khaki Ganpati In Mumbai: వినాయక చవితి వేడుకల్లో వివిధ రుపాల్లో గణనాథుడు కొలువవుతున్నాడు. భక్తులు తమకు నచ్చిన స్టైల్లో వినాయకులను ప్రతిష్టించారు. ఇటీవల పుష్ఫ రాజ్ తరహాలో తగ్గేదే లేదనే స్టైల్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించడం చూశాం. తాజాగా ముంబై పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. ఓ వైపు భక్తితో పాటు ప్రజలకు సందేశాన్ని ఇచ్చే విధంగా ‘‘ ఖాకీ గణపతి’’ని ప్రతిష్టించారు.
BJP Leader sushil modi comments on cm nitish kumar: బీజేపీ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ, బీహార్ సీఎం నితీష్ కుమార్ పై సంచనల వ్యాఖ్యలు చేశారు. బీహార్ పొత్తు వదులకున్న తర్వాత నుంచి సుశీల్ మోదీ, నితీష్ కుమార్ పై వరసగా విమర్శలు చేస్తున్నారు. నితీష్ కుమార్ తన జీవితంలో ప్రధాని కాలేడని.. ఆర్జేడీ పార్టీ బీహార్ లో జేడీయూ లేకుండా చేస్తుందని జోస్యం చెప్పారు. మణిపూర్ రాష్ట్రంలో ఏడుగురిలో ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో…
Pilot Threatens To Crash Plane into Walmart in USA: అమెరికాలో ఓ పైలెట్ విమానాన్ని దొంగిలించి కూల్చేస్తానని బెదిరిస్తున్నాడు. అమెరికాలో పైలెట్ గా పనిచేస్తున్న ఓ యువకుడు భద్రతా అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. వాల్మార్ట్ పై విమానాన్ని కూలుస్తానంటూ ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. అమెరికాలోని ఈశాన్య మిస్సిస్సిప్పీలోని టుపెలోలోలోని వెస్ట్ మెయిన్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
Amit Shah comments on congress party: భారతదేశం నుంచి కాంగ్రెస్ పార్టీ కనుమరగువుతోందని.. ఇక భవిష్యత్తు అంతా బీజేపీదే అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దక్షిణ జోనల్ కౌన్సిల్ మీటింగ్ కోసం కేరళ వెళ్లిన ఆయన సమావేశం అనంతరం బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. భారత దేశం నుంచి కాంగ్రెస్ అంతరించిపోతోందని ఆయన అన్నారు.
Jammu Kashmir-person acting as a spy was arrested: భద్రతా బలగాలు, ఆర్మీకి సంబంధించి సున్నిత సమాచారాన్ని చేరవేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు. జమ్మూ కాశ్మీర్ కిష్త్వార్ జిల్లాకు చెందిన ముస్లిం మత గురువును అరెస్ట్ చేశారు. కాశ్మీరీ జన్బాజ్ ఫోర్స్ అనే పాక్ ఆధారిత ఉగ్రవాద సంస్థతో సన్నిహితంగా ఉన్నట్లు పోలీసులు ఆరోపించారు. భద్రతాబలగాలకు సంబంధించిన కదలికలు, ఫోటోలు వంటి సమాచారాన్ని కూడా ఉగ్రవాదులకు చేరవేసేందుకు సహకరించాడు.
Babulal Marandi Comments on tribal girl molestation, killing in Jharkhand: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బాబూలాల్ మారాండీ రాష్ట్రంలో జరిగిన మరో అత్యాచారంపై ట్వీట్ చేశారు. దుమ్కా జిల్లాలో 14 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం చేసి.. చెట్లుకు ఉరివేశారని ఆరోపించారు. నిందితుడు అర్మాన్ అన్సారీని అరెస్ట్ చేసినట్లు జార్ఖండ్ ప్రతిపక్ష నేత బాబూలాల్ మరాండీ ట్వీట్ లో పేర్కొన్నారు. జార్ఖండ్ లో ఎంతమంది గిరిజనులు ఇలాంటి కారతకాలకు బలవుతారని ప్రశ్నించారు. తను చేసిన ట్వీట్ కు కేంద్రహోం…
CM Arvind kejriwal comments on BJP over Gujarat elections: ఈ ఏడాది చివర్లో గుజరాత్ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ సారి గుజరాత్ లో పాగా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) భావిస్తోంది. బీజేపీ నుంచి అధికారాన్ని తీసుకోవాలని ఆప్ భావిస్తోంది. ఇదిలా ఉంటే ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ లో రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు. తాజాగా ఆయన బీజేపీ కార్యకర్తలను, నాయకులును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ లో బీజేపీ కార్యకర్తలు…
Man Swallowed 87 Cocaine Capsules, Arrested At Mumbai Airport: సూర్య నటించిన వీడొక్కడే సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఓ సీన్ లో డ్రగ్స్ ను ఓ క్యాప్సుల్ లో ప్యాక్ చేసి మింగేసి కడుపులో దాచుకుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో జరిగింది. అక్రమంగా భారత్ కు డ్రగ్స్ తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఆఫ్రికా దేశం ఘనా నుంచి వచ్చిన వ్యక్తిపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు…
PAKISTAN FLOODS-one third of Pakistan underwater: అసలే ఆర్థిక ఇబ్బందులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్ పరిస్థితి వరదల కారణంగా దారుణంగా మారింది. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు ఈ ఏడాది రుతుపవన కాలంలో కురిశాయి. దీంతో పాకిస్తాన్ లో ఒక్కసారిగా భీకర వరదలు సంభవించాయి. సింధు నదితో పాటు దాని ఉపనదులు, స్వాత్ నదులు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో సింధ్ ప్రావిన్స్, బలూచిస్థాన్ ప్రావిన్సులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో పాటు ఖైబర్ ఫఖ్తుంక్వా, గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతాల్లో కూడా తీవ్ర…
Dalit man killed by in-laws for marrying upper-caste woman: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పరవు హత్య జరిగింది. అగ్రకులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు దళిత వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. అమ్మాయి తల్లిదండ్రులే ఈ హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. కర్రలతో కొట్టి దారుణంగా యువకుడిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అంతకుముందు.. పెళ్లి చేసుకున్న జంట రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు.