Nexon EV Max: టాటా నెక్సాన్ భారతదేశంలోనే అత్యంత సురక్షితమైన, అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ కారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని ఎస్‌యూవీ కార్ల కన్నా అత్యధిక సేల్స్ లో తొలిస్థానంలో ఉంది. మరోవైపు నెక్సాన్ ఈవీ కూడా అమ్మకాల్లో దుమ్మురేపుతోంది. ఈవీ సెగ్మెంట్ లో నెక్సాన్ ఈవీ కార్ బెస్ట్ సెల్లర్ గా ఉంది. దీని తర్వాత స్థానాల్లోనే ఇతర కంపెనీల ఈవీ కార్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే టాటా నెక్సాన్ విషయంలో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుత నెక్సాన్ ఈవీ, నెక్సాన్ ఈవీ ప్రైమ్ వేరియంట్లో ఉన్న డార్క్ ఎడిషన్ త్వరలోనే నెక్సాన్ ఈవీ మాక్స్ లో అందుబాటులోకి రానున్నట్లు సంస్థ వెల్లడించింది. టాటా మోటార్స్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘‘ ది డార్క్ సైడ్ ఆఫ్ హై డెఫినేషన్. గెట్స్ రిఫైన్డ్. డార్క్ టూ ద మాక్స్ కమింగ్ సూన్’’ అంటూ ట్వీట్ చేసింది.
ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్స్‌లో మార్పులు:
నెక్సాన్ ఈవీ మాక్స్ డార్క్ ఎడిషన్ లో భారీ మార్పులు చేయనున్నట్లు సమాచారం. ఎక్స్‌టీరియర్స్, ఇంటీరియర్ లో కొత్తదనం కనిపించబోతోంది. ఓవరాల్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ ఉండబోతోంది. క్యాబిన్ కూడా బ్లాక్ థీమ్ తో రాబోతోంది. చార్ కోల్ గ్రే అల్లాయ్ వీల్స్, పియానో బ్లాక్ డాష్ బోర్డ్, క్యాబిన్ లో పలు స్టైలిష్ ఛేంజేస్ చేయనుంది. దీంతో పాటు కొన్ని న్యూ ఫీచర్లను ఇంక్లూడ్ చేయనుంది. టాటా హారియర్ లో ఇచ్చిన విధంగా 10.25 ఇంచుల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ను తీసుకురానున్నట్లు సమాచారం. సన్ రూఫ్ వంటి సదుపాయాలను తీసుకువస్తోందని సమాచారం.
గతేడాది మేలో టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీ మాక్స్ ను తీసుకువచ్చింది. లాంగ్ రేంజ్ వచ్చే విధంగా పెద్ద బ్యాటరీ సెటప్ తో ఇది మార్కెట్లోకి వచ్చింది. రూ. 17.74 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్ లో లాంచ్ అయింది. ARAI ప్రకారం 437 కిలోమీటర్ల రేంజ్ ఒక్క ఛార్జ్ తో ఇస్తుందని ప్రకటించింది. ఎంజీ జెడ్ఎస్ ఈవీ, హ్యుందాయ్ కోనాకు నెక్సాన్ ఈవీ మాక్స్ గట్టి పోటీ ఇస్తోంది. దీంతో 4.5 kWh బ్యాటరీని సెటప్ చేశారు. నెక్సాన్ ఈవీ తో పోలిస్తే 30 శాతం అదనపు పవర్ ఇస్తుంది. 143 హెచ్పీ పవర్, 250 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. నెక్సాన్ ఈవీ మ్యాక్స్ XZ+, XZ+Lux అనే రెండు వేరియంట్లలో లభిస్తోంది.