Venu Goapl Reddy
Author- NTV Telugu-
Gurpatwant Singh Pannun: ఖలిస్తానీ వేర్పాటువాదిపై భారత్ అభ్యర్థనను తిప్పిపంపిన ఇంటర్‌పోల్
Interpol Sent Back India's Request For Notice Against Khalistan Separatist: ఖలిస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూపై భారత్ చేసిన అభ్యర్థనను ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్(ఇంటర్‌పోల్) తిప్పిపంపింది. పన్నూపై ఉగ్రవాద ఆరోపణల నేపథ్యంలో రెడ్ కార్నర్ నోటీస్ కోసం భారతదేశం అభ్యర్థించింది. అయితే ఈ అభ్యర్థనను ఇంటర్‌పోల్ తిప్పిపంపినట్లు తెలుస్తోంది. సీబీఐ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు అన్ని ఇన్పుట్లను సమర్పించింది. అయితే ఇంటర్‌పోల్ ప్రశ్నలను లేవనెత్తింది. -
Muzaffarnagar Riots Case: ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు జైలు శిక్ష
BJP MLA Gets 2 Years In Jail In Muzaffarnagar Riots Case: ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మంగళవారం ఈ కేసును విచారించిన కోర్టు బీజేపీ ఎమ్మెల్యేకు విక్రమ్ సైనీతో పాటు 11 మందికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రత్యేక న్యాయమూర్తి గోపాల్ ఉపాధ్యాయ అల్లర్లకు పాల్పడినందుకు ఇతర నేరాలకు కలిపి మొత్తం 11 మందిని దోషులుగా నిర్థారించారు. జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. 10,000 జరిమానా విధించారు. -
Allahabad High Court: మొదటి భార్యను చూసుకోలేని ముస్లిం వ్యక్తికి రెండో పెళ్లి చేసుకునే హక్కు లేదు.
Allahabad High Court verdict on second marriage of Muslim man: ముస్లిం వ్యక్తి రెండో వివాహంపై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మొదటి భార్య, ఆమె సంతానాన్ని చూసుకోలేని ముస్లిం వ్యక్తికి రెండో పెళ్లి చేసుకునే హక్కు లేదని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఒక ముస్లిం వ్యక్తి తన భార్య, పిల్లలను చూసుకోకపోతే, ఖురాన్ అతన్ని రెండవ వివాహం చేసుకోవడానికి అనుమతించదని తీర్పు వెల్లడించింది. మొదటి భార్య అనుమతి లేకుండా రెండో వివాహాం చేసుకున్న వ్యక్తి మొదటి భార్యను శిక్షించడమే… -
Supreme Court: “తలాక్-ఎ-హసన్”పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
Supreme Acceptance of Trial on Talaq-e-Hasan Divorce: ఏకపక్ష చట్టవిరుద్ధమైన విడాకులు, తలాక్-ఎ-హసన్ వంటి విడాకులు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ.. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింది. తలాక్-ఎ-హసన్ అనేది ఇస్లాంలో విడాకులకు ఓ రూపం. దీని ద్వారా పెళ్లయిన పురుషుడు తన భార్యకు ప్రతీ నెల ‘తలాక్’ పదాన్ని చెప్పడం ద్వారా వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు. -
PM Narendra Modi:ఉజ్జయిని “మహాకాల్ లోక్ కారిడార్”ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
PM Narendra modi dedicates Shri Mahakal Lok to the nation: మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాల్ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాకాల్ లోక్ కారిడార్ మొదటి దశలను ప్రారంభించే ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సాంప్రదాయ వస్త్రధారణలో 12 జ్యోతిర్లాంగాల్లో ఒకటైన మహాకాలేశ్వర్ ఆలయ గర్భగుడిలో పూజలు చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియాలు ప్రధాని మోదీ వెంట ఉన్నారు. -
India Economic Growth: భారత వృద్ధిరేటును తగ్గించిన ఐఎంఎఫ్.. ప్రపంచ మాంద్యం తప్పదా..?
