Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
- సింధు జలాల కోసం భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలి..
- కెనడాను కోరిన పాకిస్తాన్, స్పందన కరువు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందం (Indus Waters Treaty-IWT) పునరుద్ధరణ కోసం భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని కెనడాను పాకిస్తాన్ కోరింది. అయితే, దీనిపై పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కెనడా విదేశాంగ మంత్రి అనిత ఆనంద్ పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన సమయంలో, ఆమె ముందు పాకిస్తాన్ తన కోరికను వెల్లడించింది. ఇస్లామాబాద్‌లో జరిగి సంయుక్త సమావేశంలో పాక్ చేసిన విజ్ఞప్తిపై కెనడా విదేశాంగ మంత్రి అనిత ఆనంద్ అసలు స్పందించలేదు.
పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ, సింధు జలాల ఒప్పందాన్ని వెంటనే పునరుద్ధరించేందుకు భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని కెనడాతో పాటు మిత్రదేశాలకు విజ్ఞప్తి చేశారు. నీటిని ఆయుధంగా వాడటాన్ని వ్యతిరేకించాలని ఆయన కోరారు. అయితే, భేటీ అనంతరం కెనడా విడుదల చేసిన అధికారిక ప్రకటనలో సింధు జలాల ఒప్పందం, పాకిస్తాన్ విజ్ఞప్తిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారంపై మాత్రమే కెనడా తన ప్రకటనను పరిమితం చేసింది.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
సాయం కోరుతున్న పాక్:
2025 ఏప్రిల్ నెలలో జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ దాడి తర్వాత భారత్ ‘‘సింధు జలాల ఒప్పందాన్ని’’ నిలిపేసింది. రక్తం, నీరు కలిసి ప్రవహించదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. దీంతో పాకిస్తాన్లో భయం మొదలైంది. సింధు జలాల ఒప్పందంపై మిత్ర దేశాల సాయాన్ని కోరుతోంది. భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తోంది. ఉగ్రవాదం ఆపేవరకు నీరు ఇవ్వమనే గట్టి నిర్ణయంపై భారత్ ఉంది.
1960లో ప్రపంచబ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్-పాక్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం మూడు తూర్పు నదులపై భారత్‌కు, మూడు పశ్చిమ నదులపై పాకిస్తాన్‌కు హక్కులు కల్పించారు. వివాదాల పరిష్కారం కోసం శాశ్వత సింధు కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. అయితే, ఈ ఒప్పందాన్ని ఏకపక్షంగా నిలిపేసే అధికారం లేదని పాకిస్తాన్ వాదిస్తోంది. ఉగ్రవాదం ఆపే వరకు నీరు ఇచ్చేది లేదని భారత్ తెగేసి చెబుతోంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!