PM Modi can bring peace between Russia and Ukraine: రష్యా, ఉక్రెయిన్ మధ్య శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు భారత ప్రధాని నరేంద్రమోదీ మధ్యవర్తిత్వం వహించాలని కోరారు మెక్సికో విదేశాంగ మంత్రి మార్సెలో లూయిస్ ఎబ్రార్డ్ కాసౌబోన్. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన రష్యా,ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
Pakistani diplomat meeting with Sikh separatists: పాకిస్తాన్ తన తీరును మార్చుకోవడం లేదు. భారతదేశాన్ని ఇరుకున పెట్టే ప్రతీ విషయంలో భాగమవుతోంది. కెనడా కేంద్రంగా సిక్కు వేర్పాటువాదులు సిక్క రిఫరెండం ఏర్పాటు చేసిన రోజునే.. పాకిస్తాన్ అధికారులు పలువురు వేర్పాటువాద నేతలతో రహస్య సమావేశాలు నిర్వహించారు. కెనడాలోని కాన్సుల్ జనరల్ జన్బాజ్ ఖాన్ వాంకోవర్ నగరంలోని సర్రేలోని రెండు ఖలిస్తానీ అనుకూల గురుద్వారాలను సందర్శించారు. పాకిస్తాన్ వరద సహాయం కోసం విరాళాలు పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే పాక్ అసలు ఎజెండా మాత్రం…
congress president elections: కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు చెప్పారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ కూడా అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం లేదని శుక్రవారం ఆయన తెలిపారు. నేను పోటీ చేయాలనుకుంటున్నానని.. త్వరలోనే నామినేషన్ దాఖలు చేస్తానని అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్షం బలంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
Anti-Hijab Protest In Iran: మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతి మరణం ఇస్లామిక్ రిపబ్లిక్ అయిన ఇరాన్ దేశాన్ని కుదిపేస్తుంది. హిజాబ్ ధరించలేదని చెబుతూ.. మహ్సా అమినిని మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆమె కోమాలోకి వెళ్లి చనిపోయింది. ఈ మరణం యావత్ దేశాన్ని కుదిపేసింది. మహిళలు, యువత పెద్ద ఎత్తున బయటకు వచ్చి ప్రభుత్వానికి, ఇరాన్ సుప్రీం లీడర్ కు వ్యతిరేకంగా ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హిజాబ్ ను విసిరేస్తూ.. జట్టు కత్తిరించుకుని మహిళలు పెద్ద…
PFI called for Kerala bandh: గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై దాడులు చేసింది. ఉగ్రవాద, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో పాటు మనీలాండరింగ్ కు పాల్పడుతున్నారనే అభియోగాలపై ఎన్ఐఏ, ఈడీ అధికారులు దాడులు చేశారు. దాదాపుగా 100 మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రాలకు సమాచారం లేకుండా పకడ్భందీగా కేంద్ర సంస్థలు ఆపరేషన్ చేశాయి.
Heavy rains in Delhi: ఢిల్లీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగర జీవితం మొత్తం అతలాకుతలం అయింది. గురువారం రోజు భారీ వర్షాలు కురవడంతో జనజీవితం స్తంభించింది. భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. శుక్రవారం కూడా నగరంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
Petrol bomb hurled at BJP office in Coimbatore: తమిళనాడులో ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడ్డాయి. కోయంబత్తూర్ నగరంలో బీజేపీ ఆఫీసుపై పెట్రోల్ బాంబుతో దాడి చేశారు దుండగులు. గురువారం రాత్రి 8.40 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన గుర్తుతెలియని దుండగులు న్యూ సిదాపుదూర్ లోని వీకే మీనన్ రోడ్డులోని బీజేపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు. అయితే పెట్రోల్ బాంబు పేలకపోవడంతో ప్రమాదం తప్పింది. పెట్రోల్ బాంబుకు మంటలు అంటుకోకపోవడంతో అది పేలలేదు. కార్యాలయానికి కొన్ని మీటర్ల దూరంలో బాంబును దుండగులు విసిరేసినట్లు సీసీ…
Nitish Kumar, Lalu Yadav To Meet Sonia Gandhi: 2024 లోకసభ ఎన్నికల కోసం పార్టీలు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నాయి. బీజేపీకి గట్టిపోటీ ఇచ్చేందుకు ఈ సారి ప్రతిపక్షాల సిద్ధం అవుతున్నాయి. జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. బీహార్ రాష్ట్రంలో ఏర్పడిన విధంగానే జాతీయ స్థాయిలో కూడా మహాకూటమి ఏర్పాటు చేసే ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. బీహార్ రాష్ట్రంలో జేడీయూ-ఆర్జేడీ కలిసి మహకూటమిని ఏర్పాటు చేసి మరోసారి సీఎం అయ్యారు నితీష్ కుమార్. కాంగ్రెస్ తో పాటు…
jeevitha rajasekhar:తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉంది బీజేపీ. అందుకు తగ్గట్లుగా కేంద్ర మంత్రులు, కీలక నేతలు తరుచుగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ‘ప్రజాసంగ్రామ యాత్ర’పేరుతో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలు చేస్తున్నారు. తాజాగా నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర కూడా పూర్తయింది. అయితే రానున్న రోజుల్లో మరింతగా బలపడాలని బీజేపీ భావిస్తోంది. దీని కోసం పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా ప్లాన్ చేస్తోంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి కీలక…
Pakistan delegation on secret visit to Israel: ఉప్పు నిప్పుగా ఉండే పాకిస్తాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు చిగురించే అవకాశం కనిపిస్తోంది. ఓ ముస్లిం దేశంగా పాకిస్తాన్ మరో ముస్లిం దేశం అయిన పాలస్తీనాకు మద్దతు తెలుపుతూ.. ఇప్పటి వరకు ఇజ్రాయిల్ తో దౌత్యసంబంధాలను పెట్టుకోలేదు. అయితే ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలో భారత చిరకాల మిత్రదేశం అయిన ఇజ్రాయిల్ తో పాకిస్తాన్ సంబంధాల కోసం ఉవ్విళ్లూరుతోంది.