Hindu Girl Kidnapped In Pakistan: పాకిస్తాన్ లో హిందూ బాలికలు, మహిళల కిడ్నాపులు ఆగడం లేదు. బలవంతంగా హిందూ బాలికలను, యువతులను అపహరించి మతం మార్చి బానిసలుగా మార్చుకుంటున్నారు. అయినా అక్కడి ప్రభుత్వం మైనారిటీల రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అవకాశం వస్తే కాశ్మీర్లో మైనారిటీ హక్కుల గురించి సిగ్గులేకుండా మాట్లాడుతోంది. తన దేశంలో మైనారిటీలో జరుగుతున్న అకృత్యాల గురించి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
తాజాగా సింధ్ ప్రావిన్స్ లోని హిందూ మతానికి చెందిన 13 ఏళ్ల బాలికను గత వారం అపహరించారు. మార్కెట్ నుంచి తిరిగి వస్తుండగా.. అపహరణకు గురైంది. అయితే బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. కేసు నమోదుకు పోలీసులు నిరాకరించారని బాధిత కుటుంబం ఆరోపించింది. ఈ ఘటనకు ముందు కూడా ఓ హిందూ వివాహితను అపహరించి, బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. ఓ ముస్లిం కుటుంబం సదరు హిందూ మహిళను బందీగా ఉంచుకుంటోంది. కిడ్నాపులు, బలవంతంగా పెళ్లిళ్లు చేసుకుని హిందూ స్త్రీలను ఇస్లాంలోకి మారుస్తున్నారు.
Read Also: China: అవినీతిపై జిన్ పింగ్ ఉక్కుపాదం.. మాజీ మంత్రులకు ఉరిశిక్ష
పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువులు, సిక్కులు, క్రైస్తవులపై దాడులు ఆగడం లేదు. కనీసం అక్కడి ప్రభుత్వం వీటిని పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా మహిళల పరిస్థితి దిగజరారిపోతోందని ఇంటర్నేషనల్ ఫోరమ్ ఫర్ రైట్ అండ్ సెక్యూరిటీ నివేదించింది. పాకిస్థాన్ లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులో బునెర్ జిల్లాలో ఆగస్టు 20న సిక్కు వర్గానికి చెందిన ఉపాధ్యాయురాలు దిన కౌర్ ను బలవంతంగా కిడ్నాప్ చేసి ఇస్లాంలోకి మార్చారు. ఈ ఘటనపై ప్రావిన్సులోని సిక్కువర్గం భారీ నిరసన చేపట్టింది. దినకౌర్ కిడ్నాప్ పై, బలవంతపు మతమార్పిడిపై స్థానిక పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేయలేదు.
2021లో పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్సులో దాదాపుగా 6754 మంది హిందూ మహిళలు, బాలికలు అపరహరణకు గురయ్యారు. ఇందులో 1890 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. 3721 మంది దారుణంగా హింసించబడ్డారు. 752 మంది బాలికపై అత్యాచారం జరిగినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.