Concept of ‘Varna’ and ‘Jaati’ should be completely discarded, says RSS chief Mohan Bhagwat: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వర్ణం, జాతి వంటి భావనలను పూర్తిగా విస్మరించాలని ఆయన శుక్రవారం అన్నారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కులవ్యవస్థకు ఇప్పడు గతించిన అధ్యాయం.. దీన్ని మరిచిపోవాలని ఆయన అన్నారు. ‘వజ్రసూచి టుంక్’ అనే పుస్తకావిష్కరణను ఆయన హాజరయ్యారు.
సమాజ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఆలోచించే ప్రతీ ఒక్కరూ కూడా కుల వ్యవస్థ గతించిన విషయాన్ని చెప్పాలని అన్నారు. అంతకుముందు ఆర్ఎస్ఎస్ దసరా వార్షిక సమావేశంలో జనాభా నియంత్రణపై కీలక వ్యాఖ్యలు చేశారు. మత ఆధారిత జనాభాను విస్మరించకూడదని అన్నారు. మతం ఆధారిత జనాభా వల్ల భౌగోళిక సమస్యలు వస్తాయని.. కసావో, సూడాన్ వంటి దేశాలు మత ఆధారిత జనాభా వల్లే విడిపోయాయని గుర్తు చేశారు.
Read Also: Pulasa: దొరక్క దొరక్క దొరికిన పులస.. ఎన్ని వేలు పలికిందో తెలుసా..?
బలవంతంగా మత మార్పిడిలు, చొరబాట్ల ద్వారా జనాభాలో తేడాలు వస్తున్నాయని అన్నారు. కేంద్రం అన్నివర్గాలకు ఆమోదయోగ్యం అయిన పద్ధతిలో జనాభా నియంత్రణ చేయాలని సూచించారు. ఆర్ఎస్ఎస్ వల్ల మైనారిటీలకు ప్రమాదం ఉందని పలువురు అంటున్నారని.. అయితే మైనారిటీలకు హాని కలిగించడం సంఘ్, హిందువుల స్వభావం కాదని ఆయన అన్నారు.
మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలపై విమర్శలు కూడా వచ్చాయి. అసదుద్దీన్ ఓవైసీ, కేరళ సీఎం పినరయి విజయన్ వంటి వారు జనాభా నియంత్రణ అవసరం లేదని అన్నారు. భగవత్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆర్ఎస్ఎస్ సమాజాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.