Supreme Court Order Likely Tomorrow on Karnataka Hijab Ban:కర్ణాటకలో ప్రభుత్వ హిజాబ్ ధరించి విద్యాలయాలకు రావడాన్ని నిషేధించింది. ప్రభుత్వ ఉత్తర్వులపై కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిగా.. హిజాబ్ అనేది ఇస్లాంలో తప్పనిసరి ఆచారం కాదని, హిజాబ్ ధరించి విద్యాలయాలకు రావడాన్ని నిషేధించింది. అయితే ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది. ఇదిలా ఉంటే హిజాబ్ బ్యాన్ పై సుప్రీంకోర్టు రేపు తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.
BYD Atto 3 EV car will enter the Indian market: చైనా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ బీవైడీ ( బిల్డ్ యువర్ డ్రీమ్) భారత మార్కెట్ లోకి కొత్తగా ఎలక్ట్రిక్ కారును తీసుకురాబోతోంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న టాటా నెక్సాన్ ఈవీ, ఎంజీ జెడ్ ఎస్ ఈవీ, హ్యుందాయ్ కోనా ఈవీలకు పోటీ ఇచ్చేందుకు సిద్ధం అయింది. బీవైడీ ఆట్టో 3 పేరుతో ఈవీ కారును లాంచ్ చేయబోతోంది. రూ. 50,000లతో ఈ ఎలక్ట్రిక్ ఎస్ యూ వీని బుక్…
Break for Bharat Jodo Yatra on October 17: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారు. ప్రస్తుతం కర్ణాటకలో పాదయాత్ర కొనసాగుతోంది. తరువాత ఏపీ, తెలంగాణ రాష్ట్రంలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది. ఇదిలా ఉంటే అక్టోబర్ 17న రాహుల్ పాదయాత్రకు బ్రేక్ పడనుంది. 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారత్ జోడో యాత్ర ఒక రోజు పాటు…
Olympian Sushil Kumar To Face Murder Trial For Junior Wrestler's Death: మే 2021లో మాజీ రెజ్లింగ్ ఛాంపియన్ సాగర్ ధంకర్ మరణించిన కేసులో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, రెజ్లర్ సుశీల్ కుమార్ హత్యానేర విచారణను ఎదుర్కొనున్నారు. బుధవారం సుశీల్ కుమార్ పై ఢిల్లీ కోర్టు హత్యా నేరాన్ని మోపింది. దీంతో పాటు 17 మందిపై హత్య, హత్యాయత్నం కేసులు నమోదు అయ్యాయి. అల్లర్లు, చట్టవిరుద్ధమైన సమావేశాలు, నేరపూరిత కుట్ర వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. పరారీలో…
PM Narendra Modi might inaugurate fourth Vande Bharat train: గురువారం రోజున హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నాలుగో వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లోని ఉనా జిల్లాలోన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ నుంచి ఉనాలోని అంబ్ అందౌరా రైల్వే స్టేషన్ల మద్య ఈ రైలు నడవనుంది. బుధవారం మినహా అన్ని రోజులు ఈ రైలు నడుస్తుంది. అంబాలా, చండీగఢ్, ఆనంద్ పూర్…
Pak's Sindh govt orders high-level probe as abducted Hindu girl: పాకిస్తాన్ లో ఇటీవల కిడ్నాపుకు గురైన 14 ఏళ్ల హిందూ బాలిక ఆచూకీ ఇంకా తెలియలేదు. దీంతో పాకిస్తాన్ సింధు ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. సింధు ప్రావిన్సులోని హైదరాబాద్ నగరంలోని ఫతే చౌక్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో బాలికను కిడ్నాప్ చేశారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో సింధ్ ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.
Cabinet Announces Bonus For Railway Employees: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రైల్వే ఉద్యోగులకు 78 రోజులకు సమానమైన ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (పీఎల్బీ) చెల్లింపునకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 11.27 లక్షల మంది నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు పీఎల్బీ మొత్తాన్ని చెల్లించినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం తెలిపారు. ఆర్పిఎఫ్/ఆర్పిఎస్ఎఫ్ సిబ్బందిని మినహాయించి నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు బోనస్ చెల్లించబడతాయి.
Next 48 Hours Critical For Army Dog: అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో గాయపడిన ఆర్మీ డాగ్ ‘జూమ్’ పరిస్థితి విషమంగానే ఉందని.. మరో 24-48 గంటలు గడిస్తే కానీ పరిస్థితిని చెప్పలేమని.. వైద్య బృందం చికిత్స అందిస్తోందని భారత ఆర్మీ అధికారులు బుధవారం వెల్లడించారు. ఆర్మీ డాగ్ జూమ్ కు శస్త్రచికిత్స చేశారు వైద్యులు. ప్రస్తుతం ఆర్మీ డాగ్ పరిస్థితి నిలకడగా ఉంది. వెనకాలు విరగడంతో పాటు ముఖంపై గాయాలకు చికిత్స చేశారు డాక్టర్లు. తదుపరి 24-48 గంటలు క్లిష్టమైనవని.. భారత…
SC grants Centre two more weeks to file response on pleas challenging Places of Worship Act 1991: ప్రార్థనా స్థలాల చట్టం-1991లోని నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై స్పందించేందుకు కేంద్రానికి మరో రెండు వారాలు గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. అక్టోబర్ 31 లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. నవంబర్ 14న విచారణను వాయిదా వేసింది. 1991 ప్రార్థన స్థలాల చట్టంలోని కొన్ని నిబంధనలను సవాల్ చేస్తూ దేశవ్యాప్తంగా పలువురు వ్యక్తులు పిటిషన్లు దాఖలు చేశారు.
Interpol Sent Back India's Request For Notice Against Khalistan Separatist: ఖలిస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూపై భారత్ చేసిన అభ్యర్థనను ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్(ఇంటర్‌పోల్) తిప్పిపంపింది. పన్నూపై ఉగ్రవాద ఆరోపణల నేపథ్యంలో రెడ్ కార్నర్ నోటీస్ కోసం భారతదేశం అభ్యర్థించింది. అయితే ఈ అభ్యర్థనను ఇంటర్‌పోల్ తిప్పిపంపినట్లు తెలుస్తోంది. సీబీఐ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు అన్ని ఇన్పుట్లను సమర్పించింది. అయితే ఇంటర్‌పోల్ ప్రశ్నలను లేవనెత్తింది.