పెద్దరాయుడు సినిమాలో ‘నేను చూసాను తాతయ్య’ అని ఒకే ఒక డైలాగ్ తో సినిమానే మలుపు తిప్పిన పిల్లాడు మాస్టర్ మహేంద్రన్ అందరికి గుర్తుండే ఉంటాడు. ఆ మధ్య విజయ్ హీరోగా తెరకెక్కిన మాస్టర్ చిత్రంలో అద్భుతమైన నటనతో యంగ్ విజయ్ సేతుపతిగా మెప్పించాడు మహేంద్రన్. ఇక ఇప్పుడు మహేంద్రన్ హీరోగా ‘నీలకంఠ’ అనే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులని పలకరించేదుకు రెడీ అయ్యాడు.
రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్నా చౌదరి, నేహా పఠాన్ కథానాయికలుగా నటించగా.. స్నేహ ఉల్లాల్ ప్రత్యేక పాత్ర పోషించింది. ఎల్ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీనివాసులు, వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమా న్యూ ఇయర్ కానుకగా జనవరి 2 గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అయింది. ఈ నేపథ్యంలో నీలకంఠ ప్రమోషన్స్ ని మెుదలు పెట్టారు మేకర్స్. అందులో భాగంగానే చిత్ర టీజర్ ను రిలీజ్ చేసారు. టీజర్ ని గమనిస్తే శ్రవణ్ అందించిన డీవోపీ బాగుంది. ప్రశాంత్ బిజె మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. ప్రోడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. నైజాంలో ఈ సినిమా గ్లోబల్ సినిమాల్ ద్వారా రిలీజ్ కాబోతుంది. నీలకంఠ సినిమాతో టాలీవుడ్‌లో మహేంద్రన్ హిట్ అందుకునేలా కనిపిస్తోన్న ఈ టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.