1.62 Crore Tourists Visited Jammu And Kashmir, Highest Since Independence: జమ్మా కాశ్మీర్ లో మార్పు మొదలైంది. గతంలో ఉగ్రవాదం, నిత్యం కాల్పుల చప్పుళ్లు, పేలుళ్లతో హింసాత్మక సంఘటనలకు కేంద్రంగా ఉండే కాశ్మీర్ లో పరిస్థితులు నెమ్మనెమ్మదిగా కుదుటపడుతున్నాయి. ఆర్టికల్ 370, 35ఏ రద్దు తర్వాత కాశ్మీర్ లో పరిస్థితుల్లో మార్పులు తీసుకువస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీంతో పాటు కేంద్రబలగాలు, ఆర్మీ ఎప్పటికప్పుడు ఉగ్రవాద కార్యకలాపాలకు చెక్ పెడుతోంది. ఉగ్రవాదాన్ని ఏరిపారేస్తోంది. దాయాది దేశం పాకిస్తాన్ నుంచి చొరబాట్లను అడ్డుకుంటోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇన్స్టాగ్రామ్లో లైక్లు మరియు వ్యాఖ్యలపై జరిగిన వాదన బుధవారం ఢిల్లీలో జంట హత్యకు దారితీసింది. సోషల్ మీడియాలో మహిళలో వివాదం కారణంగా ఢిల్లీలోని భల్స్వా డెయిరీలో ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచి హత్య చేశారని పోలీసులు వెల్లడించారు. ఇదే ప్రాంతంలోని ముకుంద్ పూర్ పార్ట్ 2లో తనను కలవాలని ఇద్దరు యువకులను మహిళ కోరింది. అయితే వారు అక్కడికి చేరుకోగానే దాడి జరిగిందని పోలీసులు తెలిపారు.
union minister Ajay mishra on RAF: ప్రపంచంలోని ఏ దేశానికి కూడా మన దేశం నుంచి ముప్పు లేదని.. ఇప్పడు ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోందని అన్నారు కేంద్రమంత్రి అజయ్ మిశ్రా. ఆర్ఏఎప్ 30వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో కొనసాగుతున్న అభివృద్ధిపై అందరి దృష్టి ఉందని ఆయన అన్నారు.
Delhi Liquor Policy Case-ED raids: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం దేశవ్యాప్తంగా పలు ప్రదేశాల్లో దాడులు నిర్వహిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా ఈ లిక్కర్ స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, పంజాబ్ లోని 35 ప్రదేశాల్లో దాడులు నిర్వహిస్తోంది ఈడీ. ఈ రాష్ట్రాల్లో మద్యం కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు, సప్లై చైన్ నెట్వర్క్ కు సంబంధించి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది.
Priyanka Chopra On Anti-Hijab Protests In Iran: ఇరాన్ దేశవ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక పోరాటం జరుగుతోంది. అక్కడి యువత, మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. 22 ఏళ్ల మహ్సా అమినే అమ్మాయి సెప్టెంబర్ 13న టెహ్రన్ మెట్రోస్టేషన్ వద్ద హిజాబ్ సరిగ్గా ధరించలేదని చెబుతూ.. మోరాలిటీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. పోలీసులు టార్చర్ వల్ల మహ్సా అమిని మరణించింది. దీంతో ఇరాన్ లో ఒక్కసారిగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.
Australian Scientists Seek To Grow Plants On Moon By 2025: చంద్రులు భూమికి ఉన్న సహజ ఉపగ్రహం. భూమిపై జీవజాలానికి ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తోంది. అందుకే మనం ఉంటున్న భూమిని తల్లిగా.. చంద్రున్ని చందమామగా పిలుస్తుంటాం. భూమి కక్ష్యకు, భూమి స్థిరత్వానికి చంద్రుడు సహకరిస్తుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే భూమిని ఓ టెలివిజన్ అనుకుంటే.. చంద్రుడు ఓ స్టెబిలైజర్ లాంటి వాడు. ఇంతలా భూమికి సహకరిస్తుంటాడు. ఒక వేళ చంద్రుడే లేకపోతే.. మనం ఇప్పుడు నివసిస్తున్న భూమి అనేక ఒడిదొడుకులకు…
Crucial Court Order Today On Carbon Dating Of 'Shivling' In Gyanvapi Case: ఈ ఏడాదిలో ప్రారంభం అయిన జ్ఞానవాపి మసీదు కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ముందుగా వారణాసి సివిల్ కోర్టు మసీదులో వీడియో సర్వేకు అనుమతి ఇవ్వడంతో అక్కడి వాజూఖానాలో శివలింగం వంటి ఆకారం బయటపడింది. ఒక్కసారిగా ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరో వైపు అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం.. ఆ తరువాత ఈ కేసును వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ…
Bus falls into river in Nepal: నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటీవల కాలంలో వరసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గురువారం నేపాల్ లోని బారా జిల్లాలోని బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 16 మంది చనిపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. నేపాల్ లోని మాధేష్ ప్రావిన్సులో ఈ ఘటన జరిగింది. మరో 35 మంది గాయపడ్డారు. వీరిలో కూడా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
India abstain on vote against China at UNHRC: ఐక్యరాజ్యసమితిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎప్పుడూ ఉప్పూనిప్పుగా ఉండే భారత్-చైనాలు ఓ విషయంలో మాత్రం సహకరించుకున్నాయి. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్సులో మానవహక్కుల పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి హక్కుల మండలిలో 51వ రెగ్యులర్ సెషన్ లో చైనాకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మాణంపై భారత్ ఓటింగ్ కు గైర్హాజరు అయింది.
Mob enters mosque grounds to perform puja on Dussehra: కర్ణాటకలో మరో వివాదం రాజుకుంది. దసరా సందర్భంగా ఓ వర్గం ప్రజలు మసీదులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దసరా సందర్భంగా అక్కడ పూజ చేసేందుకు యత్నించారు. ఈ ఘటనపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. 9 మంది కేసు నమోదు చేశారు. కర్ణాటకలోని బీదర్ మహమూద్ గేవాన్ మదర్సా, మసీదు మైదానాల్లోకి ప్రవేశించి నినాదాలు చేశారు.