Delhi Ban On Firecrackers: ఢిల్లీ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దీపావళికి కూడా ఢిల్లీ నగర పరిధిలో ఎలాంటి ఫైర్ క్రాకర్స్ కు అనుమతి ఇవ్వడం లేదు. తాజాగా ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ఈ సారి కూడా ఢిల్లీ పరిధిలో ఫైర్ క్రాకర్స్ పై నిషేధం ఉంటుందని ప్రకటించారు. ఆన్ లైన్ లో కూడా పటాకుల అమ్మకాలపై కూడా నిషేధం ఉంటుందని.. నిషేధాన్ని కఠినంగా అమలు చేసేలా కార్యాచరణ ప్రణాళికను కఠినంగా అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు.
ఈ దీపావళికి కూడా ఫైర్ క్రాకర్స్ పై నిషేధం ఉంటుందని ఆయన స్ఫష్టం చేశారు. జనవరి 1, 2023 వరకు ఈ నిషేధం కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. దేశ రాజధానిలో బాణాసంచా తయారీ, అమ్మకం, వినియోగంపై పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు ఢిల్లీ పోలీసులు, రెవెన్యూ, ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలితో ప్రణాళిక రూపొందిస్తామని వెల్లడించారు.
Read Also:Bridge Collapses: రిబ్బన్ కట్ చేసింది.. వంతెన కూలింది.. వీడియో వైరల్
ఢిల్లీలో ఇప్పటికే కాలుష్యం పరిధిదాటి పెరుగుతోంది. విపరీతమైన వాహనాల వినియోగంతో పాటు హర్యానా, యూపీల్లో పంట చేతికొచ్చిన తర్వాత పంట వ్యర్థాను కాల్చివేస్తుండటంతో రాజధాని వాసులు తీవ్రమైన గాలి కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నారు. కాలుష్య సమయంలో సరి, బేసీ వాహనాల విధానాన్ని అమలు చేస్తోంది ఢిల్లీ సర్కార్. అయితే హిందువులకు ఎంతో ముఖ్యమైన పండగ అయిన దీపావళికి క్రాకర్స్ నిషేధించడంపై ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే ప్రతీ ఏడాది శీతాకాలం సమయంలో ముఖ్యంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. ఈ సమయాల్లో ఢిల్లీలో కనుచూపు మేరలో వస్తువును కూడా చూడలేని పరిస్థితి ఏర్పడుతోంది. చాలా మంది శ్వాస సమస్యలతో బాధపడుతుంటారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.