Discrimination against Dalit girls.. Police arrested a person: రాజస్థాన్ లో అమానుష సంఘటన జరిగింది. దళిత యువతిపై వివక్ష చూపించడం చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కుల వివక్ష, అగ్రవర్ణాల అహంకారం ఏ విధంగా ఉంటాయో మరోసారి బహిర్గతం అయింది. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వడ్డించినందుకు పిల్లలు భోజనాన్ని పారేయాలని సూచించాడు ఓ వ్యక్తి. ఈ ఘటనపై ప్రస్తుతం కేసు నమోదు అయింది.
Gotabaya Rajapaksa Returns To Srilanka: శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స స్వదేశానికి తిరిగి వచ్చారు. దాదాపుగా 50 రోజులకు పైగా ప్రవాసంలో గడిపిన ఆయన స్వదేశం శ్రీలంకలో అడుగుపెట్టారు. రాజపక్స శుక్రవారం అర్థరాత్రి థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి సింగపూర్ మీదుగా కొలంబోలోని బండారు నాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టారు. రాజపక్స పార్టీ మద్దతుదారులు, నాయకులు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. భారీ సైనిక కాన్వాయ్ భద్రతలో కొలంబోలోని అతనికి కేటాయించిన ఇంటికి వెళ్లారు.
Home minister narottam mishra comments on Shabana Azmi, Naseeruddin Shah: మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ నటులు షబానా అజ్మీ, నసీరుద్దీన్ షా, జావేద్ అక్తర్ లపై సంచలన విమర్శలు చేశారు. వీరంతా తుక్డే-తుక్డే గ్యాంగ్ ఏజెంట్లే అని శనివారం అభివర్ణించారు. వీరంతా బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుండటంతో నరోత్తమ్ మిశ్రా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు నటులు, గీత రచయితలు బీజేపీ రాష్ట్రాల్లోని సమస్యలపై మాత్రమే మాట్లాడుతున్నారని.. బీజేపీ పాలిత ప్రభుత్వాలను…
Jagadish Reddy comments on komatireddy rajgopal reddy: మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీనే గెలుపొందుతునందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. యాదాద్రి జిల్లా నారాయణపురం మండలంల పుట్టపాకలో కార్యకర్తల కార్యకర్తల విస్తృత సమావేశంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో ఎగిరేగి గులాబీ జెండాయే అని ఆయన అన్నారు. కాషాయం కనుచూపు మేరలో లేదని వ్యాఖ్యానించారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీకి పోటీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని ఆయన అన్నారు. సర్వేలన్నీ తేల్చి చెబుతోంది ఇదే అని అన్నారు.
India is the fifth largest economy, UK is sixth: అమెరికా, బ్రిటన్, చైనా ఇలా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న దేశాల పరిస్థితి నెమ్మనెమ్మదిగా దిగజారుతోంది. దీంతో పాటు పలు దేశాలు మాంద్యం పరిస్థితుల్లోకి వెళుతున్నాయి. మరికొన్ని దేశాలు శ్రీలంక పరిస్థితికి దగ్గర్లో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు ఇలా ఉంటే ఇండియాలో మాత్రం ఆర్థిక మాంద్యం పరిస్థితులు వచ్చే అవకాశం దాదాపుగా ‘సున్నా’ అని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. దీంతో పాటు ఆర్థిక వృద్ధి రేటు కూడా 7 శాతానికి…
Satyavathi Rathod criticized union minister Kishan Reddy: కేంద్రమంత్రి ఒక పార్లమెంట్ కే పరిమితమై పనిచేయడం సిగ్గు చేటని.. నిర్మలా సీతారామన్, కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మంత్రి సత్యవతి రాథోడ్. బీజేపీకి తెలంగాణలో చోటు లేదని.. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసిన మూడో స్థానమే అని ఆమె అన్నారు. తెలంగాణలో బీహార్ కూలీలు 30 లక్షల మంది ఉన్నారని.. రాష్ట్రంలోని అనేక సంస్థల్లో వారు పనిచేస్తున్నారని ఆమె అన్నారు.
Telangana Vimochana Dinotsavam: తెలంగాణ విమోచన దినోత్సవంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు సమాయత్తం అవుతోంది. సెప్టెంబర్ 17న జరిగే విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలనుకుంటోంది. కేంద్ర సాంస్కృతిక, కేంద్ర హోం శాఖ అధ్వర్యంలో పెరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవాలు జరగనున్నాయి. కేంద్ర హోం శాఖ పరిధిలో సాయుధ దళాలతో పెరేడ్ నిర్వహించనున్నారు.
Minister Prashant Reddy criticizes Nirmala Sitharaman's comments: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ఆమెపై తెలంగాణ మంత్రులు మండిపడుతున్నారు. హరీష్ రావు ఛాలెంజ్ కి భయపడే నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసుకుందని ఎద్దేవా చేశారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిర్మాల సీతారామన్ హయాంలో రూపాయి విలువ విపరీతంగా పడిపోతుందని అన్నారు. కేసీఆర్ ను చూసి బీజేపీ వణికిపోతోందని అన్నారు. కేసీఆర్ రాష్ట్రం దాటి బయటకు వస్తే వైఫల్యాలు…
Pocharam Srinivas Reddy comments on Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై చేసిన విమర్శలు తెలంగాణలో కాకాపుట్టిస్తున్నాయి. ఇప్పటికే పలువురు మంత్రులు సీతారామన్ వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. తాజాగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై స్పందించారు. నేను బన్సువాడ ఎమ్మెల్యేగా.. మాజీ మంత్రిగా మీ ముందుకు వచ్చానని.. స్పీకర్ హోదాలో మాట్లాడటం లేదని ఆయన అన్నారు. నిర్మలా సీతారామన్ నాకు అక్కతో సమానం అని ఆయన అన్నారు.…
Gujarat riots case.. SC grants interim bail to Teesta Setalvad: 2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల కేసులో అమాయకులను ఇరికించేందుకు ప్రయత్నించేందుకు కల్పిత పత్రాలు, ఆరోపణలు చేశారనే కేసులో ప్రముఖ ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్ ను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఆమెకు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. మా దృష్టిలో తీస్తా సెతల్వాడ్ బెయిల్ కు అర్హురాలు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే తీస్తా సెతల్వాడ్ విచారణకు సహకరించాలని.. పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని కోరింది