Vande Bharat Express accident.. FIR against buffalo owners: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు గురువారం ప్రమాదం జరిగింది. ముంబై-గాంధీనగర్ మధ్య ప్రయాణిస్తున్న సమయంలో గేదెల మందను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రైన్ ముందరి భాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో గేదెల మరణించాయి. సెమీ హై స్పీడ్ రైలును ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ఇది జరిగిన కొన్ని రోజులకే ట్రైన్ ప్రమాదానికి గురైంది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.
ఈ ప్రమాదానికి కారణం అయిన గేదెల యజమానులను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. వీరిపై గుజరాత్ పోలీసులు కేసులు నమోదు చేశారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) పశువుల యజమానులపై కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు గేదెల యజమానులను పోలీసులు గుర్తించలేదు. వీరికోసం గాలిస్తున్నారు. రైల్వే చట్టం – 1989లోని సెక్షన్ 147 ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఆర్‌పిఎఫ్ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ శర్మ తెలిపారు. నాలుగు గేదెలు మృతి చెందిన ఘటనపై గురువారం సాయంత్రం ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
Read Also: BJP Vishnuvardhan Reddy : దేశంలో కేఏ పాల్ పార్టీకి కేసీఆర్ పార్టీకి తేడా లేదు
గురువారం అహ్మదాబాద్ సమీపంలోని వత్వా, మణినగర్ రైల్వే స్టేషన్ మధ్యలో వందే భారత్ ట్రైన్ గేదెల మందను ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రైన్ ముందరి భాగం దెబ్బతింది. నిన్న జరిగిన ప్రమాదంలో కేవలం లోకో పైలెట్ కోచ్ ముక్కు భాగం స్వల్పంగా దెబ్బతింది. రైలులోని ప్రధాన వ్యవస్థలకు ఎలాంటి నష్టం జరగలేదు. అయితే దెబ్బతిన్న భాగాన్ని రైల్వే అధికారులు కేవలం 24 గంటల్లోపు సరిచేశారు.
సెప్టెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోదీ గాంధీ నగర్లో ఈ సెమీ హై స్పీడ్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించారు. ఈ తరువాతి రోజు నుంచే ఇది గాంధీ నగర్- ముంబైల మధ్య పరుగులు తీస్తోంది. భారత ప్రభుత్వ రైల్వేల ఆధునీకీకరణలో భాగంగా సెమీ హై స్పీడ్ వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.