Himachal pradesh Election schedule: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తాజాగా ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 12న జరగనున్నాయి. ఒకే దశలో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుపుతామని.. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Vande Bharat Express: ఐదో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభానికి సిద్ధం అవుతుంది. నవంబర్ 10న ఈ రైలును ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు నాలుగు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభిస్తే అవన్ని ఉత్తర భారత దేశంలోనే పలు రూట్లలో నడుస్తున్నాయి. తాజాగా ఈ ఐదో వందే భారత్ రైలును దక్షిణాదిలో తొలిసారిగా ప్రారంభించబోతున్నారు. నవంబర్ నెలలో చెన్నై-బెంగళూర్-మైసూర్ మార్గంలో ఈ రైలును ప్రారంభించనున్నారు.
Gyanvapi Mosque issue: జ్ఞానవాపి మసీదు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది వారణాసి కోర్టు. హిందూ పక్షం తరుపు మసీదులోని వాజూఖానాలో బయటపడిన శివలింగానికి శాస్త్రీయ పరిశోధన జరగాలని.. కార్బన్ డేటింగ్ జరిపించాలని కోరుతూ కోర్టును కోరారు. అయితే శుక్రవారం రోజూ హిందూ పక్షం డిమాండ్ ను వారణాసి కోర్టు తిరస్కరించింది. హిందూ సంఘాల తరుపున వాదిస్తున్న వారికి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.
Physical violence against a woman every two hours in Pakistan: ప్రపంచ వేదికలపై నీతులు చెప్పే పాకిస్తాన్ తన దేశంలో జరుగుతున్న దారుణాలను మాత్రం పట్టించుకోవడం లేదు. అక్కడ మైనారిటీలు నిత్యం హింసకు గురవుతున్నారు. హిందూ బాలికలు, మహిళలు కిడ్నాపులకు గురవుతున్నారు. బాలికను కిడ్నాప్ చేస్తూ బలవంతంగా పెళ్లి చేసుకుని మతం మారుస్తున్నారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ లో ప్రతీ రెండు గంటలకు ఒక అత్యాచారం జరుగుతోంది.
Kerala Black Magic case: కేరళ పతినంతిట్ట జిల్లాలో ఇద్దరు మహిళలను అత్యంత కిరాతకంగా నరబలి ఇచ్చిన సంఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి కలిగించింది. అత్యంత ఆటవికంగా చనిపోయిన ఇద్దరు మహిళల శరీర భాగాలను వండుకుని తినడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. విచారణలో విస్తూ పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఒక మహిళ శరీరాన్ని 56 భాగాలుగా, మరో మహిళ శరీరాన్ని 5 భాగాలుగా ముక్కలు ముక్కలు చేశారు. జుగుప్సాకరంగా వారి శరీరభాగాలను వండుకుని తినడంతో పాటు బ్రెయిన్…
Maharashtra Tiger That Killed 13 Captured: మహారాష్ట్రలో చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పులిని ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. సీటీ-1గా పిలువబడుతున్న ఈ పులి గత కొంత కాలంలగా మహారాష్ట్రలోని విదర్భ జిల్లాలైన గడ్చిరోలి, చంద్రపూర్ జిల్లాల్లో పలువురిపై దాడి చేసి హతమార్చింది. ఈ ప్రమాదకరమైన పులిని గురువారం అధికారులు పట్టుకున్నారు. ఇప్పటివరకు 13 మందిని హతమార్చింది ఈ పెద్దపులి. గడ్చిరోలి జిల్లా వాడ్సా అటవీ ప్రాంతంలో సంచరిస్తూ ప్రజలపు దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తోంది.
Religion no basis for registering marriage, says Kerala High court: మతాంతర వివాహం కేసులో కేరళ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి మతం ప్రాతిపదిక కాకూడదని ఓ హిందూ జంట వేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ వివాహాన్ని రెండు వారాల్లో నమోదు చేయాలని ఆదేశాాలు జారీ చేసింది. దంపతుల తల్లిదండ్రులు వేరే మతానికి చెందిన వారు కావడంతో వివాహాన్ని రిజిస్టర్ చేయకపోవడం సరైన కారణం కాదని కేరళ హైకోర్టు పేర్కొంది.…
Army assault dog Zoom passed away: ఆర్మీ డాగ్ ‘జూమ్’ కన్నుమూసింది. రెండు రోజులుగా మృత్యువుతో పోరాడుతూ గురువారం చివరి శ్వాస విడిచింది. సోమవారం జమ్మూ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో కీలక పాత్ర పోషించింది జూమ్. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు జరుగుతున్న క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాడంలో కీలకంగా వ్యవహరించింది. ఈ ఆపరేషన్ సమయంలో జూమ్ కు రెండు బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఓ వైపు బుల్లెట్ గాయాలు అయినా కూడా.. జూమ్ మాత్రం ఇద్దరు…
College girl killed after being pushed in front of moving train in Chennai: చెన్నైలో దారుణం జరిగింది. ప్రేమను తిరస్కరించిందనే కోపంతో ఓ ప్రేమోన్మాది యువతిని రైలు కింద తోసేసి హత్య చేశాడు. ఈ ఘటన చెన్నైలోని సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్ లో గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు జరిగింది. అందరూ చూస్తుండగానే సతీష్ అనే వ్యక్తి 20 ఏళ్ల సత్యప్రియను తోసేయడంతో రైలు కింద పడి మరణించింది. సత్యప్రియ, సతీష్ ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించడంతోనే ఈ…
Airbus A380 to land in Bengaluru tomorrow for the First time: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానం ఎయిర్ బస్ ఏ380 తొలిసారిగా రేపు బెంగళూర్ కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి రానుంది. అక్టోబర్ 14న ఎమిరెట్స్ కు చెందిన ఎయిర్ బస్ ఏ380 బెంగళూర్ లో ల్యాండ్ అయ్యేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు విమానాశ్రయ అధికారులు. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ విమానం రెండు వారాల తర్వాత భారత్ లో ల్యాండ్ అయ్యేలా ప్లాన్ చేశారు. అక్టోబర్ […]