Matrimonial fraud: ఈ మధ్య మాట్రిమోనీ మోసాలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి. బయట పెద్దలు కుదిర్చే సంబంధాలకు విలువే లేకుండా పోతోంది. ముఖ్యంగా చాలా మంది తల్లిదండ్రులు కూడా తమ అమ్మాయికి మంచి భర్తను తీసుకురావాలని భావిస్తూ ఈ మాట్రిమోనీ వెబ్ సైట్లపై ఆధారపడుతున్నారు. మంచి ఉద్యోగం, ఆస్తులు, కార్లు, విల్లాలు ఉన్న వ్యక్తుల్ని వెతికి మరీ పట్టుకుంటున్నారు. తమకు దగ్గరి బంధువుల నుంచి వచ్చే అబ్బాయిలను అసలు పట్టించుకోవడమే లేదు. అయితే అయితే తల్లిదండ్రులు, అమ్మాయిల ఆశ ఓ రకంగా చెప్పాలంటే అత్యాశ వారికి శాపంగా మారుతోంది. సాఫ్ట్వేర్ జాబ్, ఆస్తులు, విల్లాలు, కార్లను చూపిస్తూ అమ్మాయిలను మోసం చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరిగాయి. పెళ్లి తర్వాత విషయం తెలిసిన ఏం చేయలేని పరిస్థితిలో అమ్మాయి, ఆమె తల్లిదండ్రులు ఉంటున్నారు.
ఇదిలా ఉంటే సేమ్ ఇలాగే ఓ వ్యక్తి ‘‘రిచ్ కిడ్’’గా కలరింగ్ ఇస్తూ లగ్జరీ కార్లు, విల్లాల ఫోటోలు పెడుతూ మాట్రిమోనీలో ఉండే అమ్మాయిలను మోసం చేస్తున్నాడు. తాజాగా అతడి బాగోతాలు బయటపడ్డాయి. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. సైట్ లో ఉండే ‘‘రిచ్ బ్యాచిలర్’’ మహిళలే టార్గెట్ గా లక్షల్లో మోసం చేస్తున్నాడు. ఇలా మోసానికి పాల్పడుతున్న ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన 26 ఏళ్ల యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: RCB vs DC: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో నివాసముంటున్న విశాల్, తనకు తగిన వధువు కోసం వెతుకుతున్న అని చెబుతూ ధనవంతుడిగా బిల్డప్ ఇస్తూ..మహిళలను ట్రాప్ చేస్తున్నాడు. గుర్గావ్ సమీపంలోని విల్లాలు, లగ్జీరీ కార్లతో దిగిన ఫోటోలను సైట్ లోని అమ్మాయిలకు పంపేవాడు. ఓ ఎంఎన్సీ కంపెనీలో పనిచేసే విశాల్ ఓ కంపెనీ పెట్టి లాస్ అయ్యాడు. ఆ తరువాత ఈ మాట్రిమోనియల్ ఫ్రాడ్ చేస్తూ మహిళల్ని మోసం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో రూ. 3.05 లక్షలు నష్టపోయిన ఓ మహిళ కేశవపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తాను ఓ కంపెనీలో హెచ్ఆర్ చెప్పుకుని తనకు ఏడాదికి రూ. 50-70 లక్షల ఆదాయం వస్తుందని చెప్పడంతో మహిళతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా నమ్మారు.
ఇద్దరి మధ్య చనువు పెరగడంతో ఆమె కోసం ఖరీదైన కార్లు, విల్లాలు కొంటున్నట్లు బిల్డప్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్ తక్కువ ధరకు ఇప్పిస్తాని ఆఫర్ చేశాడు. దీంతో పాటు ఆమె స్నేహితులను కూడా ఒప్పించాలని కోరాడు. ఇదంతా తెలియని సదరు మహిళ యూపీఐ ద్వారా రూ. 3.05 లక్షలను ట్రాన్స్ఫర్ చేసింది. ఆ తర్వాత ఆమెను సోషల్ మీడియాలో బ్లాక్ చేసి స్పందిండం మానేశాడు. దీంతో మోసపోయాని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.