదా అప్పటికప్పుడు వండిన అన్నంతో కూరగాయల అవసరం లేకుండా.. చాలా సులభంగా, రుచిగా చేసుకోగలిగే వంటకం “కారపన్నం”. నోటికి కారంగా, పుల్లగా ఏదైనా తినాలనిపించినప్పుడు లేదా కూరలు తిని బోర్ కొట్టినప్పుడు ఈ రైస్ పర్ఫెక్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. మరి ఈ వంటకాన్ని ఎలా చేయాలో చూసేద్దామా..
కావలసిన పదార్థాలు:
* అన్నం – 1 కప్పు (మిగిలిన అన్నం లేదా వేడి అన్నం)
* కారం – 1 స్పూన్
* పసుపు – పావు స్పూన్
* ఉప్పు – రుచికి సరిపడా
* అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర స్పూన్
* కరివేపాకు – తగినంత
* కొత్తిమీర – కొద్దిగా (ఉంటే)
* నూనె – 2 నుండి 3 స్పూన్లు
* పోపు దినుసులు, ఎండుమిర్చి – తగినంత
* పల్లీలు (వేరుశనగ గుళ్ళు) – గుప్పెడు
* ఉల్లిపాయ – 1 (సన్నగా, పొడుగ్గా కట్ చేసినది)
* నిమ్మరసం – అర చెక్క (ఆప్షనల్)
Also Read
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
- AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
తయారీ విధానం:
ముందుగా ఒక కప్పు అన్నాన్ని పొడిపొడిగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ అన్నానికి బాగా పట్టేలా చేత్తో చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని, రెండు లేదా మూడు స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి వేసి చిటపటలాడే వరకు వేయించాలి. పోపు వేగుతున్నప్పుడే ఒక గుప్పెడు పల్లీలు వేసి కరకరలాడే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు, సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయలను ఎక్కువగా వేగనివ్వకూడదు. కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే రైస్ వేసుకోవాలి. అప్పుడే తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు నాలుకకు తగులుతూ రుచిగా ఉంటాయి.
ఉల్లిపాయలు కాస్త వేగగానే, ముందుగా మసాలాలు కలిపి పెట్టుకున్న అన్నాన్ని పాన్ లో వేసుకోవాలి. స్టవ్ ను సిమ్ లో ఉంచి, పోపు అంతా అన్నానికి బాగా పట్టేలా ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. చివరగా స్టవ్ ఆఫ్ చేసే ముందు, కాస్త పుల్లదనం ఇష్టపడేవారు అర చెక్క నిమ్మరసం పిండుకుని కలుపుకోవాలి. అంతే… వేడి వేడి కమ్మని కారపన్నం రెడీ! ఎలాంటి హడావిడి లేకుండా అప్పటికప్పుడు చేసుకునే ఈ రైస్ పెద్దలకే కాదు, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది.
తాజావార్తలు
-
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
-
Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!