Venu Goapl Reddy
Author- NTV Telugu-
Covid 19: ఎండమిక్ స్టేజ్‌లో కరోనా.. మరో 10 రోజులు కేసులు పెరుగుతూనే ఉంటాయి..
Covid 19: భారతదేశంలో కోవిడ్ మహమ్మారి కోరలు చాస్తోంది. గత ఐదారు నెలలుగా స్తబ్ధుగా ఉన్న కేసుల సంఖ్య ప్రస్తుతం మళ్లీ పెరుగుతన్నాయి. కొన్నాళ్ల వరకు కేవలం కేసులు 1000 లోపే పరిమితం అయ్యేవి, కానీ కొన్ని రోజుల నుంచి కేసుల సంఖ్య పెరుగుతూ.. 5000 మించి నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం కోవిడ్ ఎండమిక్ స్టేజ్ లో ఉందని, మరో 10-12 రోజుల వరకు కేసులు పెరుగుతూనే ఉంటాయని, ఆ తర్వాత తగ్గుముఖం పడతాయని ప్రభుత్వ వర్గాలు ఈ రోజు తెలిపాయి. -
Twitter: ట్విట్టర్లో 80 శాతం మంది ఉద్యోగులు ఔట్.. కన్ఫామ్ చేసిన ఎలాన్ మస్క్..
Twitter: ట్విట్టర్ నుంచి 80 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లు ధ్రువీకరించారు కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్. మొత్తం 8000 మంది ఉద్యోగుల్లో ప్రస్తుతం 1500 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. అక్టోబర్ 2022లో 44 బిలియన్ డాలర్ల భారీ డీల్ తో ట్విట్టర్ ను సొంతం చేసుకున్నారు మస్క్. అప్పటి నుంచే ట్విట్టర్ లో ప్రక్షాళన చేపట్టారు. వచ్చీ రావడంతోనే కంపెనీ కీలక ఉద్యోగులు అయిన పరాగ్ అగర్వాల్, లీగల్ హెడ్ అయిన విజయా గద్దెలను తొలగించారు. ట్విట్టర్ బోర్డును రద్దు చేసి… -
India Economy: భారత వృద్ధి అంచనాను తగ్గించిన ఐఎంఎఫ్.. అయినా ప్రపంచం ఆశంతా భారత్‌పైనే..
India Economy: ఆర్థికమాంద్యం భయాలు, రష్యా ఉక్రెయిన్ పరిణామాలు, కోవిడ్ మహమ్మారి కలిసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇన్నాళ్లు యూరోపియన్ దేశాల ఆర్థిక వ్యవస్థలు చాలా బలంగా ఉన్నాయని అనుకుంటున్నప్పటికీ, గాలి బుడగలా మారాయి. ఎప్పుడు బ్లాస్ట్ అవుతాయో తెలియని పరిస్థితి. ఇప్పటికే శ్రీలంక దివాళా తీసింది. -
India: శరణార్థి పాలసీని దుర్వినియోగం చేస్తున్న ఖలిస్తానీవాదులు.. యూకేకు తేల్చి చెప్పిన ఇండియా..
Pro-Khalistan Elements Misusing Asylum Policy, India Tells UK: ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ కోసం ఇంకా వేట కొనసాగిస్తున్నారు పంజాబ్ పోలీసులు. ఈ విషయం తెలిసిన విదేశాల్లోని ఖలిస్తానీవాడులు భారత రాయబార కార్యాలయాలే టార్గెట్ గా దాడులకు తెగబడ్డాయి. ముఖ్యంగా యూకే, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియాల్లో ఖలిస్తానీవాదులు భారత సార్వభౌమాధికారాన్ని సవాల్ చేస్తూ.. ఇండియన్ ఎంబసీ, కాన్సులేట్స్ పై దాడులు చేయడాన్ని భారత్ తీవ్రంగా ఆక్షేపిస్తోంది. -
Javed Miandad: “జీవితం, మరణం అల్లా చేతిలో ఉంటాయి”.. పాక్‌లో ఆడేందుకు భారత్ నిరాకరించడంపై మియాందాద్
Javed Miandad: పాకిస్తాన్ లో జరగబోయే ఆసియా కప్ క్రికెట్ టోర్నీకి భారత జట్టు వెళ్లకూడదని నిర్ణయించుకుంది. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కారాలుమిరియాలు నూరుతోంది. పాక్ మాజీ ఆటగాళ్లు భారత్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. క్రికెట్ ప్రపంచంలో బీసీసీఐ నియంతలా ప్రవర్తిస్తోందని పాక్ మాజీ ఆటగాడు, ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు. -
Snakes Inside Door Frame: ఒళ్లు గగుర్పాటు కలిగించే ఘటన.. డోర్ ఫ్రేమ్‌లో ఏకంగా 39 పాములు..
