Terrorists: డిజిటల్ యుగంలో ఐసిస్ కొత్త ప్లాన్.. IS ఎలా మనుగడ సాగిస్తుందో తెలుసా?
- డిజిటల్ ముసుగులో ఐసిస్ కార్యకలాపాలు..
- కొత్త యాప్‌లతో రాడికలైజేషన్ చేస్తున్న ఐఎస్..
- సోషల్ మీడియా నిషేధంతో ఎన్క్రిప్టెడ్ యాప్‌లను వినియోగిస్తున్న ఉగ్రవాదులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrorists: సిడ్నీలోని బోండి బీచ్‌లో జరిగిన ఉగ్రదాడి వెనుక ఇస్లామిక్ స్టేట్ (IS) ఉగ్రవాద సంస్థ ప్రభావం ఉన్నట్లు తాజా విచారణలో తేలింది. ఈ దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, దాడి చేసిన ఉగ్రవాదులు ఐఎస్‌కు విధేయులుగా ఉన్నట్లు ఆస్ట్రేలియా వార్త సంస్థలు నివేదించాయి. ఈ దాడిలో పాల్గొన్న వారిలో నవీద్ అనే అనుమానితుడు గతంలోనే ఐఎస్‌తో సంబంధాలున్నాయనే అనుమానంతో అధికారుల దృష్టికి వచ్చినట్లు సమాచారం. ఇక, ఉగ్రవాద నిరోధక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, ఐఎస్ఐఎస్ అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికీ తన ప్రభావాన్ని కొనసాగిస్తోందన్న ఆందోళనలు మరింత పెరిగాయి.
Read Also: Insurance Stars : శరీరంలో అత్యంత ఆకర్షణీయమైన భాగానికి బీమా
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
అయితే, ఇస్లామిక్ స్టేట్ శక్తి గణనీయంగా తగ్గిపోయినప్పటికీ, ప్రధానంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధాల కారణంగా వారి ఉనికి పరిమితమైనప్పటికీ, ఉగ్రవాద సంస్థ కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. తక్కువ నియంత్రణ ఉన్న డిజిటల్ వేదికలను వినియోగిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ అనుచరులను చేరుకోవడం, వారిని రాడికలైజ్ చేయడం కోసం వ్యూహాత్మకంగా మార్పులు చేసుకుంటోంది.
Read Also: PM Modi: ఇథియోపియాలో ‘వందేమాతరం’.. పిల్లాడిలా మారిపోయిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్
ఇక, ఐఎస్‌తో సంబంధం ఉన్న నెట్‌వర్క్‌లు ‘మ్యాట్రిక్స్ ఎకోసిస్టమ్’లోని వికేంద్రీకృత కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌లను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు గుర్తించారు. మ్యాట్రిక్స్ అనేది సురక్షితమైన, ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్‌తో కూడిన ఓపెన్ ప్రోటోకాల్. ఈ వ్యవస్థపై ఆధారపడిన ఎలిమెంట్, సిన్ని, టెక్‌హేవన్ లాంటి యాప్స్‌ను ఉగ్రవాదులు ప్రత్యామ్నాయ సమాచార మార్గాలుగా ఉపయోగిస్తున్నారు.
Read Also: Pakistan-BLA: పాకిస్తాన్ సైన్యంపై విరుచుకుపడ్డ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA).. 12 మంది సైనికులు మృతి..!
కాగా, ఈ యాప్స్ ప్రత్యేకత ఏమిటంటే, ఇవి వికేంద్రీకృత నెట్‌వర్క్‌లపై పని చేయడం వల్ల నిఘా సంస్థలు, దర్యాప్తు ఏజెన్సీలు ఈజీగా పర్యవేక్షించలేకపోతున్నాయి. ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ ద్వారా గోప్యంగా సమాచారాన్ని పంచుకుంటూ, తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు ఐఎస్ ఈ డిజిటల్ వేదికలను ఆశ్రయిస్తోంది. అయితే, బోండి బీచ్ ఉగ్ర దాడి నేపథ్యంలో, టెర్రరిస్టు సంస్థలు టెక్నాలజీని ఎలా దుర్వినియోగం చేస్తున్నాయన్న అంశంపై ప్రపంచవ్యాప్తంగా భద్రతా సంస్థలు మరింత అప్రమత్తం అయ్యాయి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..