IMF reduced India's economic growth: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) భారత వృద్ధిరేటును తగ్గించింది. 2022లో భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు అంచనాను మంగళవారం 7.4 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గించింది. ఏప్రిల్ 2022 ఆర్థిక సంవత్సర ప్రారంభంలో ఐఎంఎఫ్ భారతదేశ ఎకనామిక్ గ్రోత్ రేట్ ను 7.4గా ఉండవచ్చని అంచనా వేసింది. ఈ ఏడాది జనవరిలో 2022 వృద్ధిరేటు 8.2 శాతంగా ఉంటుందని అంచానా వేసింది. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా భారత వృద్ధిరేటును క్రమంగా తగ్గిస్తూ వస్తోంది ఐఎంఎఫ్. -
Pakistan: భారత్‌తో సంబంధాలు లేవంటూనే.. దిక్కులేక వాటిని కొనుగోలు చేస్తున్న పాకిస్తాన్
Pakistan is buying 60 lakh mosquito nets from India: పీకల్లోతు అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, తినడానికి తిండి లేని పరిస్థితుల్లో కూడా భారత వ్యతిరేకతను వీడటం లేదు పాకిస్తాన్. భారతదేశంలో ఎలాంటి వాణిజ్య సంబంధాలు పెట్టుకోమని చెబుతోంది. కాశ్మీర సమస్యకు పరిష్కారం లభించేంత వరకు, ఆర్టికల్ 370 పునుద్ధరించే వరకు తాము భారత్ తో సంబంధాలు పెట్టుకోమని అంటోంది. దీంతో అక్కడ టొమోటో, ఆలు వంటి నిత్యావసర ధరలు కొండేక్కాయి. కిలోకి రూ. 100కు పైగా ధరలు చేరాయి. భారత్ నుంచి… -
Eknath Shinde: ఏక్నాథ్ షిండే వర్గానికి గుర్తు కేటాయించిన ఈసీ.. గుర్తు ఏంటంటే..?
EC allots the 'Two Swords And Shield symbol' to Eknath Shinde Shiv Sena: శివసేన పార్టీ రెండు వర్గాలుగా చీలిన సంగతి తెలిసిందే. మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏక్ నాథ్ షిండే వర్గంతోనే ఉన్నారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే మాత్రం అసలైన శివసేన తమదే అంటోంది. ఈ వ్యవహారంపై ఇటీవల సుప్రీంకోర్టు, ఈ వ్యవహారంపై అంతిమ నిర్ణయం కేంద్ర ఎన్నికల సంఘానిదే అని చెప్పింది. నవంబర్ నెలలో అంధేరీ ఈస్ట్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రాబోతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో… -
India Assistance To Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌కు భారత్ సాయం.. వైద్యసాయం అందచేత
India Assistance To Afghanistan: యుద్దంతో అతలాకుతలం అయిన ఆఫ్ఘనిస్తాన్ దేశానికి భారత్ మానవతా సహాయాన్ని అందిస్తోంది. ఇప్పటికే ఆఫ్ఘన్ ప్రజల కోసం గోధుమలను, వైద్య సామాగ్రిని పంపింది. ఇదిలా ఉంటే మరోసారి వైద్య సహాయాన్ని అందిస్తోంది భారత్. భారత్ గత కొన్ని నెలల్లో 13 బ్యాచుల్లో 45 టన్నుల వైద్య సహాయాన్ని అందించింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల కోసం భారత్ సహాయాన్ని కొనాసాగిస్తుందని వెల్లడించింది. పీడీయాట్రిక్ స్టెతస్కోప్, బీపీ మిషన్లు, -
Pakistan: మరో హిందూ బాలిక కిడ్నాప్.. 15 రోజుల్లో నాలుగో ఘటన
Hindu girl abducted in Pakistan's Sindh, fourth incident in 15 days: పాకిస్తాన్ దేశంలో హిందూ బాలికలు, యువతుల కిడ్నాపులు, పెళ్లిళ్లు చేసుకుని బలవంతపు మతమార్పులు ఆగడం లేదు. తాజాగా మరో హిందూ బాలిక కిడ్నాపుకు గురైంది. గత 15 రోజుల్లో ఇది నాలుగో ఘటన. పాకిస్తాన్ జనాభాలో 3.5 శాతం మాత్రమే ఉన్న హిందువులు, సిక్కులు, క్రైస్తవులు ఉన్నారు. వీరంతా బలవంతపు మతమార్పిడులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల బలవంతపు మతమార్పుడులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన బిల్లును పాకిస్తాన్న పార్లమెంటరీ ప్యానెల్ తిరస్కరించింది. అంటే…
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!