No Jeans, T-Shirts In Office in Uttar Pradesh:ఇక ఆ జిల్లాలో ప్రభుత్వ అధికారులంతా తప్పని సరిగా ఫార్మల్ డెస్సుల్లోనే విధుల్లోకి హాజరు కావాలి. కాదు, కూడదు అని జీన్స్, టీ షర్టులు వేసుకుని వచ్చారో అంతే సంగతులు. ఇలా చేస్తే ఉద్యోగులు ఉన్నతాధికారుల చర్యలకు గురికావాల్సిందే. ఇది ఎక్కడంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ జిల్లాలో. బరేలీ జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో(కలెక్టర్ ఆఫీస్) ఉద్యోగులు, అధికారులు తప్పని సరిగా అధికారిక డ్రెస్ కోడ్ లో రావాలని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. జీన్స్, టీ షర్టులు ధరించడాన్ని నిషేధించారు. అధికారులు అధికారిక దుస్తులు ధరించే రావాలని, అధికారులు అధికారుల్లాగే కనపిపించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఉద్యోగులు, అధికారులు కార్యాలయంలో కేవలం అధికారిక దుస్తులే ధరించాలని.. జీన్స్, టీషర్టులు వేసుకోకూడదని జిల్లా మెజిస్ట్రేట్(కలెక్టర్) శివకాంత్ ద్వివేది అన్నారు.
ఈ ఆదేశాలను ఉద్యోగులు స్వాగతించారు. ఇది కొత్త విషయం కాదని.. డ్రెస్ కోడ్ నిబంధన ఎప్పటి నుంచో అమలులో ఉందని.. ఆఫీసులో ఫార్మల్ దుస్తులు ధరించే ఇకపై ఉద్యోగులు వస్తారని.. కొంత మంది జీన్స్, టీషర్టులు ధరించి వచ్చేవారని ప్రస్తుతం వారంతా డ్రస్ కోడ్ ఆదేశాలను పాటించాల్సిందే అని అడ్మినిస్ట్రేషన్ అధికారి శివేష్ కుమార్ గుప్తా అన్నారు. ఇది మంచి నిర్ణయం అని ఆయన అన్నారు.
Read Also: Hyderabad IIT: వరుసగా రెండో ఘటన.. మరో విద్యార్థి లాడ్జిపై నుంచి దూకి…
ఫార్మల్ దస్తులు వేసుకుని వస్తే ఆఫీస్, ఆఫీసులా ఉంటుందని రాహుల్ గంగ్వార్ అనే ఉద్యోగి వెల్లడించారు. ఓ కార్యాలయంలో అధికారులు ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ఇలాంటి ఆదేశాలనే జారీ చేసింది. రాష్ట్ర సచివాలయం, ప్రభత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు, అధికారులు క్యాజువల్స్ ధరించడాన్ని గతేడాది మహారాష్ట్ర ప్రభుత్వం కూడా నిషేధించింది. 2021లో సీబీఐ డైరెక్టర్ సుభోద్ కుమార్ జైశ్వాల్ కూడా అధికారులంతా, అధికారిక దుస్తుల్లోనే కార్యాలయాలకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. జీన్స్, స్పోర్ట్స్ షూస్, చప్పల్, క్యాజువల్స్ ధరించడానికి అనుమతి లేదని సీబీఐ డైరెక్టర్ గతేడాది ప్రకటించారు.