Diesel Shortage: చెన్నై నగరంలో డిజిల్ కొరత.. బంకుల ముందు నో స్టాక్ బోర్డులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diesel Shortage in chennai city: చెన్నై నగరంలో డిజిల్ కొరత ఏర్పడింది. నిర్వాహక లోపాల కారణంగానే కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. పలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. డిజిల్ నింపుకోవడానికి వచ్చే వాహనాలతో బంకుల ముందు భారీ క్యూ ఏర్పడింది. క్రూడాయిల్ కొరత, పంపిణీ సమస్యల కారణంగా డిజిల్ కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే ఉన్నట్టుండి డిజిల్ కొరత రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఒక్క చెన్నైలోనే కాకుండా తమిళనాడులోని పలు నగరాల్లో కూడా డిజిల్ కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది.
పెట్రోల్, డిజిల్ కొరత కారణంగా ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. నేడు కూడా కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. నగరంలో 90 శాతం బంకుల్లో నో స్టాక్ బోర్డులే ఉన్నాయి. డిజిల్ దొరక్కపోవడంతో ట్రక్కులు, బస్సులు, వ్యాన్లు, జీపులు, కార్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత కొద్ది రోజులుగా చమురు సంస్థలు డీలర్లు నిర్వహించే పెట్రోల్ బంకులకు తక్కువ పరిమాణంలో డిజిల్ సరఫరా చేయడంతోనే ఈ కొరత వచ్చినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర పెరుగుతుండటంతో పాత ధరకే డిజిల్ సరఫరా చేస్తే తమకు నష్టాలు వస్తాయని భావించే హిందూస్థాన్ పెట్రోలియం నగరానికి తక్కువగా డీజిల్‌ను సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
Read Also: Praveen Nettaru Case: ప్రవీణ్ నెట్టారు మర్డర్ కేసు.. 33 చోట్ల ఎన్ఐఏ సోదాలు
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన కొన్ని రిటైల్ ఇంధన అవుట్ లెట్ నిర్వహణ సమస్యల కారణంగా చెన్నైలో తాత్కాలిక సరఫరా కొరత ఏర్పడిందని.. వాటిని పునరుద్ధరించినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. అయితే ఇండియన్ ఆయిల్ ఎలాంటి సమస్య ఎదురుకాలేదని చెప్పింది. కొన్ని నిర్వహణ సమస్యల కారణంగా, చెన్నైలో డిజిల్, పెట్రోల్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని.. ఇప్పుడు నిరంతరంగా సరఫరాకు హామీ ఇస్తున్నట్లు భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ తెలిపింది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?