Vivek Agnihotri's key comments on Sharad Pawar's comments: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ బాలీవుడ్ కు ముస్లిం సమాజం నుంచి అతిపెద్ద సహకారం లభించిందనే వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా శరద్ పవార్ ను విమర్శించారు. శరద్ పవార్ వ్యాఖ్యలతో తన సందేహాలు తీరాయని వ్యాఖ్యానించారు. తాను ముంబైకి వచ్చినప్పుడు శరద్ పవార్ రాజుగా ఉన్నారని.. తయన పార్టీ పన్నులు…
MK Stalin Elected As DMK Chief For 2nd Time: ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) పార్టీ అధ్యక్షుడిగా మరోసారి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎన్నికయ్యారు. ఇప్పటికే ఓసారి పార్టీ అధ్యక్ష పదవిని నిర్వహిాంచిన స్టాలిన్.. వరసగా రెండో సారి కూడా పార్టీ బాధ్యతలు చేపట్టారు. ఆదివారం చెన్నైలో జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన్న పార్టీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా దురైమురుగనన్, కోశాధికారిగా టీఆర్ బాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీకి సంబంధించిన కీలక పదవులను ముగ్గురు నేతలు…
Over 50 students mysteriously poisoned in Mexico school in mexico: మెక్సోకో దేశంలో 57 మంది చిన్నారులపై విషప్రయోగం జరిగింది. దక్షిణ మెక్సికన్ రాష్ట్రమైన చియాపాస్ లో గ్రామీణ మాధ్యమిక పాఠశాలలో 57 మంది విద్యార్థులు గుర్తుతెలియని పదార్థంతో విషప్రయోగం చేశారని స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత లేబొరేటరీ పరిశోధనల్లో విద్యార్థులు కొకైన్ పాజిటివ్ గా తేలినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కలుషితమైన ఆహారం, నీటి వల్లే విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతిందని.. విద్యార్థుల తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం…
Super continent on Earth in 200 million years: భూమిపై ప్రస్తుతం ఏడు ఖండాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరో కొత్త ఖండం ఏర్పాటయ్యే అవకాశం ఉందని చైనా పెకింగ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. రాబోయే 200-300 మిలియన్ సంవత్సరాల్లో ఆసియా, అమెరికా ఖండం కలిసిపోయి ఒక కొత్త సూపర్ కాంటినెంట్ ఏర్పడుతుందని పరిశోధనల్లో తేలింది. ఈ ఖండానికి ‘అమాసియా’ అనే పేరును పెట్టారు. ఆర్కిటిక్ మహాసముద్రం, కరేబియన్ సముద్రాలు కనుమరుగు అవుతాయని తెలిపారు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా లోని కార్టిన్…
Asaduddin Owaisi comments on Tippu Express name change: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి బీజేపీపై ఫైర్ అయ్యారు. ‘టిప్పు ఎక్స్ప్రెస్’ పేరును ‘వడయార్ ఎక్స్ప్రెస్’గా మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవాంర రైల్వే మంత్రిత్వ శాఖ బెంగళూర్ నుంచి మైసూర్ వెళ్లే ట్రైన్ టిప్పు ఎక్స్ప్రెస్ పేరును వడయార్ ఎక్స్ప్రెస్ గా మార్చింది. బీజేపీ యజమానులు అయిన బ్రిటీష్ వారికి ఎదురొడ్డి పోరాడినందుకు వారికి కోపం తెప్పించిందని అందుకు రైలు పేరు మార్చారని దుయ్యబట్టారు. బ్రిటీష్ పాలకులకు…
PM Modi To Declare Modhera As India's 1st Solar-Powered Village: దేశంలో గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించే విధంగా అడుగులు పడుతున్నాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు కాలుష్యాన్ని నివారించేందుకు సోలార్ ఎనర్జీ, విద్యుత్ వాహనాలను కేంద్రం ప్రోత్సహిస్తోంది. దీంతో పాటు ముడి చమురు దిగుమతిని తగ్గించుకుని, విదేశీమారక నిల్వలను పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉంటే దేశంలోనే తొలి సోలార్ గ్రామంగా గుజరాత్ రాష్ట్రంలో మోధేరా గ్రామం రికార్డులకెక్కనుంది. గుజరాత్ రాష్ట్రంలోని మోహసానా జిల్లాలో ఉంది మాధేరా.
Russia-Ukraine War: ఏడు నెలలు గుడుస్తున్నా.. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో ఏ మార్పు రావడం లేదు. ఇరు దేశాలు కూడా తమ ప్రయోజనాల కోసం పోరాడుతూనే ఉన్నాయి. రష్యా మిస్సైళ్లతో ఉక్రెయిన్ భూభాగాలపై విరుచుకుపడుతూనే ఉంది. దక్షిణ ఉక్రెయిన్ పారిశ్రామిక నగరం జపొరిజ్జియా ప్రాంతంపై రష్యా మరోసారి దాడి చేసింది. ఏడు మిస్సైళ్లను ప్రయోగించింది. ఈ ఘటనలో ఒక చిన్నారితో పాటు 17 మంది మరణించారని ఉక్రెయిన్ అధికారులు శనివారం తెలిపారు. గురువారం తెల్లవారుజామున ఈ మిస్సైల్స్ ఎటాక్ జరిగింది.
German intervention in the Kashmir issue is not necessary Says India: జమ్మూ కాశ్మీర్ అంశంపై జర్మనీ విదేశాంగ మంత్రి చేసి ప్రకటనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ జోక్యం అవసరం లేదని స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. కాశ్మీర్ పై జర్మనీ అనుసరిస్తున్న వైఖరిని తిరస్కరించింది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ, జర్మనీ విదేశాంగ శాఖ మంత్రి అన్నలెనా బేర్ బాక్ ఇద్దరు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కాశ్మీర్ పరిస్థితికి సంబంధించి జర్మనీ…
12-Year Old girl Gives Birth To Boy In UTTAR PRADESH: అభం శుభం తెలియన 12 ఏళ్ల బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. బాలికను బెదిరించి ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం సదరు బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ కు చెందిన 7వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలికపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకే అపార్ట్మెంట్ లో నివసిస్తున్న 19 ఏళ్ల వ్యక్తి బాలికపై…
Doctors forgot to remove forceps from Kerala woman's stomach: సిజేరియన్ ఆపరేషన్ సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ మహిళ కడుపులో కత్తెర మరిచారు. దీంతో గత ఐదేళ్లుగా కేరళకు చెందిన హర్షినా అనే మహిళ తీవ్ర నొప్పిని భరిస్తోంది. ఎన్నిసార్లు చికిత్స తీసుకున్నా కూడా ఈ నొప్పి తగ్గలేదు. గత ఆరు నెలలుగా నొప్పి తగ్గేందుకు హర్షినాకు డాక్టర్లు పవర్ ఫుల్ యాంటీబయాటిక్స్ తో చికిత్స చేశారు అయినా ప్రయోజనం లేకపోయింది. అయితే చెకప్ కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి…