Corona cases in india: దేశంలో క్రమంగా కరోనా తగ్గుముఖం పడుతోంది. మూడు నెలల కనిష్ట స్థాయికి కరోనా కేసులు చేరుకున్నాయి. కొన్ని రోజుల వరకు దేశంలో సగటున 15 వేలకు పైగా రోజూవారీ కేసులు నమోదు అవుతుండేవి. అయితే గత కొన్ని రోజులుగా రోజూవారీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 10 వేలకు లోపే కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 5,379 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజులోనే 7,094 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. 27 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం ఇండియాలో కరోనా రికవరీ రేటు 98.7 శాతంగా ఉంది. మరోవైపు యాక్టివ్ కేసుల శాతం మొత్తం కేసుల్లో 0.11 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ఇండియాలో కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 4,44,72,241 కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 5,28,030 మంది మరణించగా.. 4,38,93,590 మంది మరణించారు.
Read Also: RK ROJA: తప్పు చేసిన వారు తప్పించుకోలేరు
దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు అర్హలైన వారికి మొత్తం 213.91 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ అందించారు. నిన్న ఒక్క రోజే దేశంలో 18,81,319 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చారు. కొత్తగా 3,21,917 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. ఇక ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా జపాన్, దక్షిణ కొరియా దేశాల్లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 61,06,13,899 మంది కరోనా వ్యాధికి గురయ్యారు. వీరిలో ఇప్పటి వరకు 65,06,895 మంది మరణించారు.