AAP MLA criticizes TRS party MLAs purchase case: బీజేపీ నిర్వహిస్తున్న ఆపరేషన్ లోటస్ ను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బట్టబయలు చేశారని అన్నారు ఆప్ ఎమ్మెల్యే అతిషి సింగ్. బీజేపీలో చేరేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 25 కోట్లను ఆఫర్ చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ఆఫర్ ఢిల్లీ సీఎం ముందుకు తీసుకువచ్చారని ఆమె అన్నారు. మొత్తం సీబీఐ, ఈడీ కేసులు మూసేస్తామని.. బీజేపీ నుంచి ముఖ్యమంత్రిని చేస్తామని ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆమె విమర్శించారు. మనీష్ సిసోడియాను సీబీఐ పిలిచిన సందర్భంలో కూడా…
AAP MP Sanjay Singh's comments on buying TRS MLAs: తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీపై విరుచుకుపడుతోంది. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేందుకు బీజేపీ ఆధ్వర్యంలో ఆపరేషన్ లోటస్ జరుతోందని ఆప్ఆ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. బీజేపీ ఆధ్వర్యంలోనే తెలంగాణలో ఆపరేషన్ లోటస్ జరుగుతోందని ఆయన అన్నారు. వందల కోట్లు ఖర్చుపెట్టి బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తోందని అన్నారు.
2 Teens Accused Of Theft Tied To Truck, Dragged On Road In Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అమానుష సంఘటన చోటు చేసుకుంది. ఇండోర్ నగరంలో దొంగతనం చేశారనే ఆరోపణలపై ఇద్దరు టీనేజర్లను దారుణంగా హింసించారు. ఇద్దరు మైనర్ బాలుర్నిని అత్యంత దారుణంగా కొట్టి వాళ్ల కాళ్లను ట్రక్కుకు కట్టేసి.. నడిరోడ్డుపై ఈడ్చుకు పోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఇండోర్‌లోని చోయిత్రం కూరగాయల మార్కెట్ లో చోటు చేసుకుంది.
Earthquake in Gadchiroli district: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో భూకంపం సంభవించింది. తెలంగాణలో సరిహద్దులను అనుకుని ఉన్న గడ్చిరోలి జిల్లాలో ఈ భూకంపం సంభవించింది. గడ్చిరోలి జిల్లా దక్షిణ ప్రాంతం సిరోంచా తాలుకాలోని ఉమనూర్-జింగనూర్ ప్రాంతంలో భూకంప కేంద్రం కేంద్రీకృతం అయింది.
Gujarat Government's Big Move On Uniform Civil Code: గుజరాత్ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగనున్నాయి. ఇప్పటికే ఉత్తరాఖండ్ రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం, రేపో మాపో గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ కూ0డా విడుదల చేయనుంది. ఇదిలా ఉంటే గుజరాత్ లో మరోసారి అధికారం చేపట్టాలని బీజేపీ అనుకుంటోంది. కాంగ్రెస్, ఆప్ పార్టీలు మాత్రం బీజేపీని అధికారం నుంచి గద్దె దించాలని పోరాడుతున్నాయి.
Donald Trump's key comments on Elon Musk's Twitter Takes Over: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ ను ఎట్టకేలకు సొంతం చేసుకున్నారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఊగిసలాటకు తెరదించారు. రావడం రావడంతోనే పలువురు కీలక ఉద్యోగులను తొలగించారు మస్క్. సీఈఓ పరాగ్ అగర్వాల్ తో పాటు, సీఎఫ్ఓ నెడ్ సెగల్, జనరల్ కౌన్సిల్ సీన్ ఎడ్జెట్, లీగల్ పాలసీ అధికారిని విజయగద్దెను తొలగించారు. ఇదిలా ఉంటే యూఎస్ఏ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,…
Kangana Ranaut's key comments on contesting the Lok Sabha elections: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎప్పుడు ఏదో విధంగా వార్తల్లో ఉంటూనే ఉంటారు. తాజాగా ఆమె రాజకీయాల గురించి మనసులో మాట బయటపెట్టింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని చెప్పారు. ప్రజలు కోరుకుంటే మండి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. నేషనల్ ఛానెల్ కు ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.…
Manish Sisodia's comments on buying TRS MLAs: తెలంగాణలో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. బీజేపీ అడ్డగోలుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్పందించారు. దేశంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆపరేషన్ లోటస్ పేరుతో వికృత క్రీడ నడుస్తోందని ఆయన అన్నారు. తెలంగాణలో ఆపరేషన్ లోటస్ బట్టబయలైందని అన్నారు. ప్రజల ఓట్లతో ఎన్నికైన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని చూస్తోందని విమర్శించారు.
Prime Minister Modi congratulates Rishi Sunak: యూకే ప్రధాని పదవిని చేపట్టబోతున్నారు రిషి సునక్. యూకే ప్రధానిగా తొలిసారిగా ఓ భారతీయ సంతతి వ్యక్తి ఎన్నికయ్యారు. లిజ్ ట్రస్ రాజీనామాతో యూకేలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. మరోసారి ప్రధాని ఎన్నిక అనివార్యం అయింది. అయితే ప్రధాని రేసులో రిషి సునాక్ తో పాటు పెన్నీ మోర్డాంట్, బోరిస్ జాన్సన్ ఉన్నా.. చివరకు వారిద్దరు విరమించుకోవడంతో ఏకగ్రీవంగా రిషి సునాక్ విజయం సాధించారు. ప్రస్తుతం బ్రిటన్ ఉన్న పరిస్థితుల నుంచి రిషి సునాక్ గట్టెక్కిస్తారని…
Electrical Vehicles Tax Benefit:భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) జోరు పెరిగింది. గతంలో పోలిస్తే ఇటీవల సంవత్సరాల్లో ఈవీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో వినియోగదారుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్తున్నాడు. ద్విచక్ర వాహనాలతో పాటు కార్లను కొనుగోలు చేస్తున్నారు. రానున్న కాలంలో ఛార్జింగ్ సమస్యలు తీరేలా మౌళిక సదుపాయాలు మెరుగుపడితే మరింత మంది ఈవీలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈవీ వాహనాలు కొనుగోలు చేసేవారికి కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తోంది ప్రభుత్వం. సాధారణంగా పెట్రోల్,…