Venu Goapl Reddy
Author- NTV Telugu-
Ram Mandir: శరవేగంగా అయోధ్య రామమందిర నిర్మాణం.. వచ్చే ఏడాది రామ నవమికి సిద్ధం..
Ram Mandir: దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు, రామ భక్తులు కోటి కళ్లలో రామ మందిరం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రామ మందిర నిర్మాణం వేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది 2024లో జనవరిలో ఆలయ నిర్మాణం పూర్తి అవుతుందని చెబుతున్నారు. ఈ సారి శ్రీరామ నవమి వేడుకలు అయోధ్య రామ మందిరం సిద్ధం అవుతోంది. రామ నవమి వేడుకలు తాత్కాలిక ప్రాంగణంలో నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఆలయ నిర్మాణం పూర్తై, రామ మందిరంలోనే నవమి వేడుకలు జరగనున్నాయి. -
Donald Trump: 24 గంటలు చాలు..రష్యా-ఉక్రెయిన్ యుద్దాన్ని ఆపేస్తా..
Donald Trump: వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరుపున డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడాలని అనుకుంటున్నారు. ఇప్పటికే తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన ఆయన అమెరికాలో ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే మరోసారి ఆయన రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించారు. ఫాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ వివాదాన్ని తాను 24 గంటల్లో పరిష్కరించగలనని తెలిపాడు. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు అధ్యక్షత వహించడం ద్వారా తాను యుద్ధాన్ని అంతం చేస్తానని… -
DCGI: దేశవ్యాప్తంగా ఫార్మా కంపెనీలపై దాడులు.. 18 కంపెనీల లైసెన్సులు రద్దు..
18 Pharma Companies To Lose Licenses Over Poor Quality Medicines: దేశవ్యాప్తంగా నకిలీ ఔషధ కంపెనీలపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. 20 రాష్ట్రాల్లో మొత్తం 76 ఫార్మాస్యూటికల్ కంపెనీలపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీసీఐ) దాడులు నిర్వహించింది. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న 18 కంపెనీల లైసెన్సులు రద్దు చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. -
Earthquake: జపాన్ లో భారీ భూకంపం.. నో సునామీ వార్నింగ్..
Earthquake: జపాన్ భూకంపంతో వణికిపోయింది. మంగళవారం ఆ దేశంలో 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర జపాన్ లోని అమోరిలో ఈ భూకంపం సంభవించినట్లు జపాన్ జాతీయ వాతావరణ సంస్థ వెల్లడించింది. భూకంపం సాయంత్ర 6.18 గంటలకు 20 కిలోమీటర్ల లోతులో సంభవించింది. భూకంపం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు సునామీ హెచ్చరికలను జపాన్ జారీ చేయలేదు. -
No-Confidence Motion: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం..!
No-confidence Motion Against Lok Sabha Speaker: రాహుల్ గాంధీ అనర్హత దేశంలో రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఇదిలా ఉంటే తాజాగా మరో వార్త వెలుగులోకి వచ్చింది. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉన్న సమాచారం ప్రకారం సోమవారం స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం తీసుకురావచ్చని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీల సమావేశంలో ఈ ప్రతిపాదన చేశారు. కాగా, ఇతర పార్టీల నేతలతో ఈ అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. -
Savarkar Row: శరద్ పవార్ మధ్యవర్తిత్వం.. సావర్కర్‌ను విమర్శించనని రాహుల్ గాంధీ హామీ..
Savarkar Row: రాహుల్ గాంధీ సావర్కర్ పై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. ‘‘నా పేరు సావర్కర్ కాదు, నాపేరు గాంధీ.. నేను ఎవరికి క్షమాపణలు చెప్పను’’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఇటు బీజేపీతో పాటు అటు ఉద్దవ్ ఠాక్రే వర్గం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాము సావర్కర్ ను అభిమానిస్తామని, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించారు. దీంతో మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమి మధ్య విబేధాలు తలెత్తాయి. -
Uddhav Thackeray: పరువు నష్టం కేసులో ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్‌కు హైకోర్టు సమన్లు..
Uddhav Thackeray: రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించడంతో ప్రస్తుతం పరువునష్టం కేసు జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల ముందు కర్ణాటక కోలార్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘ దొంగలందరికి మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ క్రిమినల్ పరువు నష్టం కేసు వేయగా..ఈ కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష పడటమే కాకుండా.. ఎంపీగా అనర్హత వేటు పడింది. -
Russia: భారత్‌కు చమురు అమ్మకాలు 20 రెట్లు పెరిగాయి.. రష్యా ఉప ప్రధాని ప్రకటన
Russia Says Oil Sales To India: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఆర్థికంగా ఏకాకిని చేసి, రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీద్దాం అనుకున్న అమెరికా, యూరోపియన్ దేశాలకు ప్లాన్ బెడిసికొట్టింది. భారత్, చైనా రూపంలో బలమైన మార్కెట్లను రష్యా ఆదాయంగా మలుచుకుంది. ఈ రెండు దేశాలకు కావాల్సిన చమురును అత్యంత చౌకగా రష్యా అందిస్తోంది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రష్యా నుంచి భారత్ కు క్రూడ్ ఆయిల్ దిగుమతులు పెరిగాయి. -
Kim Jong Un: కిమ్ చేష్టలు.. బుల్లెట్లు మిస్సైనందుకు ఏకంగా నగరం మొత్తం లాక్డౌన్
Kim Jong Un: ఉత్తర కొరియా అంటేనే కిమ్ జోంగ్ ఉన్. ఆయన చేసేదే చట్టం, చెప్పేదే న్యాయం కాదని ఎవరైనా ఎదురుతిరిగితే అక్కడిక్కడే మరణించడం ఖాయం. అంతగా ఆ దేశాన్ని గుప్పిట పెట్టుకున్నాడు. ఉత్తర కొరియా గురించి ప్రపంచానికి తెలిసినంతగా, ప్రపంచం గురించి అక్కడి ప్రజలకు తెలియదు. చివరకు తెలుసుకోవాలని ప్రయత్నించినా మరణం తప్పదు. హాలీవుడ్, దక్షిణ కొరియా సినిమాలు చూస్తే, ఇంటర్నెట్ వాడినా, దేశం దాటాలని ప్రయత్నించినా, కిమ్ జోంగ్ ఉన్ తాత, తండ్రులను గౌరవించకపోయినా మరణం తప్పదు. అంత క్రూరంగా… -
PM Modi: బీజేపీ గెలుపు.. ప్రతిపక్షాల నిరసనలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు..
PM Modi: బీజేపీ ఎక్కువ ఎన్నికల్లో గెలిస్తే, ప్రతిపక్షాల నుంచి మరిన్ని నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఏప్రిల్ 6న పార్టీ వ్యవస్థాపక దినోత్సవం నుంచి ఏప్రిల్ 14 బీఆర్ అంబేద్కర్ జయంత్రి మధ్య సామాజిక న్యాయ వార్షికోత్సవం కోసం సమాయన్ని కేటాయించాలని ఎంపీలను ప్రధాని కోరారు. బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టి 9 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా తొమ్మిదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మే 15 నుంచి ఒక నెలపాటు ప్రభుత్వ పథకాలను తమ…
తాజావార్తలు
-
Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
-
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి పతకం.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో సిల్వర్
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!