Attack on Hindu Temple in bangladesh: బంగ్లాదేశ్ లో మైనారిటీ హిందువులు, హిందూ ఆలయాలపై దాడులు ఆగడం లేదు. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ మతఛాందసవాదులు తరుచుగా హిందువులు, హిందూ ఆలయాలపై దాడులు చేస్తున్నారు. ప్రధాని షేక్ హసీనా మైనారిటీల రక్షణకు కట్టుబడి ఉంటామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం వేరేలా ఉంటున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ లో అత్యంత పురాతనమైన హిందూ ఆలయంపై దాడి చేశారు దుండగులు. దేవీ దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు.
Belarus President gifts Putin a tractor for 70th birthday: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం 70వ పుట్టినరోజు జరుపుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ నేపథ్యంలో రష్యాలో పుతిన్ బర్త్ డే వేడుకలను పెద్దగా జరుపుకోలేదు. అయితే తన బర్త్ డే సందర్భంగా ఒకరు మాత్రం వినూత్నంగా గిఫ్ట్ ఇచ్చారు. ఏకంగా ఓ ట్రాక్టర్ నే గిఫ్టుగా బహూకరించారు. ఆయన ఎవరో కాదు బెలారస్ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో. పుతిన్ కు అత్యంత సన్నిహితుడు.
Concept of 'Varna' and 'Jaati' should be completely discarded, says RSS chief Mohan Bhagwat: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వర్ణం, జాతి వంటి భావనలను పూర్తిగా విస్మరించాలని ఆయన శుక్రవారం అన్నారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కులవ్యవస్థకు ఇప్పడు గతించిన అధ్యాయం.. దీన్ని మరిచిపోవాలని ఆయన అన్నారు. ‘వజ్రసూచి టుంక్’ అనే పుస్తకావిష్కరణను ఆయన హాజరయ్యారు.
No one told India to not buy oil from Russia Says Hardeep Singh Puri: రష్యా నుంచి భారత్ పెట్రోలియం కొనడంపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి. భారత్ తమ పౌరులకు ఇంధనాన్ని అందించడం నైతిక బాధ్యత అని.. అది ఎక్కడ నుంచైనా కొనుగోలు చేస్తుందని ఆయన అన్నారు. ఏ దేశం కూడా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దని భారతదేశానికి ఏ దేశం కూడా చెప్పలేదని ఆయన అన్నారు.…
Nashik Fire Accident: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. నాసిక్ వద్ద ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి 9 మంది మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. బస్సులో ఉన్నట్టుండి అగ్ని ప్రమాదం జరగడంతో చాలా మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
₹ 1,200-Crore Afghan Heroin Caught: ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ మీదుగా ఇండియాకు తీసుకువస్తున్న హెరాయిన్ ను పట్టివేశారు అధికారులు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి 200 కిలోల హెరాయిన్ ను మొదటగా పాకిస్తాన్ తరలించి అక్కడ నుంచి ఇరాన్ పడవలో ఇండియా, శ్రీలంకకు తరలించేందుకు ప్రయత్నించారు. గురువారం ఇండియన్ నేవీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎస్ సి బి) కలిసి సముద్రంలో ఆపరేషన్ నిర్వహించి భారీ డ్రగ్స్ దందాను పట్టుకున్నారు. ఇరాన్ పడవలో ఏడు పొరల ప్రాకేజింగ్ తో హెరాయిన్ వాటర్ ఫ్రూఫ్ గా తయారు చేసి…
Vande Bharat Express accident.. FIR against buffalo owners: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు గురువారం ప్రమాదం జరిగింది. ముంబై-గాంధీనగర్ మధ్య ప్రయాణిస్తున్న సమయంలో గేదెల మందను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రైన్ ముందరి భాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో గేదెల మరణించాయి. సెమీ హై స్పీడ్ రైలును ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ఇది జరిగిన కొన్ని రోజులకే ట్రైన్ ప్రమాదానికి గురైంది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.
The Center asked UU Lalit to suggest the name of the next CJI: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ పదవీకాలం నవంబర్ 8తో ముగియనుంది. వచ్చే నెల ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ లోపే కొత్త సీజేఐ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియలు ప్రారంభం అయ్యాయి. సీజేఐగా ఉన్న యుయు లలిత్ తన తదుపరి ప్రధాన న్యాయమూర్తి పేరును సూచించాలని కేంద్ర ప్రభుత్వం కోరినట్లు సమాచారం. భారత 50వ ప్రధాన న్యాయమూర్తి పేరును…
Vande Bharat Express Train Repaired Within 24 Hours: దేశంలో కొత్తగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు గురువారం ప్రమాదానికి గురైంది. ముంబై-గాంధీ నగర్ మధ్య ప్రయాణిస్తున్న సమయంలో అహ్మదాబాద్ కు సమీపంలో ఉదయం 11.15 గంటలకు గేదెల మందను ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రైన్ ముందు భాగం దెబ్బతింది. డ్రైవర్ కోచ్ కు ముక్కు భాగంలో ఉండే మౌంటు బ్రాకెట్ ల కవర్ దెబ్బతింది. రైలుకు సంబంధించి ఇతర భాగాలేమి దెబ్బతినలేదు.
Heroic Cops Saved Two Youths In uttarakhand: ఓ పోలీస్ రియల్ హీరోగా మారారు. ప్రాణాలకు తెగించి ఇద్దరు యువకుల ప్రాణాలను కాపాడారు. ఉత్తరాఖండ్ పోలీస్ కు చెందిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఉత్తరాఖండ్ తనక్ పూర్ లోని శారదా ఘాట్ మధ్యలో చిక్కుకుపోయిన ఇద్దరు యువకులను ఉత్తరాఖండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన స్మిమ్మర్, మరో స్థానిక యువకుడు కలిసి రక్షించారు. ఈ ఘటన జరిగే సమయంలో నదీ ఒడ్డుపై ఉన్నవారు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ…