Bangladesh PM Sheikh Hasina comments on india relations: బంగ్లాదేశ్ ప్రధాని భారత పర్యటనకు రాబోతున్నారు. భారత్, బంగ్లాదేశ్ ల మధ్య వాణిజ్య, వ్యాపారం, ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు దేశాల ప్రధానులు నరేంద్రమోదీ, షేక్ హసీనాల మధ్య కీలక చర్చలు జరగబోతున్నాయి. ఇదిలా ఉంటే తన భారత పర్యటనకు ముందు ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని షేక్ హసీనా కీలక విషయాలను వెల్లడించారు. బంగ్లాదేశ్, శ్రీలంక మార్గంలో వెళ్తుందనే ఆందోనళ నేపథ్యంలో.. షేక్ హసీనా బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉందని అన్నారు.…
India set to become 3rd largest economy by 2030: ప్రపంచం అంతా మాంద్యం అంచున ఉంటే ఒక్క భారత్ మాత్రమే వృద్ధి రేటులో దూసుకెళ్తోంది. ఇప్పటికే యూకేను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించింది ఇండియా. రానున్న కాలంలో మరింత వేగంగా భారత్ ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2030 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2028-30 నాటికి భారత్ మూడో అతిపెద్ద…
Nithyananda seeks medical asylum in Sri Lanka: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, అత్యచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే సహాయాన్ని కోరాడు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న నిత్యానంద శ్రీలంక రాజకీయ ఆశ్రయం కోరుతున్నారు. నిత్యానంద ఆరోగ్యం క్షీణించడంతో.. చికిత్స కోసం శ్రీలంక సాయాన్ని అభ్యర్థిస్తూ రణిల్ విక్రమసింఘేకు లేఖ రాశాడు. దీంతో పాటు తన ద్వీప దేశం శ్రీకైలాసలో వైద్యపరమైన మౌళిక సదుపాయాల కొరతను లేఖలో ప్రస్తావించాడు.
Pakistan appeals for urgent aid from international community: పాకిస్తాన్ దేశాన్ని భారీ వరదలు తీవ్రంగా ముంచెత్తాయి. అసలే ఆర్థిక పరిస్థితులు బాగా లేక కొట్టుమిట్టాడుతున్న ఆ దేశాన్ని వరదలు మరింతగా నష్టపరిచాయి. ఏంతలా అంటే ప్రస్తుతం పాకిస్తాన్ లోని మూడోంతుల్లో ఒక వంతు భూభాగం పూర్తిగా నీటితోనే నిండి ఉంది. సింధు నది దాని ఉపనదులు పొంగిపొర్లడంతో సింధ్ ప్రావిన్స్, బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో తీవ్రంగా నష్టం వాటిల్లింది. జూన్ మధ్య నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాల వల్ల 1265 మంది…
Legionnaire's disease in Argentine: ప్రపంచాన్ని కొత్తకొత్త వ్యాధులు చుట్టుముడుతున్నాయి. తాజాగా మరో కొత్త వ్యాధి లాటిన్ అమెరికా దేశం అయిన అర్జెంటీనాలో ప్రబలుతోంది. లిజియోనెల్లా బ్యాక్టీరియా ద్వారా వచ్చే లెజియోనైర్స్ వ్యాధి బారిన పడుతున్నారు అక్కడి ప్రజలు. ఇప్పటికే ఈ వ్యాధి బారిన 11 మంది పడగా.. నలుగురు మరణించారు. రాజధాని బ్యూనస్ ఎయిర్స్ కు ఉత్తరాన 670 మైళ్ల దూరంలో ఉన్న శాన్ మిగ్యుల్ డి టుకుమాన్ నగరంలో ఈ వ్యాధి వ్యాపించింది.
woman killed son's classmate in Puducherry:తన కొడుకు ఆనందం కోసం మరోకరి కొడుకును దారుణంగా చంపింది. తన కొడుకు కన్నా ఎక్కువ మార్కులు రావడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ మహిళ ఏకంగా.. ఓ విద్యార్థినే విషమిచ్చి చంపింది. కొడుకు క్లాస్మెట్ను కొడుకులాగే చూసుకోవాలనే సోయి మరిచి ప్రవర్తించింది. చివరకు కటకటాల పాలైంది. ఈ దారుణ ఘటన పుదుచ్చేరిలో జరిగింది. తన కుమారుడు క్లాస్ ఫస్ట్ రావాలనే ఉద్దేశ్యంతోనే మహిళ ఇలా చేసిందని పోలీస్ విచారణలో తేలింది. సమాజంలో పెరిగిపోతున్న మార్కుల ధోరణి తల్లిదండ్రులను, విద్యార్థులను…
woman killed for refusing to marry: ప్రేమ పేరుతో హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ప్రేమకు ఒప్పుకోలేదనో.. పెళ్లికి నిరాకరించిందనో యువతులను దారుణంగా హత్య చేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది. పెళ్లి ప్రతిపాదనకు తిరస్కరించిందని యువతిని హత్య చేసి.. తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Swami Vivekananda Statue Unveiled In Mexico: లాటిన్ అమెరికా దేశాల్లోనే తొలిసారిగా స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. మెక్సికో దేశంలోని ఓ యూనివర్సిటీలో స్వామి వివేకానంద విగ్రహాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా శనివారం ఆవిష్కరించారు. మెక్సికోలోని భారత పార్లమెంటరీ బృందానికి ఓం బిర్లా నాయకత్వం వహించారు. మెక్సికోలోని మిడాల్గోలోని అలానమస్ యూనివర్సిటీ ఆఫ్ స్టేట్ లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వివేకానందుడి బోధనలు, వ్యక్తిత్వం భారతదేశంలోనే కాకుండా ప్రపంచదేశాల ప్రజలకు కూడా ప్రేరణ ఇవ్వానలి లోక్ సభ సెక్రరేటియట్…
CM Nitish Kumar comments on BJP: ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో ఉన్నారు బీహార్ సీఎం నితీష్ కుమార్. ఇటీవల బీజేపీతో పొత్తు నుంచి బయటకు వచ్చిన నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఎనిమిదోసారి సీఎంగా పదవీ స్వీకారం చేశారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలా ఉంటే నితీష్ కుమార్ పై బీజేపీ తీవ్రంగా విమర్శలు చేస్తోంది. మణిపూర్ లో జేడీయూ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను…
Congress-Mehangai Par Halla Bol rally: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ పోరుబాటు పట్టింది. నిత్యవసరాల ధరల పెరుగుదలపై “మెహంగాయ్ పర్ హల్లా బోల్” నినాదంతో దేశవ్యాప్తంగా భారీ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఎంపీ రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ప్రధాన నేతలు పాల్గొననున్నారు. ఢిల్లీ రాంలీలా మైదాన్ లో భారీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఏఐసిసి జనరల్ సెక్రటరీలు, సెక్రటరీలు, పిసిసి అధ్యక్షులు, సి.ఎల్.పి నాయకులు, పిసిసి మాజీ అధ్యక్షులు, ఎమ్.పిలు, పార్టీ అగ్రనేతలు ఉదయం 11 గంటలకు ఏఐసిసి…