Chandigarh Airport To Be Renamed After Bhagat Singh: చండీగఢ్ విమానాశ్రయానికి పేరు మార్పు గురించి హర్యానా, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వినతుల నేపథ్యంలో విమానాశ్రయం పేరును ‘‘ భగత్ సింగ్’’గా మార్చుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రకటించారు. గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడికి నివాళిగా.. చండీగఢ్ విమానాశ్రయం పేరును ఇప్పుడు షహీద్ భగత్ సింగ్ గా మార్చుతున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు.
Islamic body seeks ban on bhajans across schools in jammu kashmir: కాశ్మీర్ పాఠశాలల్లో శనివారం చేస్తున్న భజనలు, సూర్య నమస్కారాలు నిలిపివేయాలని ముత్తాహిదా మజ్లిస్- ఎ- ఉలేమా(ఎంఎంయూ) ప్రభుత్వం, విద్యాశాఖను కోరింది. ముస్లింల మతపరమైన భావాలు దెబ్బతింటున్న కారణంగా వీటన్నింటిని నిలపివేయాలని కోరింది. జామియా మసీద్ మతగురువు, హురియత్ ఛైర్మన్ మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ నేతృత్వంలోని ఈ సంస్థ యోగా, ఉదయం ప్రార్థనల పేరుతో చట్టాలు తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.ముస్లిం విద్యార్థులు భజనలు, సూర్యనమస్కారాలు చేయాలని పాఠశాల సిబ్బంది…
Chimpanzees Kidnapped For Ransom: ప్రపంచంలో ఇదే మొదటిసారి కావచ్చు. డబ్బుల కోసం మనుషులను కిడ్నాప్ చేయడం చూశాం.. కానీ కాంగోలో ఓ సాంక్చుయరీ నుంచి ఏకంగా మూడు చంపాజీలను కిడ్నాప్ చేసి డబ్బుల కోసం డిమాండ్ చేశారు కొందరు. సెప్టెంబర్ 9న కటంగా సాంక్చుయరీ నుంచి కిడ్నాప్ చేశారు. ఆ సాంక్చుయరీలో మొత్తం 5 చింపాంజీలు ఉంటే రెండు వంటగదిలో దాక్కోగా..సీజర్, హుస్సేన్, మోంగా అనే మూడింటిని దుండగులు కిడ్నాప్ చేశారు. ఇలా చింపాంజీలను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం ప్రపంచంలో…
Punjab Politics- Governor vs CM: పంజాబ్ రాష్ట్రంలో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్, సీఎం భగవంత్ మధ్య వివాదం చెలరేగుతోంది. బలపరీక్ష నిర్వహించి సభలో బలాన్ని నిరూపించుకోవాలని సీఎం భగవంత్ మాన్ అనుకున్నప్పటి నుంచి గవర్నర్, సీఎంల మధ్య వివాదం చెలరేగింది. ఇదిలా ఉంటే తాజాగా భగవంత్ మాన్ కోరిన మేరకు మంగళవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలకు పిలుపునిచ్చారు. ‘‘చాలా దయ’’తో గవర్నర్ మా అభ్యర్థనను అంగీకరించారని.. స్పీకర్ కల్తార్ సింగ్ సంధ్వన్ ట్వీట్ చేశారు. అయితే ఈ సెషన్ లో…
Nitish Kumar, Lalu Prasad to meet Sonia Gandhi in Delhi today: 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని రాజకీయ పక్షాలు ఏకం కావడానికి రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో ఉన్నారు నితీష్ కుమార్, లాలూ ప్రసాద్, కేసీఆర్ వంటి నేతలు. బీహార్ లో జేడీయూ-ఆర్జేడీ మహాకూటమిలాగే కేంద్రంలో మహాకూటమి ఏర్పాటు చేసే దిశలో ఉన్నారు నితీష్ కుమార్. ఇటీవల బీహార్ సీఎంగా మరోసారి బాధ్యతలు చేపట్టిన నితీష్ కుమార్.. సెప్టెంబర్ మొదటివారంలో…
Petrol bomb attack on RSS leader's house in tamilnadu: తమిళనాడు వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ నేతలు, బీజేపీ నాయకులు ఇళ్లపై వరసగా దాడులు జరుగుతున్నాయి. శనివారం రాత్రి మధురైలో మరోదాడి జరిగింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఎంఎస్ కృష్ణన్ ఇంటిపై మూడు పెట్రోల్ బాంబులు విసిరారు దుండగులు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. ఘటనకు పాల్పడిన దుండగుడి కోసం పోలీసులు సెర్చ్ టీంలను ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో ఎవరూ…
Ganja smugglers attacked the police: గంజాయి ముఠాను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడికి తెగబడ్డారు స్మగ్లర్లు. దాడిలో సీఐ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన చావుబతులకు మధ్య ఉన్నారు. సీఐ శ్రీమంత్ ఇల్లాల్ నేతృత్వంలో పోలీసుల టీం దర్యాప్తులో భాగంగా బీదర్ జిల్లాలో సరిహద్దులోని మహారాష్ట్ర గ్రామంలో గంజాయి పంటను సాగు చేస్తున్న ప్రాంతానికి వెళ్లారు. బీదర్ జిల్లాలోని కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దులోని తురోరి, హోన్నాలి గ్రామాల సమీపంలో శుక్రవారం అర్థరాత్రి 40 మందికి పైగా స్మగ్లర్ల ముఠా పోలీసులపై విచక్షణారహితంగా దాడులు చేశారు.
North Korea fires ballistic missile: నార్త్ కొరియా మరోసారి క్షిపణి ప్రయోగం చేపట్టింది. ఆదివారం తన నార్త్ కొరియా తూర్పు తీరంలో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7 గంటలకు ఉత్తర కొరియాలోని ప్యాంగాంగ్ ప్రావిన్సులోని టైచోన్ ప్రాంతం నుంచి స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. మాక్ 5 వేగంతో దాదాపుగా 60 కిలోమీటర్ల ఎత్తులో 600 కిలోమీటర్లు ప్రయాణించినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. కాగా.. క్షిపణి 50 కిలోమీటర్ల ఎత్తులో…
BJP state in-charges meeting: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సిద్ధం అవుతోంది. కేంద్ర మంత్రులు, జాతీయాధ్యక్షుడు, ఇతర కీలక నేతలు తరుచుగా పలు రాష్ట్రాలను సందర్శిస్తున్నారు. ఇటీవల బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 2024 లోక్ సభ ఎన్నికలపై చర్చ జరిగింది. గతంలో బీజేపీ పార్టీ తక్కువ మెజారిటీతో ఓడిపోయిన 100కు పైగా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సమావేశంలో దిశానిర్ధేశం చేశారు.
Congress party key meeting in Rajasthan: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు రాజస్థాన్ కాంగ్రెస్ లో చిచ్చు పెడుతోంది. సీఎం అశోక్ గెహ్లాట్ పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీలో ఉండనున్నారు. దీంతో ఆయన సీఎం పదవిని వదులుకోనున్నారు. అయితే ముందుగా అశోక్ గెహ్లాట్ పార్టీ అధ్యక్ష పదవితో పాటు రాజస్థాన్ సీఎంగా కొనసాగాలని అనుకున్నప్పటికీ.. రాహుల్ గాంధీ ‘‘ఒక వ్యక్తికి ఒక పదవి’’ అనేది కాంగ్రెస్ నిర్ణయం అని స్పష్టం చేశారు. దీంతో ఇక గెహ్లాట్ అధ్యక్షుడు అయితే సీఎం పోస్టు…