Army assault dog Zoom passed away: ఆర్మీ డాగ్ ‘జూమ్’ కన్నుమూసింది. రెండు రోజులుగా మృత్యువుతో పోరాడుతూ గురువారం చివరి శ్వాస విడిచింది. సోమవారం జమ్మూ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో కీలక పాత్ర పోషించింది జూమ్. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు జరుగుతున్న క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాడంలో కీలకంగా వ్యవహరించింది. ఈ ఆపరేషన్ సమయంలో జూమ్ కు రెండు బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఓ వైపు బుల్లెట్ గాయాలు అయినా కూడా.. జూమ్ మాత్రం ఇద్దరు…
College girl killed after being pushed in front of moving train in Chennai: చెన్నైలో దారుణం జరిగింది. ప్రేమను తిరస్కరించిందనే కోపంతో ఓ ప్రేమోన్మాది యువతిని రైలు కింద తోసేసి హత్య చేశాడు. ఈ ఘటన చెన్నైలోని సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్ లో గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు జరిగింది. అందరూ చూస్తుండగానే సతీష్ అనే వ్యక్తి 20 ఏళ్ల సత్యప్రియను తోసేయడంతో రైలు కింద పడి మరణించింది. సత్యప్రియ, సతీష్ ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించడంతోనే ఈ…
Airbus A380 to land in Bengaluru tomorrow for the First time: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానం ఎయిర్ బస్ ఏ380 తొలిసారిగా రేపు బెంగళూర్ కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి రానుంది. అక్టోబర్ 14న ఎమిరెట్స్ కు చెందిన ఎయిర్ బస్ ఏ380 బెంగళూర్ లో ల్యాండ్ అయ్యేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు విమానాశ్రయ అధికారులు. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానం రెండు వారాల తర్వాత భారత్ లో ల్యాండ్ అయ్యేలా ప్లాన్ చేశారు. అక్టోబర్ […]
Meenakshi Lekhi comments on pakistan: పాకిస్తాన్ దేశానికి మరోసారి మాడ పగిలే సమాధానం ఇచ్చింది ఇండియా. పదే పదే ప్రపంచ వేదికలపై జమ్మూ కాశ్మీర్, భారత్ తో మైనారిటీలు అణచివేతకు గురవుతున్నారంటూ పాకిస్తాన్ కట్టు కథలు చెబుతోంది. దీన్ని ఎప్పటికప్పుడు భారత్ తిప్పి కొడుతోంది. తాజాగా కజకిస్తాన్ వేదికగా జరుగుతున్న ఆరో సీఐసీఏ సమ్మిట్ లో తన వక్రబుద్ధి బయటపెట్టింది పాకిస్తాన్. దీనికి ప్రతిగా భారత విదేశీ వ్యవహారాల మంత్రి(స్వతంత్ర హోదా) మీనాక్షీ లేఖి గట్టిగానే సమాధానం ఇచ్చారు.
Abhishek Rao's custody extended in Delhi liquor scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్(సీబీఐ), ఈడీలు విచారణ కొనసాగిస్తున్నాయి. ఈ లిక్కర్ స్కామ్ లో హైదరాబాద్ కు చెందిన పలువురు ఉన్నట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఇప్పటికే అభిషేక్ రావును లిక్కర్ స్కామ్ లో సీబీఐ ఈ నెల 9న అరెస్ట్ చేసింది. మరుసటి రోజునే కోర్టు ముందు హాజరుపరిచారు. నేటితో అభిషేక్ రావు కస్టడీ ముగిసింది.
Ukraine joining NATO will lead to World War III, warns Putin's Russia: ఉక్రెయిన్ అమెరికా నేతృత్వంలోని నాటో కూటమిలో చేర్చుకుంటే.. మూడో ప్రపంచ యుద్ధం తప్పదని రష్యా వార్నింగ్ ఇచ్చింది. రష్యా భద్రతా మండలిలోని ఓ అధికారి గురువారం ఈ వ్యాఖ్యలను చేశారు. గత నెల సెప్టెంబర్ 30న రష్యా ఉక్రెయిన్ లోని 18 శాతం భూభాగాన్ని రష్యా తన దేశంలో కలుపుకుంది. ఉక్రెయిన్ లోని తూర్పు భాగాలైన ఖేర్సన్, జపొరిజ్జియా, లూహాన్స్క్, డోనెట్స్క్ ప్రాంతాలను ప్రజాభిప్రాయం ప్రకారం తన…
Lord Hanuman gets eviction NOTICE from Railways: జార్ఖండ్ రాష్ట్రంలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. తమ స్థలం కబ్జా చేశారంటూ ఏకంగా ‘‘భగవాన్ హనుమాన్’’కే నోటీసులు ఇచ్చింది రైల్వే శాఖ. ఈ ఘటన జార్ఖండ్‌లోని ధన్‌బాద్ నగరంలో చోటు చేసుకుంది. రైల్వే స్థలం ఆక్రమణకు గురైందని పేర్కొంటూ.. హనుమాన్ ఆలయాన్ని తొలగించి ఖాళీ చేయాలని ఆలయం గోడకు నోటీసులు అంటించారు. స్థలాన్ని 10 రోజుల్లో రైల్వే సెక్షన్ ఇంజనీర్ కు అప్పగించానలి కోరారు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. నేరుగా హనుమంతుడిని…
Love with school student. teacher arrested in POCSO: తమిళనాడులో ఓ స్టూడెంట్ ఆత్మహత్య సంచలనంగా మారింది. ప్రేమ పేరుతో తనను మహిళా టీచర్ మోసం చేసిందని చెబుతూ.. 12వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ముందుగా ఈ కేసులో చదువు ఇష్టం లేకపోవడంతోనే సదరు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని అనుకున్నప్పటికీ.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టీచర్-విద్యార్థి మధ్య ప్రేమనే విద్యార్థి మరణానికి కారణం అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సదరు టీచర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Nehru delayed Kashmir's accession to India not the Maharaja says union minister Kiren Rijiju: జమ్మూ కాశ్మీర్ భారత్ లో విలీనంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ చేసిన ట్వీట్లకు స్పందిస్తూ దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ విలీనాన్ని ఆలస్యం చేసింది జవహర్ లాల్ నెహ్రూనే అని.. జమ్మూ కాశ్మీర్ మహారాజు కాదని ఆయన ట్వీట్…
Tax On Cows Burps And Farts in New Zealand: న్యూజిలాండ్ ప్రభుత్వం సరికొత్త ప్రతిపాదనను తీసుకువచ్చింది. వాతావరణ మార్పులకు ఆవుల నుంచి వచ్చే గ్యాస్, త్రేన్పులు కూడా కారణం అవుతున్నాయి. అయితే వ్యవసాయ జంతువుల నుంచి ఉత్పత్తి అయ్యే గ్రీన్ హౌజ్ వాయువుపై కూడా పన్నులను విధించాలని న్యూజిలాండ్ ప్రతిపాదించింది. ఆవులు కడుపు నుంచి వచ్చే గ్యాసు కోసం రైతులపై పన్ను విధించాలని భావిస్తోంది. ఇలాగా పన్నులు వసూలు చేయడం ఇదే మొదటిసారి.