Russia-Ukraine War: రష్యాలో ఉగ్రవాద దాడి జరిగింది. సైనిక శిక్షణా మైదానంలో ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం 11 మంది మరణించగా.. 15 మంది గాయపడ్డారని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఘటన శనివారం రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న బెల్గోరోడ్ ప్రాంతంలో జరిగింది.
Hindu groups Wrote open letter to Liz Truss after Leicester violence:ఇటీవల యూకే వ్యాప్తంగా జరగుతున్న పరిణామాలు హిందువులను, భారతీయులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆసియా కప్ లో భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగిన తర్వాత బ్రిటన్ లోని పలు నగరాల్లో హిందూ-ముస్లింల మధ్య ఘర్షణ చెలరేగింది. హిందువుల ఇళ్లు, కార్లు టార్గెట్ గా రాడికల్ ముస్లింగ్రూపులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. ముఖ్యంగా లిచెస్టర్ సిటీతో పాటు బర్మింగ్ హామ్ వంటి నగరాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగాయి.
Aadhaar For Newborns Along With Birth Certificates In All States: నవజాత శిశువులకు బర్త్ సర్టిఫికేట్ తో పాటు ఆధార్ ఇచ్చే విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో తీసుకురానుంది. ఈ మేరకు పుట్టిన వెంటనే నవజాత శిశువులకు ఇక మీదట బర్త్ సర్టిఫికేట్ తో పాటు ఆధార్ ఇచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి ఈ సదుపాయం దేశంలో 16 రాష్ట్రాల్లో ఉంది. అయితే ఇకపై అన్ని రాష్ట్రాల్లో కూడా విస్తరించేందుకు కేంద్ర సిద్ధం అయింది. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు ఇప్పటికే…
Indian Army sings MoU with 11 banks for Agniveer salary package: భారత సైన్యం కొత్తగా తీసుకువచ్చిన ఆర్మీ రిక్రూట్మెంట్ స్కీమ్ ‘ అగ్నివీర్’. ఈ పథకం కోసం ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే వీరికి సంబంధించిన సాలరీ ప్యాకేజీ కోసం 11 బ్యాంకులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఇండియన్ ఆర్మీ. అగ్నివీరులకు బ్యాంకింగ్ సౌకర్యాన్ని కల్పించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్,
Pakistan summons US envoy over Joe Biden's comments: పాకిస్తాన్ దేశంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలపై సమన్వయం లేని కారణంగా పాకిస్తాన్ ప్రపంచంలోనే ప్రమాదకర దేశాల్లో ఒకటి అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ దేశాన్ని షాక్ కు గురిచేశాయి. అమెరికాతో ఇప్పుడిప్పుడే సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నామని అనుకుంటున్న పాకిస్తాన్ కు ఇది మింగుడు పడటం లేదు. ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ తమ నిరసన తెలుపుతోంది.
Goa hikes excise duty on Beer: ఇండియాలో మంచి టూరిస్ట్ స్పాట్ ఏంటంటే వెంటనే గుర్తుకు వచ్చే ప్లేస్ గోవా. మద్యంతో పాటు అందమైన బీచులను ఎంజాయ్ చేయాలంటే ఎక్కువ మంది గోవాకు వెళ్తుంటారు. ముఖ్యంగా మద్యం ప్రియులకైతే.. గోవా స్వర్గధామం. భారతదేశంలో అతి తక్కువ ధరకు మధ్యం విక్రయించే రాష్ట్రం ఏంటంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు గోవా. ఇదిలా ఉంటే గోవాలో ఇకపై మద్యం తక్కువ ధరకు రాబోదు. ఎందుకంటే అక్కడి ప్రభుత్వం బీర్లపై ఎక్సైజ్ సుంకాన్నీ పెంచించింది.
Chief Secretary physical assault on woman In Andaman and Nicobar: అండమాన్-నికోబార్ దీవుల మాజీ చీఫ్ సెక్రటరీతో పాటు మరో అధికారి తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డట్లు 21 ఏళ్ల మహిళ ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి నరైన్, లేబర్ కమిషనర్ ఆర్ఎల్ రిషిలు తనపై రెండు సార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని సదరు బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ…
Senior Cop K Vijay Kumar Resigns As Security Advisor Of Home Ministry: గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను అంతమొందించడంలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ పోలీస్ అధికారి కే. విజయ్ కుమార్ హోం మంత్రిత్వ శాఖ సీనియర్ భద్రతా సలహాదారు పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల విజయ్ కుమార్ రాజీనామా చేసినట్లు తెలిసింది. ఢిల్లీలోని తన నివాసాన్ని ఖాళీ చేసి చెన్నైకి మకాం మార్చారు విజయ్ కుమార్. తన పదవీకాలం అంతా తనకు సహకరించినందుకు ప్రధాని నరేంద్ర…
Rahul Gandhi criticizes BJP and RSS: భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక బళ్లారిలో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీజేపీపై ధ్వజమెత్తారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే బీజేపీ, ఆర్ఎస్ఎస్ పని అన్నారు. బీజేపీ దేశంలోని ప్రజలను విడదీస్తుందని చాలా మంది ప్రజలు అనుకుంటున్న నేపథ్యంలోనే ఈ యాత్రకు ‘ భారత్ జోడో యాత్ర’ అని పేరు పెట్టినట్లు తెలిపారు. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారిలో ప్రారంభం అయిన…
School Girl sets herself on fire after being ‘FORCED to remove clothes’ by teacher: జార్ఖండ్ రాష్ట్రంలో అమానుష సంఘటన జరిగింది. ఓ టీచర్ చేసిన అవమానం విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి కారణం అయింది. వివరాల్లోకి వెళితే 9వ తరగతి చదువుతున్న బాలిక యూనిఫాం దుస్తుల్లో చిట్టీలు పెట్టి పరీక్ష రాస్తుందని అనుమానించిన ఉపాధ్యాయురాలు సదరు బాలిక బట్టలను బలవంతంగా విప్పించింది. దీన్ని అవమానంగా భావించిన బాలిక నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తీవ్రంగా కాలిన […]