Rajnath Singh Gifted Horse By Mongolian President: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగోలియా పర్యటనలో ఉన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఏడేళ్ల క్రితం ప్రధాని నరేంద్రమోదీ మంగోలియాలో పర్యటించారు. ఆ సమయంలో మంగోలియా ప్రభుత్వం మోదీకి ఓ గుర్రాన్ని బహూకరించింది. తాజాగా రాజ్ నాథ్ సింగ్ కు కూడా ఆ దేశాధ్యక్షడు ఖరేల్ సుఖ్ ఓ గుర్రాన్ని బహుమతిగా ప్రధానం చేశారు.
Delhi Ban On Firecrackers: ఢిల్లీ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దీపావళికి కూడా ఢిల్లీ నగర పరిధిలో ఎలాంటి ఫైర్ క్రాకర్స్ కు అనుమతి ఇవ్వడం లేదు. తాజాగా ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ఈ సారి కూడా ఢిల్లీ పరిధిలో ఫైర్ క్రాకర్స్ పై నిషేధం ఉంటుందని ప్రకటించారు. ఆన్ లైన్ లో కూడా పటాకుల అమ్మకాలపై కూడా నిషేధం ఉంటుందని.. నిషేధాన్ని కఠినంగా అమలు చేసేలా కార్యాచరణ ప్రణాళికను కఠినంగా అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు.
Corona cases in india: దేశంలో క్రమంగా కరోనా తగ్గుముఖం పడుతోంది. మూడు నెలల కనిష్ట స్థాయికి కరోనా కేసులు చేరుకున్నాయి. కొన్ని రోజుల వరకు దేశంలో సగటున 15 వేలకు పైగా రోజూవారీ కేసులు నమోదు అవుతుండేవి. అయితే గత కొన్ని రోజులుగా రోజూవారీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 10 వేలకు లోపే కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 5,379 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజులోనే 7,094 మంది మహమ్మారి…
CBI Raids Bengal Law Minister In Coal Scam Case: మరో పశ్చిమ బెంగాల్ మంత్రి నివాసాలు, కార్యాలయాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్( సీబీఐ ) అధికారులు దాడులు చేశారు. బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఈ దాడులు జరిగాయి. పశ్చిమ బెంగాల్ న్యాయశాఖ మంత్రిగా ఉన్న మోలోయ్ ఘటక్ మూడు ఇళ్లపై, కార్యాలయాతో పాటు మొత్తం ఏడు చోట్ల సీబీఐ అధికారులు దాడులు చేశారు. అసన్సోల్, కోల్కతా సహా రాష్ట్రవ్యాప్తంగా ఏడు చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి…
Indian-origin Suella Braverman appointed UK Home Secretary: యూకే కొత్త ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న లిజ్ ట్రస్, కొత్తగా యూకే హోం సెక్రటరీగా భారత సంతతి వ్యక్తి సుయెల్లా బ్రవర్మన్ను నియమించారు. లిజ్ ట్రస్ గెలిచిన తర్వాత ఆ పదవిలో ఉన్న ప్రతీ పటేల్ స్థానంలో సుయెల్లా బ్రవర్మన్ను ఈ బాధ్యతలను తీసుకున్నారు. ఈమె పార్లమెంట్ లో ధమ్మపదపై ప్రమాణం చేసి బాధ్యతలను చేపట్టారు.
Why Rishi Sunak lost UK PM race to Liz Truss?: భారత సంతతి వ్యక్తి రిషి సునక్ యూకే ప్రధాని పదవి రేసులో ఓడిపోయారు. లిజ్ ట్రస్ చేతిలో 20 వేల ఓట్ల తేడాతో ఓడిపోయి.. ప్రధాని పదవిని కోల్పోయారు. అంతకు ముందు యూకే ప్రధానిగా బోరిస్ జాన్సన్ రాజీనామా తరువాత యూకే ప్రధాని పదవి పోటీలో రిషి సునక్ తొలి రౌండ్లలో ముందున్నారు. అయితే తర్వాత రిషి సునక్ తన పాపులారిటీని కోల్పోయారు. అయితే రిషి సునక్ ప్రధాని పదవి…
Diesel Shortage in chennai city: చెన్నై నగరంలో డిజిల్ కొరత ఏర్పడింది. నిర్వాహక లోపాల కారణంగానే కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. పలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. డిజిల్ నింపుకోవడానికి వచ్చే వాహనాలతో బంకుల మందు భారీ క్యూ ఏర్పడింది. క్రూడాయిల్ కొరత, పంపిణీ సమస్యల కారణంగా డిజిల్ కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే ఉన్నట్టుండి డిజిల్ కొరత రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఒక్క చెన్నైలోనే కాకుండా తమిళనాడులోని పలు నగరాల్లో కూడా డిజిల్ కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది.
Praveen Nettaru Case: బీజేపీ నేత ప్రవీణ్ నెట్టార మర్డర్ కేసులో ఎన్ఐఏ దూకుడు పెంచింది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కర్ణాటకలోని పలు జిల్లాలో విస్తృతంగా సోదాలను నిర్వహించింది. మూడు జిల్లాల్లో 33 చోట్ల సోదాలు చేశారు అధికారులు. మైసూరు, కొడుగు, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కీలక సభ్యులుగా ఉన్న నిందితులు.. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ నేత ప్రవీణ్ నెట్టారును హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
Karnataka Minister Umesh Katti dies of cardiac arrest: కర్ణాటక మంత్రి ఉమేష్ కత్తి మంగళవారం మరణించారు. గుండె పోటు కారణంగా బెంగళూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మృతి చెందారు. 61 ఏళ్ల ఉమేష్ కత్తి బస్వరాజ్ బొమ్మై మంత్రి వర్గంలో పౌరసరఫరాలు, అటవీ శాఖలను నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. హుక్కేరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్టు ఎమ్మెల్యేగా గెలిచారు ఉమేష్ కత్తి.
Gadkari makes seatbelts mandatory for all car passengers: ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ కారు ప్రమాదంలో మరణించారు. కారులో సీటు బెల్టు పెట్టుకోకపోవడంతోనే మరణించినట్లు పోలీసులు ప్రాథమికంగా ధ్రువీకరించారు. ఇదిలా ఉంటే సైరస్ మిస్త్రీ మరణం తరువాత కీలక నిర్ణయం తీసుకున్నారు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. కారులో ప్రయాణించే వారందరూ సీటు బెల్టు ధరించడాన్ని తప్పని సరి చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. సైరస్ మిస్త్రీ మరణం తరువాత వెనుక సీటులో ప్రయాణికుల భద్రత కోసం ప్రభుత్వం…