Tata Cars Price Hike: దేశీయ ఆటోమొబైల్స్ దిగ్గజం టాటా మోటార్స్ బాంబ్ పేల్చింది. టాటా కారు కొందాం అని అనుకునే వారు త్వరపడండి. ఎందుకంటే మే 1 నుంచి కార్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇన్ పుట్ ఖర్చులు పెరగడంతో పాక్షికం ధరలను పెంచుతున్నట్లు, మే 1 నుంచి తమ ప్యాసింజర్ ధరలు పెరుగుతాయని తెలిపింది. వేరియంట్స్, మోడల్స్ ఆధారంగా సగటున 0.6 శాతం పెరుగుదల ఉంటుందని టాటా మోటార్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
Read Also: Gangster Atiq Ahmed: తండ్రి కాన్వాయ్‌పై దాడికి అసద్ ప్లాన్.. వెలుగులోకి సంచలన విషయాలు ..
ఫిబ్రవరిలో ఇలాగే టాటా కార్ల ధరలను పెంచింది. రెండు నెలల వ్యవధిలో రెండోసారి మళ్లీ పెంచింది. కార్ల తయారీలో ఖర్చులు పెరగడంతోనే కంపెనీ ధరలను పెంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టాటా కార్లు మంచి అమ్మకాలను నమోదు చేస్తున్నాయి. నెక్సాన్, నెక్సాన్ ఈవీ వంటి కార్లు ఎస్ యూ వీ, ఈవీ సెగ్మెంట్లలో టాప్ గా ఉన్నాయి. దీంతో పాటు టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్, పంచ్, హారియర్, సఫరా వంటి కార్లను విక్రయిస్తోంది. వీటి అన్నింటి ధరలు రూ. 5.54 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉన్నాయి.
ఈ ఏడాది టాటా తన ఐసీఈ ఇంజన్ ఫోర్ట్ ఫోలియోలో సగటున 1.2 శాతం ధరలను పెంచింది. ప్రస్తుతం ఈవీ విభాగంలో మరిన్ని కార్లను తీసుకురావాలని టాటా యోచిస్తోంది. ఇప్పటికే హారియర్ ఈవీని తీసుకువస్తున్నట్లు ఇటీవల జరిగిన ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించింది. మరోవైపు సీఎన్జీ వైపు కూడా టాటా దృష్టి సారించింది.