IP68+IP69 రేటింగ్స్, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g Power (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!
- మోటరోలా moto g Power (2026) స్మార్ట్‌ఫోన్ అధికారికంగా లాంచ్
- IP68 + IP69 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ పాటు MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్
- 6.8 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 1000 నిట్స్ బ్రైట్‌నెస్
- డిస్‌ప్లేకు Corning Gorilla Glass 7i ప్రొటెక్షన్
- ఫోటోగ్రఫీ కోసం OISతో కూడిన 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా
- సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Moto g Power (2026): మోటరోలా (Motorola) G సిరీస్‌లో భాగంగా moto g Power (2026) స్మార్ట్‌ఫోన్‌ను అమెరికా మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. గత ఏడాది విడుదలైన moto g Powerకు ఇది నెక్స్ట్ వర్షన్. మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో బలమైన ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది కంపెనీ. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.8 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేను అందించింది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు గరిష్టంగా 1000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటం వల్ల బయట వెలుతురులోనూ క్లియర్‌గా కంటెంట్ చూడవచ్చు. డిస్‌ప్లేకు Corning Gorilla Glass 7i ప్రొటెక్షన్ కూడా ఉంది.
Smart Phone Price Hike: మొబైల్ ఫోన్లు కొనేవారికి బిగ్ షాక్..
Also Read
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
- Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా!
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
moto g Power ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. OISతో కూడిన 50MP ప్రధాన రియర్ కెమెరాను ఇచ్చారు. దీనికి తోడు 8MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీల కోసం ముందుభాగంలో 32MP ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 6300 (6nm) ప్రాసెసర్ ను కొనసాగించారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత My UXతో ఇది పనిచేస్తుంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ తో పాటు.. మైక్రోSD కార్డ్ ద్వారా 1TB వరకు మెమరీ విస్తరించుకునే అవకాశం ఉంది.
Moto g Power (2026)లో 5200mAh బ్యాటరీను అందించారు. ఇది 30W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. అయితే ఈసారి వైర్‌లెస్ ఛార్జింగ్‌ను తొలగించారు. ఆడియో పరంగా స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్ సపోర్ట్, అలాగే చాలామందికి ఉపయోగపడే 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది. ఈ ఫోన్ ప్రత్యేకత ఇది MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, అలాగే IP68 + IP69 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంది. అంటే నీటిలో మునిగినా, కఠినమైన వాతావరణ పరిస్థితుల్లోనూ ఫోన్ సేఫ్‌గా ఉంటుంది. వెనుక భాగంలో సాఫ్ట్ వెగన్ లెదర్ ఫినిష్ ఇచ్చారు. ఇది ప్రీమియం ఫీలింగ్ ఇస్తుంది.
IND vs SA 4th T20I: నేడే నాల్గవ టీ20.. టీమిండియా సిరీస్ గెలుస్తుందా..?
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5G SA/NSA, డ్యువల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.3, GPS, NFC, USB Type-C వంటి అన్ని ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. డ్యువల్ సిమ్ సపోర్ట్‌తో పాటు eSIM సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఈవెనింగ్ బ్లూ, ప్యూర్ కాష్మేరె రంగుల్లో లభిస్తుంది. ఇక ధర విషయానికి వస్తే.. 299.99 అమెరికా డాలర్స్ (భారతీయ కరెన్సీలో రూ.27,290) కు లభిస్తుంది. జనవరి 8 నుంచి బెస్ట్ బయ్, అమెజాన్, మోటోరోలా.కామ్ లో లభిస్తాయి.
Design meets durability with the NEW moto g power – 2026, featuring a sharp, durable 6.8'' 120Hz FHD+ display and up to 49 hours of battery life🔋🙌
Register now: https://t.co/McEC8wJVAv pic.twitter.com/ry93PXP8DP
— motorolaus (@MotorolaUS) December 16, 2025
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!