Lord Hanuman gets eviction NOTICE from Railways: జార్ఖండ్ రాష్ట్రంలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. తమ స్థలం కబ్జా చేశారంటూ ఏకంగా ‘‘భగవాన్ హనుమాన్’’కే నోటీసులు ఇచ్చింది రైల్వే శాఖ. ఈ ఘటన జార్ఖండ్‌లోని ధన్‌బాద్ నగరంలో చోటు చేసుకుంది. రైల్వే స్థలం ఆక్రమణకు గురైందని పేర్కొంటూ.. హనుమాన్ ఆలయాన్ని తొలగించి ఖాళీ చేయాలని ఆలయం గోడకు నోటీసులు అంటించారు. స్థలాన్ని 10 రోజుల్లో రైల్వే సెక్షన్ ఇంజనీర్ కు అప్పగించానలి కోరారు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. నేరుగా హనుమంతుడిని…
Love with school student. teacher arrested in POCSO: తమిళనాడులో ఓ స్టూడెంట్ ఆత్మహత్య సంచలనంగా మారింది. ప్రేమ పేరుతో తనను మహిళా టీచర్ మోసం చేసిందని చెబుతూ.. 12వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ముందుగా ఈ కేసులో చదువు ఇష్టం లేకపోవడంతోనే సదరు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని అనుకున్నప్పటికీ.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టీచర్-విద్యార్థి మధ్య ప్రేమనే విద్యార్థి మరణానికి కారణం అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సదరు టీచర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Nehru delayed Kashmir's accession to India not the Maharaja says union minister Kiren Rijiju: జమ్మూ కాశ్మీర్ భారత్ లో విలీనంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ చేసిన ట్వీట్లకు స్పందిస్తూ దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ విలీనాన్ని ఆలస్యం చేసింది జవహర్ లాల్ నెహ్రూనే అని.. జమ్మూ కాశ్మీర్ మహారాజు కాదని ఆయన ట్వీట్…
Tax On Cows Burps And Farts in New Zealand: న్యూజిలాండ్ ప్రభుత్వం సరికొత్త ప్రతిపాదనను తీసుకువచ్చింది. వాతావరణ మార్పులకు ఆవుల నుంచి వచ్చే గ్యాస్, త్రేన్పులు కూడా కారణం అవుతున్నాయి. అయితే వ్యవసాయ జంతువుల నుంచి ఉత్పత్తి అయ్యే గ్రీన్ హౌజ్ వాయువుపై కూడా పన్నులను విధించాలని న్యూజిలాండ్ ప్రతిపాదించింది. ఆవులు కడుపు నుంచి వచ్చే గ్యాసు కోసం రైతులపై పన్ను విధించాలని భావిస్తోంది. ఇలాగా పన్నులు వసూలు చేయడం ఇదే మొదటిసారి.
Supreme Court Order Likely Tomorrow on Karnataka Hijab Ban:కర్ణాటకలో ప్రభుత్వ హిజాబ్ ధరించి విద్యాలయాలకు రావడాన్ని నిషేధించింది. ప్రభుత్వ ఉత్తర్వులపై కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిగా.. హిజాబ్ అనేది ఇస్లాంలో తప్పనిసరి ఆచారం కాదని, హిజాబ్ ధరించి విద్యాలయాలకు రావడాన్ని నిషేధించింది. అయితే ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది. ఇదిలా ఉంటే హిజాబ్ బ్యాన్ పై సుప్రీంకోర్టు రేపు తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.
BYD Atto 3 EV car will enter the Indian market: చైనా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ బీవైడీ ( బిల్డ్ యువర్ డ్రీమ్) భారత మార్కెట్ లోకి కొత్తగా ఎలక్ట్రిక్ కారును తీసుకురాబోతోంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న టాటా నెక్సాన్ ఈవీ, ఎంజీ జెడ్ ఎస్ ఈవీ, హ్యుందాయ్ కోనా ఈవీలకు పోటీ ఇచ్చేందుకు సిద్ధం అయింది. బీవైడీ ఆట్టో 3 పేరుతో ఈవీ కారును లాంచ్ చేయబోతోంది. రూ. 50,000లతో ఈ ఎలక్ట్రిక్ ఎస్ యూ వీని బుక్…
Break for Bharat Jodo Yatra on October 17: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారు. ప్రస్తుతం కర్ణాటకలో పాదయాత్ర కొనసాగుతోంది. తరువాత ఏపీ, తెలంగాణ రాష్ట్రంలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది. ఇదిలా ఉంటే అక్టోబర్ 17న రాహుల్ పాదయాత్రకు బ్రేక్ పడనుంది. 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారత్ జోడో యాత్ర ఒక రోజు పాటు…
Olympian Sushil Kumar To Face Murder Trial For Junior Wrestler's Death: మే 2021లో మాజీ రెజ్లింగ్ ఛాంపియన్ సాగర్ ధంకర్ మరణించిన కేసులో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, రెజ్లర్ సుశీల్ కుమార్ హత్యానేర విచారణను ఎదుర్కొనున్నారు. బుధవారం సుశీల్ కుమార్ పై ఢిల్లీ కోర్టు హత్యా నేరాన్ని మోపింది. దీంతో పాటు 17 మందిపై హత్య, హత్యాయత్నం కేసులు నమోదు అయ్యాయి. అల్లర్లు, చట్టవిరుద్ధమైన సమావేశాలు, నేరపూరిత కుట్ర వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. పరారీలో…
PM Narendra Modi might inaugurate fourth Vande Bharat train: గురువారం రోజున హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నాలుగో వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లోని ఉనా జిల్లాలోన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ నుంచి ఉనాలోని అంబ్ అందౌరా రైల్వే స్టేషన్ల మద్య ఈ రైలు నడవనుంది. బుధవారం మినహా అన్ని రోజులు ఈ రైలు నడుస్తుంది. అంబాలా, చండీగఢ్, ఆనంద్ పూర్…
Pak's Sindh govt orders high-level probe as abducted Hindu girl: పాకిస్తాన్ లో ఇటీవల కిడ్నాపుకు గురైన 14 ఏళ్ల హిందూ బాలిక ఆచూకీ ఇంకా తెలియలేదు. దీంతో పాకిస్తాన్ సింధు ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. సింధు ప్రావిన్సులోని హైదరాబాద్ నగరంలోని ఫతే చౌక్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో బాలికను కిడ్నాప్ చేశారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో సింధ్ ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.