Russia-Ukraine War: ఉక్రెయిన్ నాటోలో చేరితే మూడో ప్రపంచ యుద్ధమే.. రష్యా వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ukraine joining NATO will lead to World War III, warns Putin’s Russia: ఉక్రెయిన్ అమెరికా నేతృత్వంలోని నాటో కూటమిలో చేర్చుకుంటే.. మూడో ప్రపంచ యుద్ధం తప్పదని రష్యా వార్నింగ్ ఇచ్చింది. రష్యా భద్రతా మండలిలోని ఓ అధికారి గురువారం ఈ వ్యాఖ్యలను చేశారు. గత నెల సెప్టెంబర్ 30న రష్యా ఉక్రెయిన్ లోని 18 శాతం భూభాగాన్ని రష్యా తనలో కలుపుకుంది. ఉక్రెయిన్ లోని తూర్పు భాగాలైన ఖేర్సన్, జపొరిజ్జియా, లూహాన్స్క్, డోనెట్స్క్ ప్రాంతాలను ప్రజాభిప్రాయం ప్రకారం రష్యాలో విలీనం అయ్యాయి.
ఈ పరిణామం జరిగిన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలిదిమిర్ జెలన్ స్కీ నాటో సైనిక కూటమిలో ఫాస్ట్ ట్రాక్ సభ్యత్వం కావాలని కోరారు. అయితే ఇది అనుకున్నంత ఈజీ కాదు. నాటోలో చేరానుకుంటే.. ముందుగా నాటోలో సభ్య దేశాలుగా ఉన్న 30 దేశాలు ఇందుకు ఒప్పుకోవాల్సి ఉంటుంది.
Also Read
- Donald Trump: ఫ్రాన్స్‌లో అల్లర్లు.. వలసదారులే కారణమన్న ట్రంప్, ‘సరిహద్దులు మూసేయండి’ అంటూ పిలుపు!
- Kilauea volcano: 55వ సారి కిలావుయా అగ్ని పర్వత విస్పోటనం..
- Pakistan Airspace Ban: భారత విమానాలపై పాకిస్తాన్ ఆంక్షలు.. గగనతల నిషేధం పొడిగింపు..
- Russia-US: డీజిల్ డీల్ తర్వాత.. అమెరికా-రష్యా మధ్య మరో భారీ ఒప్పందం..!
Read Also: Jharkhand: ఓ మై గాడ్.. “భగవాన్ హనుమాన్”కి రైల్వే శాఖ నోటీసులు..
ఇదిలా ఉంటే రష్యా భద్రతా మండలి డిప్యూటీ సెక్రటరీ అలెగ్జాండర్ వెనెడిక్టోవో మాట్లాడుతూ.. ఉక్రెయిన్ దేశం నాటో కూటమిలో చేరితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని అన్నారు. రష్యా అధ్యక్షడు వ్లాదిమిర్ పుతిన్ కు అత్యంత సన్నిహితుడు అయిన భద్రతా మండలి కార్యదర్శి నికోలాయ్ పెట్రుషేవ్ కు డిప్యూటీగా ఉన్నారు వెనెడిక్టోవ్. ఇటువంటి ఆత్మహత్య ప్రయత్నాలను నాటో దేశాలు అర్థం చేసుకున్నాయని అన్నారు. అణు యుద్ధం ప్రపంచానికి విపత్కర పరిణామాలను తీసుకువస్తుందని.. రష్యాపై నివారణ దాడులు చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ పిలుపు ఇవ్వడం ప్రమాదకరమని వెనెడిక్టోవ్ అన్నారు. అణు వివాదం మొత్త ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. రష్యానే కాకుండా మొత్తం వెస్ట్రన్ దేశాలు, ఈ గ్రహం మీద ఉన్న అన్ని దేశాలు, మొత్తం మానవాళికి వినాశకరమైనవని ఆయన అన్నారు.
గతంలో రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా, వెస్ట్రన్ దేశాలను హెచ్చరిస్తూ.. పరిస్థితి తీవ్రం అయితే అణు బాంబులు ప్రయోగించడానికి కూడా సిద్ధమే అని ప్రకటించారు. ప్రస్తుతం ప్రపంచంలో 90 శాతం అణు ఆయుధాలు రష్యా, అమెరికా వద్దనే ఉన్నాయి. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ కు అమెరికా, యూరోపియన్ దేశాలు, నాటో కూటమి సైనిక, ఆయుధ సహాయాన్ని అందిస్తోంది. అమెరికా ఇచ్చే ఆయుధాలతోనే ఉక్రెయిన్, రష్యాతో పోరాడుతోంది. 1962 క్యూబా క్షిపణి సంక్షోభం తర్వాత ప్రపంచం అతిపెద్ద అణు ప్రమాదాన్ని ఎదుర్కొంటుందని యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ ఇటీవల వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!