At Least 31 Killed In Mass Shooting At Day-Care Centre In Thailand: థాయ్‌లాండ్‌లో ఘోరం జరిగింది. ఓ ఉన్మాది తుపాకీతో కాల్పులు జరిపాడు. డే కేర్ సెంటర్ పై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 31 మంది మరణించినట్లు థాయ్‌లాండ్ పోలీసులు వెల్లడించారు. బాధితుల్లో ఎక్కువగా పిల్లలే ఉన్నారు. పిల్లలు, పెద్దలతో కలిపి 31 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. Read Also: Free Ration: రేషన్‌కార్డుదారులకు శుభవార్త.. మరోసారి 10 కిలో ఉచిత బియ్యం […]
Uttarakhand Avalanche Incident: ఉత్తరాఖండ్ హిమపాతంలో గల్లంతైనవారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ (ఎన్ఐఎం) హిమాలయాల్లో ట్రెక్కింగ్ కు వెళ్లిన సమయంలో హిమపాతం సంభవించి వారంతా అక్కడే చిక్కుకుపోయారు. ఉత్తరకాశీ జిల్లాలోని ద్రౌపది కా దండ శిఖరం వద్ద వారంతా చిక్కుపోవడంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) సహయక, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది.
Tallest flag in india on the Attari border: దేశంలో అత్యంత ఎత్తైన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సిద్ధం అవుతోంది. ఇండియా-పాకిస్తాన్ బార్డర్ లోని అట్టారీ వద్ద 418 అడుగుల ఎత్తైన జాతీయ జెండాను త్వరలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇది రెండు దేశాల మధ్య జెండా యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తోంది. అట్టారీ-వాఘా బార్డర్ వద్ద పాకిస్తాన్ వైపు భారత్ కన్నా పెద్దదైన పాకిస్తాన్ జెండాను ఏర్పాటు చేశారు. దీనికి ప్రతిగా ఇండియా దాని కన్నా…
Gun firing in Mexico.. 18 people died including the mayor: లాటిన్ అమెరికా దేశం మెక్సికో మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఇటీవల కాలంలో ఆ దేశంలో కాల్పుల ఘటనలు తరుచుగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా దక్షిణ మెక్సికోలోని శాన్ మిగ్యుల్ టోటోలాపాస్ నగరంపై ముష్కరులు దాడి చేశారు. ఈ ఘటనలో మేయర్ తో సహా 18 మంది మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మెక్సికన్ మేయర్ కన్రాడో మెన్డోజా సిటీ హాల్ లో ఉన్న సమయంలో తుపాకులతో విరుచుకుపడ్డారు దుండగులు.…
Pratik Sinha, Mohammed Zubair in the race for the Nobel Peace Prize: ప్రపంచవ్యాప్తంగా పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి నోబెల్ బహుమతులు ప్రకటిస్తున్నారు. కాగా..నోబెల్ శాంతి బహుమతి అక్టోబర్ 7న ప్రకటించనున్నారు. నోబెల్ శాంతి బహుమతి కోసం శుక్రవారం విడుదల చేసిన అనధికార షార్ట్ లిస్ట్ ప్రకారం భారతదేశం నుంచి ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్ సైట్ వ్యవస్థాపకులు ప్రతీక్ సిన్హా, మహ్మద్ జుబైర్ లో పాటు భారతీయ రచయిత హర్ష్ మందర్ ఈ ఏడాది నోబెల్ శాంతి…
Kidnapped Indian-Origin Family Of 4 Found Dead In US: అమెరికాలో రెండు రోజుల క్రితం కిడ్నాప్ అయిన భారతసంతతి కుటుంబం దారుణంగా హత్యకు గురైంది. ఎనిమిది నెలల పాపతో పాటు మరో ముగ్గురు వ్యక్తుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటన స్థానిక భారత సంతతిలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎనిమిది నెలల అరోహి ధేరి, పాప తల్లిదండ్రులు 27 ఏళ్ల జస్లిన్ కౌర్, 36 ఏళ్ల జస్దీప్ సింగ్, 39 ఏళ్ల మేనమామ అమన్ దీప్ సింగులు ఇటీవల కిడ్నాపుకు గురయ్యారు.…
Sonia Gandhi Joins Bharat jodo Yatra: కాంగ్రెస్ గత వైభవం కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ‘ భారత్ జోడో యాత్ర’ చేపట్టింది. వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. ఈ యాత్రకు ప్రజల నుంచి స్పందగ బాగానే వస్తోంది. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారిలో ప్రారంభం అయిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతోంది. గురువారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి నిడిచారు.
North Korea Fires 2 Ballistic Missiles: అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు వ్యతిరేకంగా ఉత్తర కొరియా వరసగా క్షిపణి ప్రయోగాలు చేపడుతోంది. గురువారం మరో రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది నార్త్ కొరియా. మంగళవారం కూడా ఇలాగే ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ ను జపాన్ మీదుగా ప్రయోగించింది. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తలు పెంచేందుకు నార్త్ కొరియా క్షిపణి ప్రయోగాలు చేపడుతోందని యూఎస్ఏ ఆరోపించింది.
Deadly road accident in Kerala - 9 people killed: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పాలక్కాడ్ జిల్లా ఇక్కడి వడక్కెంచేరిలో పర్యాటకుల బస్సు, కేరళ ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. ఎర్నాకులంలోని ముళంతురుతిలోని బేసిలియస్ స్కూల్ నుంచి విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సు, కేరళ ఆర్టీసి బస్సును ఢీకొట్టింది. ఓ కారును ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. టూరిస్టు బస్సు ప్రమాదానికి గురై వాగులో బోల్తా పడింది. వలయార్ వడక్కంచేరి…
Anti Hijab Protest In Iran: ఇరాన్ దేశంలో హిజాబ్ వ్యతిరేక నిరసనలు రోజురోజుకు తీవ్రం అవుతున్నాయి. నాలుగు వారాలుగా అక్కడి యువత, మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 22 ఏళ్ల మహ్సా అమిని అనే యువతిని హిజాబ్ ధరించలేదని అక్కడి మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేసిన కొద్ది రోజులకే ఆమె మరణించింది. దీంతో అప్పటి నుంచి అక్కడి మహిళలు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. మహిళలు హిజాబ్ తీసేసి, జట్టు కత్తిరించుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ గళాన్ని విప్పుతున్నారు.