Prime Minister Modi congratulates Rishi Sunak: యూకే ప్రధాని పదవిని చేపట్టబోతున్నారు రిషి సునక్. యూకే ప్రధానిగా తొలిసారిగా ఓ భారతీయ సంతతి వ్యక్తి ఎన్నికయ్యారు. లిజ్ ట్రస్ రాజీనామాతో యూకేలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. మరోసారి ప్రధాని ఎన్నిక అనివార్యం అయింది. అయితే ప్రధాని రేసులో రిషి సునాక్ తో పాటు పెన్నీ మోర్డాంట్, బోరిస్ జాన్సన్ ఉన్నా.. చివరకు వారిద్దరు విరమించుకోవడంతో ఏకగ్రీవంగా రిషి సునాక్ విజయం సాధించారు. ప్రస్తుతం బ్రిటన్ ఉన్న పరిస్థితుల నుంచి రిషి సునాక్ గట్టెక్కిస్తారని…
Electrical Vehicles Tax Benefit:భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) జోరు పెరిగింది. గతంలో పోలిస్తే ఇటీవల సంవత్సరాల్లో ఈవీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో వినియోగదారుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్తున్నాడు. ద్విచక్ర వాహనాలతో పాటు కార్లను కొనుగోలు చేస్తున్నారు. రానున్న కాలంలో ఛార్జింగ్ సమస్యలు తీరేలా మౌళిక సదుపాయాలు మెరుగుపడితే మరింత మంది ఈవీలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈవీ వాహనాలు కొనుగోలు చేసేవారికి కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తోంది ప్రభుత్వం. సాధారణంగా పెట్రోల్,…
Hungarian PM attacks European Union over sanctions against Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించడం లేదు. రోజురోజు ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. రష్యా ఆక్రమిత భూభాగం అయిన క్రిమియాలోని కేర్చ్ బ్రిడ్జిని ఉక్రెయిన్ కూల్చేయడంతో రష్యా ఆగ్రహాన్ని చవిచూస్తోంది ఉక్రెయిన్. ఇరాన్ తయారీ ‘‘కామికేజ్’’ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇదిలా ఉంటే ఈ యుద్ధ ప్రభావం ప్రపంచదేశాలపై పడుతోంది. ముఖ్యంగా ఆహారం, ఇంధన సంక్షోభాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా యూరోపియన్ దేశాలు ఇంధన సంక్షోభాన్ని…
UK Economic crisis welcoming Rishi Sunak: యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానిగా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 28న బ్రిటన్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. పెన్నీ మోర్డాంట్ తప్పుకోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బ్రిటన్ లో ఉన్న సమస్యలను రిషి సునాక్ మాత్రమే పరిష్కరిస్తారని చాలా మంది ఎంపీలు భావిస్తున్నారు. దీంతో మెజారిటీ ఎంపీలు రిషికే జై కొట్టారు. ఇదిలా ఉంటే కొత్తగా ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్ కు సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి.
1-Year-Old Attacked By Leopard In Mumbai's Aarey, Dies: వాణిజ్య నగరం ముంబై శివార్లలో చిరుతపులి దాడి చేసింది. ఏడాది బాలుడిపై దాడి చేసి చంపేసింది. శివారు ప్రాంతమైన గోరేగావ్ లోని ఆరే కాలనీలో అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం ఏడాది చిన్నారిపై దాడి చేసింది. ఆరే కాలనీ యూనిట్ నెంబర్ 15లో ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లితో కలిసి సమీపంలో ఉన్న గుడికి వెళ్తున్న క్రమంలో చిరుత దాడి చేసిందని పోలీసులు తెలిపారు. దాడి జరిగిన తర్వాత చిన్నారిని ఆస్పత్రికి తరలించినా…
Reunited after 21 YEARS, Gujarat school student meets PM Modi: సరిగ్గా 21 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరు మళ్లీ ముఖాముఖిగా కలుసుకున్నారు. ఇంతకీ ఎవరనుకుంటున్నారా..? 21 ఏళ్ల క్రితం విద్యార్థిగా ఉన్నప్పుడు మోదీ నుంచి పతకాన్ని అందుకున్న విద్యార్థి, ఆర్మీ మేజర్ గా మళ్లీ ప్రధానిని కలిశారు. దీపావళి వేళ ఈ అద్భుత జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ కార్గిల్ లో భారత జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నారు. సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు.
Rishi Sunak's Indian Connections: భారతదేశాన్ని శతాబ్ధాల పాటు పాలించిన బ్రిటన్ కు తొలిసారి భారతీయ మూలాలు ఉన్న రిషి సునాక్ ప్రధాని పదవిని చేపట్టడం దాదాపుగా ఖాయమైంది. ప్రస్తుతం యూకే ఉన్న ఆర్థిక పరిస్థితి నుంచి ఒక్క రిషి సునాక్ మాత్రమే గట్టేక్కించగలడనే అభిప్రాయం అక్కడి ప్రజాప్రతినిధుల్లో ఉంది. దీంతో మెజారిటీ ఎంపీలు రిషి సునాక్ కే మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే 170కి పైగా ఎంపీలు మద్దతు తెలిపారు. మరోవైపు సునాక్ ప్రత్యర్థిగా ఉన్న పెన్నీ మోర్డాంట్ కు కేవలం 29 మంది…
PM Narendra Modi celebrates Diwali with army: సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ, భారత సైనికులతో దీవపాళి వేడుకలను జరుపుకున్నారు. కార్గిల్ సెక్టార్ లో భారత సైనికులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు. 2014లో అధికారం చేపట్టిన తర్వాత ప్రతీ దీపావళిని సైనికులతోనే జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సైనికులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. అధికారం లేకుండా శాంతిని పొందడం అసాధ్యమని సైనికులతో అన్నారు. తమ ప్రభుత్వం యుద్ధాన్ని చివరి ఎంపికగా భావిస్తుందని ప్రధాని అన్నారు.
Coimbatore Cylinder Blast: తమిళనాడు కోయంబత్తూర్ నగరంలో గ్యాస్ సిలిండర్ పేలుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనలో ఉగ్రలింకులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పేలుడుకు ముందు కారులో గ్యాస్ సిలిండర్ పెట్టడానికి ముబిన్ అనే వ్యక్తి ఇంటి నుంచి సిలిండర్ తీసుకుని వస్తున్న నలుగురు యువకులు వీడియోలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కోయంబత్తూర్ ఉక్కడంలోని దేవాలయం సమీపంలో ఆదివారం ఎల్పీజీ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. అయితే ఈ పేలుడుపై తమిళనాడు పోలీసులు విచారణ…
Ebola outbreak in Uganda: ఉగాండాలో ఎబోలా కలకలం రేపుతోంది. ఆ దేశంలో వరసగా ఎబోలా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా రాజధాని కంపాలాలో కొత్తగా 9 ఎబోలా కేసులు నమోదయ్యాయి. గత రెండు రోజుల్లో మొత్తం 14 కేసులు నమోదు అయ్యయాని అక్కడి ఆరోగ్య మంత్రి సోమవారం తెలిపారు. సెప్టెంబర్ నెలలో సెంట్రల్ ఉగాండాలోని గ్రామీణ ప్రాంతంలో ఎబోలా వ్యాప్తి ప్రారంభం అయింది. ఈ నెలలో రాజధాని కంపాలాకు ఈ వ్యాధి వ్యాపించింది. 16 లక్షల జనాభా ఉంటే కంపాలాలో వ్యాధి వ్యాపిస్తుండటం…