Gujarat AAP leader arrested for raping: ఈ ఏడాది చివర్లో గుజరాత్ ఎన్నికలు జరగబోతున్నాయి. మరోసారి బీజేపీ గుజరాత్ లో గెలుపొందాలని భావిస్తోంది. 2024 ఎన్నికల ముందు సెమిఫైనల్స్ గా ఎన్నికలను భావిస్తోంది. ఇదిలా ఉంటే పంజాబ్ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న ఉత్సాహంతో గుజరాత్ లో కూడా పాగా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. ఇదిలా ఉంటే ఆప్ నేతలు మాత్రం పలు కేసుల్లో ఇరుక్కుంటుండం ఆ పార్టీకి మింగుడపడటం లేదు.
తాజాగా గుజరాత్ లో ఆప్ నేతను అరెస్ట్ చేశారు పోలీసులు. రాష్ట్రంలోని వెరావల్ కు చెందిన కీలక ఆప్ నేతపై ఓ మహిళ అత్యాచారం చేయడంతో గిర్ సోమనాథ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆప్ నాయకుడు భగు వాలాపై 23 ఏళ్ల యువతి శుక్రవారం క్రిమినల్ కేసు పెట్టింది. అతడు తనను అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
Read Also: Ankita Bhandari Case: అంకితా భండారీ హత్య.. పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు
పోలీసులు కథనం ప్రకారం.. ఆప్ లీడర్ భగు వాలా ఓ వీడియో మేకింగ్ ఏజెన్సీని నడుపుతున్నాడు. బాధితురాలికి సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని.. మోడల్ చేస్తానని బాధితురాలిని నమ్మించాడు. దీని కోసం ఫోటో షూట్ అవసరమని చెప్పాడు. కాగా.. ఫోటోషూట్ పై చర్చించేందుకు తన ఫ్లాట్ కు రావాల్సిందిగా భగు వాలా బాధితురాలిని కోరారు. అయితే అక్కడకు వెళ్లిన తరువాత భగు వాలా సదురు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడికి వైద్యపరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని.. కోర్టులో హాజరుపరుచనున్నట్లు పోలీసులు వెల్లడించారు.