Govt bans 45 YouTube videos: భారతదేశానికి వ్యతిరేకంగా విషం చిమ్ముతూ.. దేశంలో అశాంతి ఏర్పడటానికి ప్రయత్నిస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై ఉక్కపాదం మోపుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే పలు పాకిస్తాన్ బేస్డ్ యూట్యూబ్ ఛానెళ్లతో పాటు భారత వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతున్న మరికొన్ని ఛానెళ్లను కేంద్రం నిషేధించింది. తాజాగా మరో 10 యూట్యూబ్ ఛానెళ్లపై బ్యాన్ విధించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Anti-Hijab Protests in Iran: మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతి మరణం ఇరాన్ దేశాన్ని కుదిపేస్తోంది. హిజాబ్ సరిగ్గా ధరించలేదని చెబుతూ.. మహ్స అమినిని అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆమె మరణించింది. ఇది జరిగినప్పటి నుంచి ఇరాన్ వ్యాప్తంగా మహిళలు, యువత పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేస్తోంది. ముఖ్యంగా మహిళలు హిజాబ్ తీసేస్తూ.. జట్టు కత్తిరించుకుని నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం ఈ నిరసనలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. అక్కడి సోషల్ మీడియాపై […]
Dalit Student Dies After Alleged Assault By Teacher in uttar pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తప్పుగా పదం ఉచ్ఛరించాడని ఓ ఉన్నత కులానికి చెందిన ఉపాధ్యాయుడు దళిత విద్యార్థిపై తీవ్రంగా కొట్టాడు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ.. విద్యార్థి మరణించారు. ఈ ఘటన ఔరయ్యా జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన 15 ఏళ్ల దళిత విద్యార్థి 10 తరగతి చదువుతున్నాడు. విద్యార్థి ఇటీవల పరీక్షలో ఒక పదం తప్పుగా రాశాడనే కారణంతో ఉన్నత కులానికి చెందిన…
Mass protests in Russia: పాక్షిక సైనిక సమీకరణపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీసుకున్న నిర్ణయంపై ఆ దేశంలో భారీగా నిరసనలు జరుగుతున్నాయి. బుధవారం రష్యాలో యువత పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. పుతిన్ ప్రకటనతో అక్కడి యువత గందరగోళానికి గురువుతోంది. ఉక్రెయిన్ నుంచి ఎదురువుతున్న ప్రతిఘటనను తిప్పికొట్టేందుకు దాదాపుగా 3 లక్షల మంది సైన్యాన్ని సిద్ధం చేస్తున్నట్లు పుతిన్ వెల్లడించారు. దీంతో పాటు గతంలో మిలిటరీలో పనిచేసిన వారిని, యువతను సమీకరించేందుకు పాక్షిక సైనిక సమీకరణపై ఆదేశాలు జారీ చేశారు.
PFI targeting RSS leaders: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) గురించి నెమ్మనెమ్మదిగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టడంతో పాటు ముస్లిం దేశాల నుంచి ఫండ్స్ కలెక్ట్ చేయడం, ముస్లిం యువతను అల్ ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రేరేపించడం వంటి అభియోగాలను ఎదుర్కొంటోంది పీఎఫ్ఐ. తాజాగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) నాయకులను, బీజేపీ నాయకులను టార్గెట్ చేసినట్లుగా మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ వర్గాలు తెలిపాయి.
Extension of JP Nadda's tenure as BJP President: బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడగించే ఆలోచనలో ఉంది బీజేపీ. మరో రెండేళ్లలో లోక్ సభ ఎన్నికలు రాబోతున్న తరుణంలో అప్పటి వరకు జేపీ నడ్డానే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉంచాలని బీజేపీ భావిస్తోంది. 2024 వరకు ఆయనే పార్టీ అధ్యక్షుడిగా ఉండే అవకాశం ఉంది. 2020లో అమిత్ షా నుంచి జేపీ నడ్దా బీజేపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారు. నడ్డా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి జనవరి…
physically assaults young woman in Jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. భర్త కళ్లముందే భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని పాలము జిల్లాలో జరిగింది. అత్తామామలతో గొడవ పెట్టుకుని.. తల్లిదండ్రుల ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Agitation of Farmers Unions- Demand for implementation of Telangana schemes: తెలంగాణలో అమలు అవుతున్న రైతు సంక్షేమ పథకాలు మాకు కావాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక రైతులు ఆందోళలు, నిరసన ర్యాలీలు చేస్తున్నారు. ఆ రాష్ట్ర, కేంద్ర ప్రభత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సోమవారం రైతులు భారీ ధర్నా చేశారు. దీంతో కర్ణాటక సర్కార్ జాతీయ రైతు సంఘం నాయకులను అరెస్ట్ చేసింది. కర్ణాటకలో కూడా తెలంగాణ రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Jaishankar angered America over military aid to Pakistan: పాకిస్థాన్ కు అమెరికా చేస్తున్న మిలిటరీ సాయంపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఎఫ్-16 యుద్ధ విమానాలకు సంబంధించి అమెరికా, పాకిస్తాన్ మధ్య ఒప్పందం కుదిరింది. దీనిని జైశంకర్ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ విషయంలో అమెరికా ఎవరినీ మోసం చేయం చేయలేదని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాద సంస్థలపై పోరాటానికి ఇటీవల పాకిస్తాన్ కు అమెరికా ఎఫ్-16 యుద్ధ పరికరాలను అమ్ముతున్నట్లు బైడెన్…
Russia School Shooting: రష్యాలో దారుణం జరిగింది. ఓ దుండగుడు స్కూల్ లో విచక్షణారిహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13 మంది మరణించారు. ఘటన జరిగిన తర్వాత నిందితుడు తనను తాను చంపుకున్నాడు. సెంట్రల్ రష్యాలోని ఇజెవ్స్క్ నగరంలో ఈ ఘటన జరిగింది. నగరంలోని ఓ పాఠశాలలోకి ప్రవేశించి ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మరణించిన 13 మందిలో ఏడుగురు పిల్లలు కూడా ఉన్నట్లు గవర్నర్ అలెగ్జాండర్ బ్రెచలోవ్ వెల్లడించారు.