Heavy rain forecast for southern states: భారీ వర్షాలు దక్షిణాది రాష్ట్రాలను ముంచెత్తనున్నాయి. రానున్న రోజుల్లో అన్ని సౌత్ స్టేట్స్ లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. నాలుగు రోజుల పాటు తీవ్రమైన వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఐదు రోజుల్లో ఒడిశా, మహారాష్ట్రల్లో భారీ వానలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఇదే సమయంలో వాయువ్య రాష్ట్రాల్లో కూడా వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
రాగల కొన్ని రోజుల్లో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ తో పాటు దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉంది. నిన్న లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి-కారైకాల్ లో ఉరుములు, మెరుపుతతో కూడిన వర్షాలు పడ్డాయి. ఈ నెల 7-9 మధ్య రాయలసీమలో వర్షాలు నమోదు అవుతాయని.. కోస్తా ఆంధ్రా, యానాం, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక ప్రాంతాల్లో ఈ నెల 7 నుంచి 10 మధ్యలో భారీ వర్షపాతం నమోదు అవుతుందని అంచనా వేసింది. దీంతో పాటు తెలంగాణ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, కేరళ, మహేలతో రాబోయే 5 రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
Read Also: Elon Musk : మళ్లీ ట్విట్టర్‌ను టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..
సెప్టెంబర్ 9-10 కేరళ, మహే, కర్ణాటక, కోస్తా ఆంధ్రా, యానాం, తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఛత్తీస్‌గఢ్, విదర్భ ప్రాంతాల్లో 9 నుంచి 11 వరకు వర్షాలు కురవనున్నాయి. తూర్పు పశ్చిమ తీరం వెంబడి అనేక రాష్ట్రాల్లో సెప్టెంబర్ 11 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ నెల 10,11 తేదీల్లో వర్షాలు పడనున్నాయి. జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ఠ్రాల్లో ఈ నెల 11న వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒడిశా, మరాఠ్వాడా, కొంకణ్, గోవా ప్రాంతాల్లో వచ్చే ఐదు రోజుల్లో భారీగా వానలు కురవనున్నాయి. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈ నెల 11 వరకు వర్షాలు కురవనున్నాయి.