Snakes Inside Door Frame: మహరాష్ట్రలోని గోండియాలో ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే సంఘటన జరిగింది. ఓ ఇంటిలోని డోర్ ఫ్రేమ్ నుంచి 39 చిన్న పాములు బయటకు తీయడంతో అంతా షాక్ అయ్యారు. అయితే ఇంట్లో వాళ్లు డోర్ ఫ్రేములో చెదులు ఉందని అప్పటిదాకా భావించారు. అయితే పాములను చూసి ఒక్కసారిగా భయపడ్డారు. ఈ పాములను పట్టుకునేవారు దాదాపుగా 4 గంటలు కష్టపడి పాములన్నింటిని పట్టుకున్నారు. సమీపంలోని అడవుల్లో వదిలారు. -
H3N8 Bird Flu: చైనాలో బర్డ్ ఫ్లూతో ఒకరు మృతి.. ప్రపంచంలోనే తొలి కేసుగా నమోదు..
H3N8 Bird Flu: మానవుల్లో అత్యంత అరుదుగా కనిపించే బర్డ్ ఫ్లూతో చైనాలో ఒకరు మరణించారు. ప్రపంచంలోనే ఇలా మరణించడం ఇదే మొదటిసారి. అయితే ప్రజల నుంచి ప్రజలకు ఈ వ్యాధి వ్యాప్తి చెందడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. దక్షిణ ప్రావిన్స్ ఆఫ్ గ్వాంగ్‌డాంగ్‌కు చెందిన 56 ఏళ్ల మహిళ ఏవియన్ ఇన్ఫ్లుఎంజా H3N8 సబ్టైప్ బారిన పడిన మూడవ వ్యక్తి అని డబ్ల్యూహెచ్ఓ మంగళవారం తెలిపింది. -
Nitish Kumar Meets Rahul Gandhi: జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం.. రాహుల్ తో నితీష్, తేజస్వీ భేటీ..
Nitish Kumar Meets Rahul Gandhi: జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నిస్తున్న బీహార్ సీఎం నితీష్ కుమార్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. సమావేశంలో ఆర్జేడీ నేత, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కూడా పాల్గొన్నారు. బుధవారం ఢిల్లీలో ఈ భేటీ జరిగింది. సమావేశం జరిగే సమయంలో జేడీయూ అధ్యక్షుడు లాలన్ సింగ్ కూడా ఉన్నారు. ఢిల్లీలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌తో నితీశ్ కుమార్… -
Flesh-Eating Bacteria: యూఎస్ఏలో పెరుగుతున్న “మాంసం తినే బ్యాక్టీరియా”..
Flesh-Eating Bacteria: అమెరికా తీర ప్రాంత ప్రజలను ఇప్పుడో కొత్తరకం బ్యాక్టీరియా కలవరపెడుతోంది. అత్యంత ప్రాణాంతకం అయిన బ్యాక్టీరియా ‘‘ విబ్రియో వల్నిఫికస్’’ కారణంగా అంటువ్యాధులు పెరుగుతున్నాయి. దీన్ని సాధారణంగా ‘‘మాంసాన్ని తినే బ్యాక్టీరియా’’గా పిలుస్తుంటారు. యూఎస్ తీరం చుట్టూ వేడెక్కుతున్న జలాలు ఈ బ్యాక్టీరియా పెరుగుదలకు కారణం అవుతున్నాయి. క్రమంగా తీరం వెంబడి కదులుతున్నాయి. -
Karnataka Elections: తొలివిడతగా అభ్యర్థుల జాబితాను ప్రకటించిన బీజేపీ.. 52 మంది కొత్తవారికి అవకాశం..
Karnataka Elections: కర్ణాటక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. తాజాగా ఈ రోజు బీజేపీ తన తొలివిడత అభ్యర్థులు జాబితాను ప్రకటించింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో తొలివిడతగా బీజేపీ 189 మంది అభ్యర్థులను ప్రకటించింది. తొలివిడతలో భారీగా ఎమ్మెల్యేలను తొలగించింది. ఏకంగా 52 మంది కొత్తవారికి అవకాశం ఇచ్చింది. రెండో జాబితా త్వరలోనే వస్తుందని సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. గత వారం చివర్లో బీజేపీ అగ్రనాయకులు జేపీ నడ్డా ఇంటిలో భేటీ అయి అభ్యర్థుల జాబితాను ఫైనలైజ్ చేశారు
తాజావార్తలు
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!