Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ది హండ్రెడ్ టోర్నీలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ రూ. 2.45 కోట్లకు కొనుగోలు చేయడం పెద్ద వివాదానికి దారితీసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ , సన్‌రైజర్స్ లీడ్స్ యజమాని కావ్య మారన్ ఈ వేలంలో స్వయంగా పాల్గొని అబ్రార్‌ను దక్కించుకున్నారు. అయితే పాకిస్థాన్ ఆటగాళ్ల ఎంపికపై చెలరేగిన వివాదంపై మాట్లాడటానికి ఆమె నిరాకరించారు. ది టెలిగ్రాఫ్‌తో జరిగిన సంభాషణలో ఈ ఘటనపై స్పందిస్తూ, వివాదాస్పద అంశాలను దాటవేసి.. తమ పురుషుల, మహిళల జట్ల పట్ల చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. తాము అన్ని విభాగాల్లో సమర్థులైన ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నామని మాత్రమే ఆమె వ్యాఖ్యానించారు.
మరోవైపు.. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ జాకబ్ బెథెల్ కుడి మోకాటి గాయం కారణంగా ఈ ఏడాది ది హండ్రెడ్ టోర్నీ నుంచి వైదొలిగాడు. ఇది బర్మింగ్‌హామ్ ఫోనిక్స్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. 21 ఏళ్ల బెథెల్‌ను బర్మింగ్‌హామ్ ఫోనిక్స్ రూ. 3.65 కోట్లకు నిలుపుకోవడమే కాకుండా, 2026 సీజన్‌కు కెప్టెన్‌గా కూడా ప్రకటించింది. ఇటీవల ఇండియాతో జరిగిన వన్డే సిరీస్ సమయంలో గాయపడిన బెథెల్‌కు సోమవారం ఉదయం ఎంఆర్ఐ స్కాన్ చేయగా గాయం తీవ్రత వెలుగులోకి వచ్చింది. దీంతో అతను టోర్నీకి దూరం కాక తప్పలేదు.
Also Read
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
గాయం తీవ్రత కారణంగా వచ్చే నెలలో పాకిస్థాన్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌లో కూడా బెథెల్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. ఆగస్టు 19న హెడింగ్లే వేదికగా మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB) అతను కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో స్పష్టం చేయలేదు కానీ పునరావాస ప్రక్రియ ప్రారంభమైందని తెలిపింది. స్వదేశీ అభిమానుల ముందు ఆడలేకపోవడం .. కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం కోల్పోవడంపై బెథెల్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. త్వరలోనే పూర్తి ఫిట్నెస్ సాధించి పునరాగమనం చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్ భవిష్యత్తు నాయకుడిగా పేరుగాంచిన బెథెల్ వైదొలగడం బర్మింగ్‌హామ్ ఫోనిక్స్ జట్టును ఆందోళనకు గురిచేసింది.
తాజావార్తలు
-
Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!