Gujarat AAP leader arrested for raping: ఈ ఏడాది చివర్లో గుజరాత్ ఎన్నికలు జరగబోతున్నాయి. మరోసారి బీజేపీ గుజరాత్ లో గెలుపొందాలని భావిస్తోంది. 2024 ఎన్నికల ముందు సెమిఫైనల్స్ గా ఎన్నికలను భావిస్తోంది. ఇదిలా ఉంటే పంజాబ్ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న ఉత్సాహంతో గుజరాత్ లో కూడా పాగా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. ఇదిలా ఉంటే ఆప్ నేతలు మాత్రం పలు కేసుల్లో ఇరుక్కుంటుండం ఆ పార్టీకి మింగుడపడటం లేదు.
Ankita Bhandari Case: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అంకితా భండారీ హత్య కేసు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నేత కుమారుడి రిసార్టులో పనిచేస్తున్న అంకితాను హత్య చేశారు. ఈ హత్యలో బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్య కీలక నిందితుడిగా ఉన్నారు. దీంతో శుక్రవారం వినోద్ ఆర్యను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు బీజేపీ ఉత్తర్వులు జారీ చేసింది.
Mithun Chakraborty comments on TMC: బీజేపీ నేత, సినీ నటుడు మిథున్ చక్రవర్తి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కోల్కతాలో మీడియాతో మాట్లాడిన ఆయన అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)పై విమర్శలు గుప్పించారు. గత జూలైలో మిథున్ చక్రవర్తి.. టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు. తాజాగా మరోసారి ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. తాను జూలైలో చేసి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మిథున్ చక్రవర్తి అన్నారు. టీఎంసీకి చెందిన 38 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో…
భారతదేశంలో మొబైల్ నెట్ వర్క్ లో కొత్త శకం ప్రారంభం కాబోతోంది. 5 జీ ప్రారంభానికి డేట్ పిక్స్ అయింది. అక్టోబర్ 1న ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో ప్రధాని నరేంద్ర మోదీ భారత దేశంలో 5 జీ సేవలు ప్రారంభించనున్నారు.
PFI conspiracy to make India an Islamic country: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ), ఈ సంస్థ నాయకుల ఇళ్లపై రెండు రోజుల క్రితం దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఎన్ఐఏ, ఈడీలు సోదాలు నిర్వహించి 106 మంది కీలక సభ్యులను అదుపులోకి తీసుకుంది. అయితే తాజాగా ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 10 మంది రిమాండ్ రిపోర్టులో ఎన్ఐఏ కోర్టుకు పలు విషయాలను తెలియజేసింది. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని.. ప్రముఖ నాయకులను లక్ష్యంగా చేసుకుని అత్యంత నేరారోపణలు ఉన్నాయని…
CBI raids in child pornography case: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టికేషన్(సీబీఐ) దేశవ్యాప్తంగా భారీగా దాడులు చేసింది. పిల్లల లైంగిక దోపిడికి సంబంధించిన కేసులో 19 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 56 ప్రదేశాలపై దాడులు చేశారు. పిల్లలకు సంబంధించిన లైంగిక మెటీరియర్ ను సర్య్కులేట్ చేస్తున్న ముఠాల ఆటకట్టించేందుకు సీబీఐ పెద్ద ఎత్తున రంగంలోకి దిగింది. న్యూజిలాంట్ లోని ఇంటర్పోల్ యూనిట్ సింగపూర్ ద్వారా ఇచ్చిన సమాచారం మేరకు పెద్ద ఎత్తున సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు.
Hindu Girl Kidnapped In Pakistan: పాకిస్తాన్ లో హిందూ బాలికలు, మహిళల కిడ్నాపులు ఆగడం లేదు. బలవంతంగా హిందూ బాలికలను, యువతులను అపహరించి మతం మార్చి బానిసలుగా మార్చుకుంటున్నారు. అయినా అక్కడి ప్రభుత్వం మైనారిటీల రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అవకాశం వస్తే కాశ్మీర్లో మైనారిటీ హక్కుల గురించి సిగ్గులేకుండా మాట్లాడుతోంది. తన దేశంలో మైనారిటీలో జరుగుతున్న అకృత్యాల గురించి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
Death penalty for former ministers in China: అవినీతికి పాల్పడిన వ్యక్తులు ఎంతటివారైనా వదిలిపెట్టేలా లేదు చైనా. తాజాగా రెండు రోజుల వ్యవధిలో అవినీతికి పాల్పడిని ఇద్దరు మాజీ మంత్రులకు ఉరిశిక్ష విధించారు. అవినీతి అధికారులు, రాజకీయ నాయకులపై జిన్ పింగ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అమెరికాను మించి సూపర్ పవర్ గా ఎదగాలని భావిస్తున్న జిన్ పింగ్.. 2012 నుంచి అధికారం చేపట్టిన తర్వాత నుంచి అవినీతిని సహించడం లేదు. ఇప్పటికే రెండు పర్యాయాలు చైనా అధ్యక్షుడిగా పనిచేసిన జిన్ పింగ్…
Demands to ban PFI: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా( పీఎఫ్ఐ) తీవ్రవాద సంబంధిత కార్యకలాపాలకు, మనీలాండరింగ్ కు పాల్పడుతుందని ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ( ఎన్ఐఏ), ఈడీలు సంయుక్తంగా 15 రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిపాయి. 100కు పైగా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ‘ ఆపరేషన్ ఆక్టోపస్’ పేరుతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే భారత వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్న పీఎఫ్ఐని నిషేధించాలని పలు వర్గాల నుంచి డిమాండ్లు మొదలయ్యాయి.
Anti-Hijab Protests In Iran: హిజాబ్ కు వ్యతిరేకంగా ఇరాన్ వ్యాప్తంగా భారీ నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతిని గత వారం మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. గత శుక్రవారం ఆమె కోమాలోకి వెళ్లి చికిత్స పొందుతూ మరణించింది. ఆమె మృతి దేశవ్యాప్తంగా మహిళలు, యువతలో కోపాన్ని రగిల్చింది. దీంతో రాజధాని టెహ్రాన్ తో పాటు అన్ని ప్రావిన్సుల్లో భారీగా ఆందోళనలు జరుగుతున్నాయి. మహిళలు హిజాబ్ ను వ్యతిరేకిస్తూ.. హిజాబ్ ను తీసేస్తూ.. జట్టు కత్తిరించుకుని ఆందోళనలు…