UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
- యూకే కొత్త ప్రధాని ఆండీ బర్న్‌హామ్
- లేబర్ పార్టీ నాయకుడిగా ఎన్నిక
- సోమవారం బ్రిటన్ ప్రధానిగా ప్రమాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటన్ అధికార లేబర్ పార్టీకి కొత్త నాయకుడిగా ఆండీ బర్న్‌హామ్ ఎన్నికయ్యారు. దీంతో ఆయన సోమవారం అధికారికంగా యునైటెడ్ కింగ్డమ్ 59వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. లండన్‌లో నిర్వహించిన లేబర్ పార్టీ ప్రత్యేక సమావేశంలో పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (NEC) ఛైర్పర్సన్ షబానా మహ్మూద్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా షబానా మహ్మూద్ మాట్లాడుతూ.. ‘‘నామినేషన్ దాఖలు చేసిన ఎంపీ ఒక్కరే ఉన్నారు. అందువల్ల ఈ ఎన్నికలో ఎలాంటి ఉత్కంఠ నెలకొనలేదు’’ అని వ్యాఖ్యానించారు.
సోమవారం రాజు చార్ల్స్-IIIతో భేటీ
సోమవారం ఆండీ బర్న్‌హామ్ బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో రాజు చార్ల్స్-IIIను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానం అందుకోనున్నారు. అంతకుముందు ప్రస్తుత ప్రధాని కీర్ స్టార్మర్ తన రాజీనామాను అధికారికంగా రాజుకు సమర్పించనున్నారు. అనంతరం ఆండీ బర్న్‌హామ్ 10 డౌనింగ్ స్ట్రీట్‌లో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Also Read
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
మేయర్ నుంచి ప్రధానమంత్రిగా
దాదాపు పదేళ్ల క్రితం లేబర్ పార్టీలో రెండు దశాబ్దాల రాజకీయ ప్రస్థానాన్ని పక్కనబెట్టి లండన్‌ను విడిచిన ఆండీ బర్న్‌హామ్.. గ్రేటర్ మాంచెస్టర్ మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో మళ్లీ పార్లమెంట్‌కు ఎన్నికైన ఆయన.. ఇప్పుడు అనూహ్యంగా దేశ ప్రధానమంత్రి పదవిని అధిరోహించబోతున్నారు.
స్టార్మర్ పతనంతో అవకాశం
కేవలం రెండేళ్ల పాలన తర్వాత ప్రధాని కీర్ స్టార్మర్ పదవి వీడాల్సి రావడంతో 56 ఏళ్ల ఆండీ బర్న్‌హామ్‌కు ప్రధానమంత్రి అయ్యే అవకాశం లభించింది. అయితే ప్రజల చేత నేరుగా ఎన్నిక కాకుండానే ఈ పదవికి చేరుకుంటున్న ఆయన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మాంచెస్టర్‌కు చెందిన ‘ది మిల్’ వార్తా సంస్థ వ్యవస్థాపకుడు జోషి హెర్మన్ మాట్లాడుతూ.. లేబర్ పార్టీ కార్యకర్తలు, దేశ ప్రజలు ఆండీ బర్న్హామ్పై భారీ ఆశలు పెట్టుకున్నారని, ఇప్పుడు వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు.
ఆండీ బర్న్‌హామ్ లివర్‌పూల్‌లో జన్మించారు. ఆయన తండ్రి బ్రిటిష్ టెలికాం ఇంజనీర్, తల్లి రిసెప్షనిస్ట్‌గా పనిచేశారు. క్యాథలిక్ కుటుంబంలో పెరిగిన ఆయన.. ప్రస్తుతం తాను పెద్దగా మతపరమైన వ్యక్తి కాదని చెప్పుకున్నప్పటికీ, సామాజిక న్యాయం, సమానత్వం వంటి విలువలను క్యాథలిక్ బోధనలు, లేబర్ పార్టీ సిద్ధాంతాల నుంచే నేర్చుకున్నానని గతంలో చెప్పారు.
బర్న్‌హామ్ కుటుంబంలో విశ్వవిద్యాలయంలో చదివిన తొలి తరం వ్యక్తుల్లో ఒకరు. ఆయన బ్రిటన్‌లోని అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలలో ఒకటైన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించారు. ప్రస్తుతం లేబర్ పార్టీ నాయకత్వం చేపట్టిన ఆయన సోమవారం నుంచి బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇదిలా ఉంటే ఆండీ బర్న్‌హామ్‌కు భారత్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. పలుమార్లు భారత్‌లో కూడా పర్యటించారు. ప్రత్యేకంగా ప్రధాని మోడీతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు కొనసాగవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!