Belarus President gifts Putin a tractor for 70th birthday: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం 70వ పుట్టినరోజు జరుపుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ నేపథ్యంలో రష్యాలో పుతిన్ బర్త్ డే వేడుకలను పెద్దగా జరగలేదు. అయితే తన బర్త్ డే సందర్భంగా ఒకరు మాత్రం వినూత్నంగా గిఫ్ట్ ఇచ్చారు. ఏకంగా ఓ ట్రాక్టర్ నే గిఫ్టుగా బహూకరించారు. ఆయన ఎవరో కాదు బెలారస్ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో. పుతిన్ కు అత్యంత సన్నిహితుడు.
తాను పుతిన్ కు ట్రాక్టర్ ను గిఫ్టుగా ఇచ్చినట్లు వెల్లడించారు అలెగ్జాండర్ లుకాషెంకో. సోవియట్ యూనియన్ కాలం నుంచి ట్రాక్టర్లు బెలారస్ పరిశ్రమకు గర్వకారణం అని ఆయన అన్నారు. అయితే లుకాషెంకో ఇచ్చిన గిఫ్టుపై రష్యా ఇంకా స్పందించలేదు.యూరోపియన్లు ఆకలితో ఉండకుండా.. ఉక్రెయిన్ నుంచి రొట్టెలు దొంగలించకుండా ఉండటానికి ట్రాక్టర్ ను గోధుమ విత్తనాలు విత్తడానికి ఉపయోగించవచ్చని అన్నారు. పుతిన్ ఉంటేనే రష్యా ఉంటుందని రష్యన్ పార్లమెంట్ స్పీకర్ వ్యాచెస్లావ్ వోలోడిన్ అన్నారు.
Read Also: Mrunal Thakur: వయస్సు చెబితే.. పెళ్లి ఎప్పుడు అంటున్నారు?
రష్యాకు బెలారస్ మిత్రదేశం. యూరప్ దేశాల్లో రష్యాకు గట్టి మద్దతుదారుగా బెలారస్ ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో కూడా బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో రష్యాకు మద్దతు తెలిపారు. బెలారస్ వేదికగా యుద్దం తొలినాళ్లలో రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలు జరిగాయి. పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ ఉత్తర ప్రాంతపై బెలారస్ నుంచి రష్యన్ బలగాలు దాడులు చేశాయి. ఉక్రెయిన్ యుద్ధంలో బెలారస్ భూభాగాన్ని రష్యా వాడుకుంది. ఈ యుద్ధం కారణంగా అమెరికాతో పాటు వెస్ట్రన్ దేశాలు రష్యాతో పాటు బెలారస్ పై కూడా ఆంక్షలు విధించాయి. అయినా ఆంక్షలకు భయపడకుండా రష్యాకు బెలారస్ మద్దతు ఇస్తూనే ఉంది.